S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/12/2020 - 05:47

కోల్‌కతా, జనవరి 11: దేశ తూర్పు ప్రాంతంలో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయి, స్టీల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. తూర్పు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘పూర్వోదయ’ కార్యక్రమాన్ని ప్రధాన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు రాష్ట్రాల్లో ఉక్కు, బాక్సైట్ నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయని అన్నారు.

01/12/2020 - 05:46

పెన్షన్ విధానాన్ని మారుస్తూ ఫ్రాన్స్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బోర్డియాక్స్‌లో జరిగిన భారీ ప్రదర్శన. ట్రాన్స్‌పోర్ట్ రంగంలో చేసిన మార్పులకు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, తాజాగా పెన్షన్ విధానం మార్చడం మరింత గందరగోళానికి దారి తీసింది.

01/12/2020 - 05:40

ముంబయ, జనవరి 11: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగొడిగా సాగుతున్న ప్రభావం ఈవారం భారత స్టాక్ మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపించింది. ఆటుపోట్ల నడుమ ట్రేడింగ్ కొనసాగింది. అయితే భారీ నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం నుంచి బయటపడి, స్వల్ప లాభాలతో గట్టెక్కింది.

01/10/2020 - 06:11

విశాఖపట్నం: నాణ్యతతో కూడిన విద్యుత్‌ను సరఫరా చేస్తూనే సాంకేతిక, వాణిజ్యపరమైన నష్టాలను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఏపీఈపీడీసీఎల్) దేశంలోనే అగ్రగామి విద్యుత్ సంస్థగా నిలుస్తోంది. దేశంలో ఇటువంటి విద్యుత్ పంపిణీ సంస్థలు 50కి పైగా ఉండగా ఇందులో ఏపీలో ఐదు జిల్లాలతో కూడిన ఈపీడీసీఎల్ రెండు విధాలైన విద్యుత్ నష్టాలను తగ్గించ గలుగుతోంది.

01/10/2020 - 06:00

హైదరాబాద్, జనవరి 9: సంక్రాంతి సందర్భంగా విశాఖ, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే నగరవాసుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈనెల 12.19 తేదీల్లో (08523- 08524) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు 4 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. విశాఖ- విజయవాడకు (08525- 08526) 4ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు డబల్‌డక్కర్ ఏసీ రైళును నడుపుతున్నారు.

01/10/2020 - 05:38

విజయవాడ(సిటీ), జనవరి 9: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తట్టుకుంనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లును చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఏపీలోని వివిధ ప్రాంతాలకు సుమారుగా 4200 ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. అయితే హైదరాబాద్‌లో అత్యధికంగా రద్దీ ఉండే ఎంజీబీఎస్‌లో కొన్ని మార్పులను చేసింది.

01/10/2020 - 05:34

విజయవాడ, జనవరి 9: మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలకు సంబంధించి కనీస మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. మిర్చికి క్వింటాల్‌కు 7 వేల రూపాయలు, పసుపునకు 6350 రూపాయలు, ఉల్లికి 770 రూపాయలు, చిరుధాన్యాలు (కొర్రలు, అండుకొర్రలు, అరికలు, వరిగలు, ఊదలు, సామలు)కు 2500 రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించింది.

01/09/2020 - 23:44

ముంబయి, జనవరి 9: భారత స్టాక్ మార్కెట్లలో గురువారం బుల్ రన్ కొనసాగింది. విదేశీ పెట్టుబడిదారులు కొనుగోళ్లపై దృష్టి కేంద్రీకరించడంతో, బాంబే స్టాక్ ఏక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) లాభాల్లో నడిచాయి. బీఎస్‌ఈలో లావాదేవీలు ప్రారంభమైన వెంటనే మొదలైన కొనుగోళ్ల పరుగు చివరి వరకూ కొనసాగింది.

01/09/2020 - 23:42

విజయవాడ, జనవరి 9: రాష్ట్రంలోని 4 సహకార చక్కెర కర్మాగారాలకు 100 కోట్ల రూపాయల మేర రుణానికి సంబంధించి పాలనా ఆమోదాన్ని రాష్ట్ర ప్రభుత్వం గురువారం తెలిపింది. నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) రెండో విడతగా ఈ నిధులను విడుదల చేయనుంది.

01/09/2020 - 23:41

లండన్, జనవరి 9: లండన్ నుంచి బెంగళూరుకు లగ్జరీ విమాన సర్వీసును ప్రారంభించినట్టు బ్రిటిష్ ఎయిర్‌వేస్ గురువారం ప్రకటించింది. అత్యాధునిక హంగులతో కూడిన ఈ సర్వీసులో ‘క్లబ్ సూట్’ అని పిలిచే లగ్జరీ ప్రైవేట్ సూట్ ఉంటుంది. ఇందులో ప్రయాణిస్తే, ఇతర ప్రయాణికులతో సంబంధం లేకుండా, ఒక హోటల్ రూమ్‌లో కూర్చున్న అనుభవం కలుగుతుంది. ప్రత్యేక క్యాబిన్, వెనక్కు వాలడానికి వీలుగా సీట్లు, దిండ్లు కూడా ఉన్నాయి.

Pages