S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/14/2020 - 05:18

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అమ్మకాలు, రూపాయి మారక విలువ పెరిగిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు 10 గ్రాములకు 236 రూపాయలు తగ్గాయి. ఈ తగ్గుదలతో బంగారం 10 గ్రాముల రేటు 40.342 రూపాయలకు చేరుకుంది. అలాగే వెండి ధరలు కిలోకు 376 రూపాయలు తగ్గాయి. దీంతో వెండి కిలో ధర 47,635 రూపాయలకు చేరుకుంది.

01/14/2020 - 04:35

హైదరాబాద్, జనవరి 13: భారతీయ రైల్వే తొలుత ప్రయాణికుల రైళ్లను దశలవారీగా ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడానికి కేంద్రం సన్నాహాలు వేగవంతం చేస్తోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రైవేట్ సంస్థలను ప్రోత్సస్తోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రైవేట్ రైళ్లు పరుగుతీయనున్నాయి.

01/13/2020 - 23:43

హైదరాబాద్, జనవరి 13: ఈపీఎఫ్ పెన్షన్‌దారులు ఇకమీదట ప్రతి ఏడాది నవంబర్‌లో ‘జీవన్ ప్రమాణ్ (లైఫ్ సర్ట్ఫికేట్)’ తమకు అందజేయాల్సిన అవసరం లేదని, ఏడాదిలో ఎప్పుడైనా ఇస్తే సరిపోతుందని ప్రావిడెంట్ ఫండ్ అసిస్టెంట్ కమిషనర్ (సీటీ) డీ. శ్రీకాంత్ తెలిపారు.

01/13/2020 - 23:43

న్యూఢిల్లీ, జనవరి 13: భారత్‌లో జౌళి, దుస్తుల ఎగుమతులు గణనీయంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న ఐదేళ్ళ కాలంలో వీటి ఎగుమతులు 300 బిలియన్ల డాలర్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు ఇనె్వస్ట్ ఇండియా అనే సంస్థ అంచనా వేసింది. ఈ ఐదేళ్ళ కాలంలోనే అంతర్జాతీయంగా జౌళి, దుస్తుల ఎగుమతుల్లో భారత్ మార్కెట్ వాటా ఐదు నుంచి 10 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

01/14/2020 - 05:02

న్యూఢిల్లీ, జనవరి 13: భారత్‌ను వదిలి వెళ్ళాలన్న ఆలోచన తమకు ఎంత మాత్రమూ లేదని ప్రపంచంలోని అతిపెద్ద రిటైలింగ్ సంస్థ వాల్‌మార్ట్ సోమవారం ప్రకటించింది. దేశంలో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తృత మార్పులు తీసుకుని వస్తున్నామని ఇందులో భాగంగానే 8 మంది సీనియర్లతో సహ 56 మంది అధికారులను తొలగించామని వాల్‌మార్ట్ ఇండియా అధ్యక్షుడు, సీఇవో క్రిష్ అయ్యర్ సోమవారం ప్రకటించారు.

01/14/2020 - 04:59

ముంబయి, జనవరి 13: అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న సంకేతాలతో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. టెక్నాలజీ, బ్యాంకింగ్, మెటల్ షేర్లపై మదుపుదార్లు దృష్టి సారించారు. మార్కెట్ సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న సెనె్సక్స్ ఒక దశలో 300 పాయింట్ల వరకు పెరిగి అంతిమంగా లావాదేవీలు ముగిసే నాటికి 259.97 పాయింట్లు పెరిగి 41.859.69 పాయింట్ల వద్ద ముగిసింది.

01/13/2020 - 06:04

కర్నూలు, జనవరి 12: దేశంలో ప్రయోగాత్మకంగా ప్రైవేటు రంగంలో ప్రవేశపెట్టిన తేజస్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండడంతో రానున్న రెండేళ్లలో భారీ సంఖ్యలో ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కుతాయని రైల్వే అధికారుల ద్వారా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 150 రైళ్లు ప్రైవేటు రంగంలో తిరుగుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు రైళ్లు నడపాలన్న ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.

01/13/2020 - 04:11

న్యూఢిల్లీ: గత వారం స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ముగియగా, టాప్ 10 కంపెనీల్లో ఏడు కంపెనీల మార్కెట్ విలువ 32,020 కోట్ల రూపాయల మేర పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) కంపెనీలు ఎక్కువగా లాభపడ్డాయి. టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా లాభపడిన కంపెనీల జాబితాలో ఉన్నాయి.

01/13/2020 - 04:10

న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం లేకపోయినప్పటికీ, పరిస్థితి ఏవిధంగా మారుతుందోనన్న భయం విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐ)ను వెంటాడుతోంది. ఫలితంగా గత వారం భారత దేశీయ మార్కెట్ నుంచి పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకున్నారు. ఈ నెల ఇప్పటివరకు 2,415 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకోవడం గమనార్హం.

01/12/2020 - 05:49

కోల్‌కతా: చమురు ధరలు పెరుగుతున్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని, దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర విపరీతంగా పెరుగుతుందని వస్తున్న వార్తలను ఖండించారు. అలాంటి సమస్య ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు.

Pages