S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/09/2020 - 23:36

న్యూఢిల్లీ, జనవరి 9: ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర భాగస్వాములు కూడా ఏకాగ్రతతో కృషి చేయవలసిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చారు. ‘ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను రూపొందించాలనేది అకస్మాత్తుగా వచ్చిన ఆలోచన కాదు.మన దేశం ఆర్థిక బలాన్ని లోతుగా అర్థం చేసుకోవటం వలన ఈ ఆలోచన పుట్టింది’అని ప్రధాన మంత్రి వివరించారు.

01/09/2020 - 04:27

ముంబయి: ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మిగతా ఆర్థిక వ్యవస్థలతో మాదిరిగానే భారత్‌లో కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే, స్వదేశీ మదుపరులు ఆదుకోవడంతో భారీ నష్టాల నుంచి తప్పించుకున్నప్పటికీ స్వల్ప నష్టాలు తప్పలేదు. బాంబే స్టాక్ ఎక్స్చేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్స్ 51.73 పాయింట్లు పతనమై 40,815.74 పాయింట్లకు చేరింది.

01/09/2020 - 05:14

న్యూఢిల్లీ: మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్, నేషనల్ మినరల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మెకాన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వాటాలను కొంత మేర విక్రయించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

01/08/2020 - 23:18

రాజమహేంద్రవరం, జనవరి 8: ఇటు కృష్ణాజిల్లా గన్నవరం, అటు విశాఖకు మధ్యలో ఉన్న రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ శరవేగంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ సర్వీసులతో హై ఎయిర్‌వేగా అభివృద్ధి చెందుతోంది. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు గన్నవరమైనా, విశాఖ అయినా 200 కిలోమీటర్ల దూరం వల్ల రాజమహేంద్రవరం కేంద్రంగా ప్రాధాన్యత పెరిగింది.

01/08/2020 - 23:15

న్యూఢిల్లీ, జనవరి 8: నార్త్‌ఈస్ట్ గ్యాస్ గ్రిడ్‌కు 5,559 కోట్ల రూపాయల ఫండింగ్‌ను కేంద్రం మంజూరు చేసింది. బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఒక గ్రిడ్‌కు లేదా గ్యాస్ పైపులైన్‌కు సహజంగా ఆర్థిక సాయా న్ని అందించదు. అయితే, కేవలం నార్త్‌ఈస్ట్ గ్రిడ్‌కు మాత్రమే ప్రత్యక్షంగా ఫండింగ్ ఇస్తోంది.

01/08/2020 - 04:14

ముంబయి: మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల క్రమంలో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న వైరం కొంత ఉపశమించిన దాఖలాలు కనిపించడం మదుపర్ల సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపింది. ఈక్రమంలో బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెనె్సక్స్ 192.84 పాయింట్లు (0.47 శాతం) లాభపడి 40,869.47 పాయింట్ల ఎగువన స్థిరపడింది.

01/08/2020 - 03:44

న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఉల్లిపాయల విక్రయం చేపట్టారు. ఉల్లిపాయలు కావాలంటూ మొదట గగ్గోలు పెట్టిన రాష్ట్రాలు ప్రజల నుండి డిమాండ్ తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీనితో ముంబయి ఓడరేవుకు వచ్చిన విదేశీ ఉల్లిపాయలు కుళ్లియే ప్రమాదం ఏర్పడింది.

01/08/2020 - 02:21

వరంగల్, జనవరి 7: హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద నగరంగా గుర్తింపు ఉన్న వరంగల్‌లో ఐటీ విస్తరణకు బీజం పడిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్ నగర శివారులోని మడికొండ ఐటీ సెజ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రా ఐటీ ఇంక్యూబేటర్‌ను, సైయింటు ఐటీ సెజ్ శిలాఫలకం, భవనాన్ని ఆయన ప్రారంభించారు.

01/08/2020 - 02:14

కడప, జనవరి 7: కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రాథమికంగా డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి మంజూరు చేయించుకోవాల్సి వుంది.

01/08/2020 - 01:50

హైదరాబాద్, జనవరి 7: ప్రజా రవాణాలో ప్రత్యేక గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూనే సంస్థ ఆర్థికంగా బలపడేందుకు పలు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది.

Pages