S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/19/2020 - 01:52

విజయవాడ, జనవరి 18: ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాల్లో ఎంతో కీలకమైనది రవాణాశాఖ. ప్రస్తుతం ఈ రంగం ఆర్థిక సంక్షోభంలో ఉంది. వాహనాల అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం గణనీయంగా ఉంది. ఫలితంగా ఈ శాఖ ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బాగా క్షీణించింది. ఎనిమిది నెలల్లో లక్ష్యంలో 80 శాతమే సమకూరింది. ఇంకా 20 శాతం లోటు కన్పిస్తోంది.

01/19/2020 - 01:29

హైదరాబాద్, జనవరి 18: పరిశ్రమలతో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం స్వర్గ్ధామమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఇక్కడి మాదాపూర్‌లో శనివారం జరిగిన ‘ఇండియా-్థయిలాండ్ బిజినెస్ మ్యాచింగ్ అండ్ నెట్‌వర్కింగ్ ఈవెంట్స్’ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూలంగా ఉందని కేటీఆర్ అన్నారు.

01/17/2020 - 06:30

న్యూఢిల్లీ: వివిధ దేశాల నుంచి దిగుమతి అవుతున్న నూలుపై ‘యాంటీ డంపింగ్ సుంకాల’ను విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రధానంగా చైనా, ఇండోనేషియా, వియత్నాంల నుంచి దిగుమతి అవుతున్న నూలుపై ఈ సుంకం విధించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

01/17/2020 - 05:48

కడప, జనవరి 16: రాయలసీమ ఉద్యమంతో సాధించుకున్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)ని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)లో విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. గతంలో చంద్రబాబునాయుడు హయాంలో ఆర్టీపీపీలో ఉద్దేశ్యపూర్వకంగా ఉత్పత్తిని తగ్గించి నష్టాలు చూపిస్తూ ప్రైవేట్ కంపెనీలకు అమ్మజూపారు.

01/16/2020 - 23:22

న్యూఢిల్లీ, జనవరి 16: కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్‌లో కాగితం, పాదరక్షలు, రబ్బరు, ఆటబొమ్మలు సహా అనేక వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రోత్సహించడంతో పాటు దేశంలో వస్తు తయారీ (మాన్యుఫాక్చరింగ్) వృద్ధిని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచాలని భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.

01/16/2020 - 23:20

ముంబయి, జనవరి 16: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. అంతర్జాతీయ సానుకూలతో తొలుత సూచీలు రికార్డు స్థాయి లాభాల వైపు దూసుకెళ్లినప్పటికీ తర్వాత దేశీయ పరిస్థితులను బేరీజు వేసుకున్న మదుపర్లను నష్ట భయాలు వెన్నాడాయి. ఈక్రమంలో సూచీలు నేల చూపులు చూసి చివరికి స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి.

01/15/2020 - 05:43

న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలు విక్రయాలకు సంబంధించి సరికొత్త హాల్‌మార్క్ ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం 2001 జనవరి 15 నుంచి అమలులోకి తేబోతోంది. 14, 18, 22 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఆభరణాలు, వస్తువులను మాత్రమే బంగారం వర్తకులు 15వ తేదీ నుంచి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

01/15/2020 - 04:27

విజయవాడ, జనవరి 14: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ నర్సాపూర్ - సికింద్రాబాద్, మచిలీపట్నం - సికింద్రబాద్ మధ్య మూడు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. రైలు నెం. 07243 ఈ నెల 16, 17 తేదీల్లో సాయంత్రం 6గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

01/15/2020 - 03:29

ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్ టీసీఎస్ కంపెనీల ఊతంతో వరుసగా రెండో రోజైన మంగళవారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. సెనె్సక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయిలో బలపడ్డాయి. నేటి లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ చివరికి 92.94 పాయింట్లు పెరిగి 41,952.63పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 32.75పాయింట్లు పెరిగి 12.362.30 వద్ద ముగిసింది.

01/14/2020 - 23:25

న్యూఢిల్లీ, జనవరి 14: వివిధ రకాల బ్యాక్టీరియాల వల్ల కలిగే వ్యాధులకు చికిత్స చేసేందుకు చైనా నుంచి దిగుమతి అవుతున్న మందులపై కేంద్ర ప్రభుత్వం డంపింగ్ నిరోధక సుంకాన్ని విధించే అవకాశం ఉంది. ఈ చౌకబారు మందుల దిగుమతి నుంచి దేశీయ మందుల కంపెనీలకు రక్షణ కల్పించేందుకే ఈ సుంకాన్ని విధించే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Pages