S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/05/2018 - 01:40

చెన్నై, ఆగస్టు 4: తోలు పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన, వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ఈ రంగానికి 2,600 కోట్ల రూపాయల ప్యాకేజీని ఇప్పటికే ఆమోదించామని పేర్కొన్నారు. కొత్తగా తోలు పరిశ్రమ క్లస్టర్లను ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్రాలకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్ (సీఎల్‌ఈ) సమావేశంలో పాల్గొన్న ప్రభు అన్నారు.

08/04/2018 - 01:28

ముంబయి: రెండు రోజుల పాటు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తిరిగి బలంగా పుంజుకున్నాయి. రెండు రోజుల తరువాత మదుపరులు మళ్లీ భారీగా కొనుగోళ్లు జరపడంతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది.

08/04/2018 - 01:17

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశ సేవల రంగం కార్యకలాపాలు వరుసగా రెండో నెల జూలైలోనూ వృద్ధి పథంలో కొనసాగాయి. 2016 అక్టోబర్ నుంచి వ్యాపార కార్యకలాపాలలో అత్యధిక వృద్ధి చోటు చేసుకోవడం, డిమాండ్ పరిస్థితులు మెరుగుపడటం వల్ల సేవల రంగం వృద్ధి పథంలో కొనసాగుతోందని ఒక నెలవారీ సర్వే పేర్కొంది.

08/04/2018 - 00:36

షాంఘై, ఆగస్టు 3: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్టాక్ మార్కెట్ హోదాను చైనా కోల్పోయింది. చైనాను మూడో స్థానంలోకి నెట్టి జపాన్ తిరిగి రెండో అతి పెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం సంభవించే ప్రమాదం నెలకొనడం, ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించడం వల్ల చైనా ఈ సంవత్సరం తన రెండో స్థానాన్ని జారవిడుచుకుంది.

08/03/2018 - 17:34

ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ 391 పాయింట్లు లాభపడి 37,556 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 116 పాయింట్లు లాభపడి 11,360 వద్ద స్థిరపడింది.

08/03/2018 - 00:46

ముంబయి: దేశంలో ఈ సంవత్సరం ఏప్రిల్- జూన్ మధ్య కాలంలో బంగారం కొనుగోళ్లు తగ్గాయి. నిరుడు ఇదే కాలంతో పోలిస్తే కొనుగోళ్లు ఎనిమిది శాతం తగ్గి, 187.2 టన్నులకు చేరాయి. దేశంలో పసిడి ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు స్థానిక పరిస్థితులు కూడా బంగారానికి డిమాండ్ తగ్గడానికి దారితీశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ)..

08/03/2018 - 00:37

ముంబయి, ఆగస్టు 2: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మరింత బలహీనపడ్డాయి. స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చే ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉన్న తరుణంలో మదుపరులు విపరీతంగా అమ్మకాలకు పూనుకోవడం వల్ల దేశీయ మార్కెట్ కీలక సూచీలు వరుసగా రెండో రోజు పడిపోయాయి.

08/03/2018 - 00:38

కోల్‌కతా, ఆగస్టు 2: ఇటీవల అనేక వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేటును తగ్గించినందున రానున్న మూడు, నాలుగు నెలల పాటు పన్ను ఆదాయం రూ. 70వేల కోట్లకు తగ్గే అవకాశం ఉందని జీఎస్‌టీ అమలు కమిటీ చైర్మన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. జీఎస్‌టీ మండలి గత సమావేశంలో 450 వస్తువులపై పన్ను రేటును తగ్గించిందని ఆయన చెప్పారు.

08/02/2018 - 02:59

ముంబయి: బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఏడు సెషన్ల ర్యాలీకి తెరపడింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సెనె్సక్స్ దాదాపు 85 పాయింట్లు పడిపోయి 37,521.62 పాయింట్ల వద్ద ముగిసింది.

08/02/2018 - 01:13

ముంబయి, ఆగస్టు 1: ఈ ఏడాది రెండవ ఆర్థిక సంవత్సరంలో చిల్లర ద్రవ్యోల్బణం 4.8 శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. వివిధ పంట ఉత్పత్తుల కనీస గిట్టుబాటు ధరలు పెరగడం వల్ల చిల్లర ద్రవ్యోల్బణం పెరుగుతుంది. జూలై-సెప్టెంబర్ మాసాలకు ద్రవ్యోల్బణం 4.6 శాతానికి చేరుకుంటుందని అంచనా.

Pages