S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/02/2018 - 01:11

ముంబయి, ఆగస్టు 1: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) అంచనా వృద్ధి రేటును 7.4 శాతంగానే కొనసాగించింది.

08/02/2018 - 01:10

న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలో తయారీ (మాన్యుఫాక్చరింగ్) రంగం కార్యకలాపాలు జూన్‌తో పోలిస్తే జాలై నెలలో కాస్త తగ్గాయి. అయితే, మాన్యుఫాక్చరింగ్ రంగం ఉత్పత్తి, కొత్త ఆర్డర్లు, ఉద్యోగ కల్పన మాత్రం స్వల్పంగా పెరిగాయని ఒక నెలవారీ సర్వే వెల్లడించింది. నిక్కెయి ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూన్ నెలలో ఉన్న 53.1 నుంచి జూలై నెలలో 52.3కు తగ్గింది.

08/01/2018 - 01:13

న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీల)పై వడ్డీ రేటును 0.1 శాతం వరకు పెంచింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన ప్రకటన వెలువడనున్న తరుణంలో ఎస్‌బీఐ ఎంపిక చేసిన కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇతర బ్యాంకులు కూడా ఎస్‌బీఐ బాటలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.

08/01/2018 - 00:57

ముంబయి, జూలై 31: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం సెషన్‌లో బలహీనంగా సాగినప్పటికీ, చివరలో కొనుగోళ్లు పుంజుకోవడంతో లాభాలతో ముగియడమే కాకుండా సరికొత్త రికార్డులను సృష్టించాయి.

08/01/2018 - 00:19

న్యూఢిల్లీ, జూలై 31: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ద్రవ్య లోటు రూ. 4.29 లక్షల కోట్లు (62.57 బిలియన్ డాలర్లు)గా నమోదయిందని ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో నిర్దేశించుకున్న లక్ష్యంలో ద్రవ్య లోటు 68.7 శాతంగా ఉంది.

08/01/2018 - 00:18

న్యూఢిల్లీ, జూలై 31: ఎయిర్ ఇండియాను బలోపేతం చేసేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.980 కోట్ల నిధులు అవసరమవుతాయని, దీనికి ఆమోదం తెలియచేయాలని కేంద్రం పార్లమెంటును కోరింది. ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాలను విక్రయించేందుకు ఆఫర్ ఇచ్చినా, కొనుగోలుకు ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు. అందుకే ఎయిర్ ఇండియా నిర్వహణకు ఈ ఏడాదికి రూ.980కోట్లు కావాలని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా మంగళవారం లోక్‌సభను కోరారు.

08/01/2018 - 00:59

న్యూఢిల్లీ, జూలై 31: దేశ వౌలిక సౌకర్యాల రంగం ఈ సంవత్సరం జూన్ నెలలో గత సంవత్సరం జూన్‌తో పోలిస్తే 6.7 శాతం వృద్ధి చెందింది. ప్రభుత్వం మంగళవారం వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఏడు నెలల్లో అత్యంత వేగంగా సాధించిన వృద్ధి ఇది. వౌలిక సౌకర్యాల రంగం గత సంవత్సరం మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం మేలో 4.3 శాతం వృద్ధి చెందింది.

07/31/2018 - 13:53

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 69, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 68.60గా ఉంది.

07/31/2018 - 00:44

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మూడు రోజుల కీలక సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన, ఆరుగురు సభ్యులతో కూడిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్లపై విస్తృత స్థాయిలో చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

07/31/2018 - 00:16

న్యూఢిల్లీ, జూలై 30: వివిధ దేశాల నుంచి వచ్చిపడుతున్న దిగుమతులను కట్టడి చేసి, సాధ్యమైనంత వరకూ వాటిని తగ్గించడానికి అవసరమైన చర్యలను సూచించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

Pages