S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/26/2018 - 23:31

న్యూఢిల్లీ, జూలై 26: కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలయిన హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్), ఎన్‌బీసీసీ (ఇండియా) లిమిటెడ్ నుంచి పది శాతం చొప్పున వాటాలను విక్రయించడానికి కసరత్తు చేస్తోంది. అలాగే ఎన్‌టీపీసీ నుంచి మూడు శాతం వాటాను విక్రయించడానికి పూనుకుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా ఈ వాటాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

07/26/2018 - 23:30

జోహెన్స్‌బర్గ్, జూలై 26: పారిశ్రామిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంతో స్వావలంభనకు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ ఆయన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల సదస్సులో ప్రసంగిస్తూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులపై బ్రిక్స్ దేశాలు పరస్పరం అందించుకోవాలని కోరారు.

07/26/2018 - 23:29

ముంబయి, జూలై 26: బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా నాలుగో రోజు గురువారం సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో పాటు ప్రపంచ పరిణామాలు సానుకూలంగా ఉండటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి.

07/26/2018 - 23:28

న్యూఢిల్లీ, జూలై 26: ఎట్టకేలకు వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థల విలీనానికి కేంద్ర ప్రభుత్వం గురువారం తుది ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థలు విలీనం తరువాత దేశంలోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా అవతరించనున్నాయి. ఈ విలీనంతో ఏర్పడుతున్న కొత్త సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ దేశంలో 35 శాతం వాటాతో సుమారు 430 మిలియన్ ఖాతాదారులను కలిగి ఉంటుంది.

07/26/2018 - 23:24

న్యూఢిల్లీ, జూలై 26: దేశీయ పరిశ్రమ ప్రయోజనాలను పరిరక్షించడానికి కన్స్యూమర్ డ్యూరేబుల్ సరుకుల దిగుమతిపై సుంకాన్ని పెంచాలనే ప్రతిపాదనను కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) పరిశీలించనుంది. చౌక దిగుమతుల నుంచి తమను కాపాడటానికి కన్స్యూమర్ డ్యూరేబుల్ సరుకుల దిగుమతిపై సుంకాన్ని పెంచాలని ఇండస్ట్రీ ఇదివరకే ప్రభుత్వాన్ని కోరింది.

07/26/2018 - 16:43

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. సూచీలు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. సెనె్సక్స్ 126 పాయింట్లు లాభపడి 36,985 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 36 పాయింట్ల లాభంతో 11,167 వద్ద ముగిసింది.

07/26/2018 - 00:32

వాషింగ్టన్: వాణిజ్య పోరులో యూరోపియన్ దేశాలతో చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో చైనా అనుసరిస్తున్న దుర్మార్గపు వ్యూహంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్వజమెత్తారు. చైనాలో వాణిజ్య అనుబంధ సమావేశం సందర్భంగా ట్రంప్ ఒక ట్వీట్ ద్వారా తమ దేశ రైతులను లక్ష్యంగా చేసుకుని చైనా సుంకాలను పెంచడాన్ని తప్పుబట్టారు.

07/26/2018 - 00:27

ముంబయి, జూలై 25: బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా మూడో రోజు బుధవారం సరికొత్త గరిష్ఠ స్థాయి 36,858.23 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ, విదేశీ మదుపరులు నిరంతరాయంగా కొనుగోళ్లు జరపడంతో ఈ సూచీ 33.13 పాయింట్లు పుంజుకుంది.

07/26/2018 - 00:28

న్యూఢిల్లీ, జూలై 25: భారత ఎగుమతుల్లో రానున్న నెలల్లో ఆరోగ్యకరమయిన వృద్ధి రేటు నమోదవుతుందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో మన ఎగుమతులు 350 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయనే అంచనాతో ఉన్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు బుధవారం పేర్కొన్నారు.

07/25/2018 - 23:26

న్యూఢిల్లీ, జూలై 25: భారత్‌లో వ్యాపార ఆశావాదం (బిజినెస్ ఆప్టిమిజం)లో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనూ పెద్దగా మార్పు లేదు. గ్లోబల్ ఆప్టిమిజం ఇండెక్స్‌లో భారత్ గతంలోలాగానే ఆరో ర్యాంక్‌లో కొనసాగుతోందని ఒక సర్వే వెల్లడించింది. ప్రపంచం మొత్తం మీద చూసినప్పటికీ వ్యాపార ఆశావాదం ఇదే రీతిలో ఉంది.

Pages