S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/29/2018 - 02:11

హైదరాబాద్, జూలై 28: వ్యాపార రంగంలో పెట్టుబడులు ఎలా పెట్టాలి?, ఉత్తమ వ్యాపారవేత్తగా ఎలా వృద్ధి చెందాలి?, వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎలా తట్టుకోవాలి? అనే అంశాలపై ప్రముఖ వ్యాపారులు తమ అనుభవాలను చెప్పారు. శనివారం హైటెక్స్‌లో ‘గోనాట్-2018’ పేరిట ఎంఎస్‌ఎంఇ సదస్సును, ప్రదర్శనను బిఎన్‌ఐ తన 6వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించింది.

07/29/2018 - 02:10

న్యూఢిల్లీ, జూలై 28: ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఎన్‌టీపీసీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక నికర లాభం 1.14 శాతం తగ్గుదలతో రూ. 2,588.14 కోట్లు సాధించింది. తరుగుదల, రుణభారం, ఇంధన వ్యయం అధికం కావడం వల్ల నికర లాభం తగ్గిపోయింది. ఎన్‌టీపీసీ గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 2,618.17 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

07/29/2018 - 02:10

న్యూఢిల్లీ, జూలై 28: చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ధరల పట్టిక ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.16కు, ముంబయిలో రూ. 83.61కు తగ్గింది. అలాగే కోల్‌కతాలో రూ. 79.05కు, చెన్నైలో రూ. 79.11కు చేరింది. డీజిల్ ధర ఢిల్లీలో లీటర్‌కు రూ. 67.62కు తగ్గింది. అలాగే ముంబయిలో రూ. 71.79కి, కోల్‌కతాలో రూ.

07/28/2018 - 21:05

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో సరికొత్త రికార్డు సృష్టించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ చరిత్రలో మొదటిసారి కీలకమయిన 37,000 మార్కుకు పైన ముగిసింది. ఈ సూచీ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగియడం వరుసగా ఇది అయిదో రోజు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ జీవనకాల గరిష్ఠ స్థాయి వద్ద ముగియడం వల్ల సెనె్సక్స్ చరిత్రలోనే ఈ వారం మరపురాని వారంగా నిలిచిపోతుంది.

07/28/2018 - 00:06

న్యూఢిల్లీ, జూలై 27: సిమెంట్, ఏసీలు, టెలివిజన్లపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్లు తగ్గుతాయనే విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం పెరిగినందున వీటిపై పన్ను రేట్లు తగ్గుతాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.

07/28/2018 - 00:05

న్యూఢిల్లీ, జూలై 27: ఎగుమతిదారులకు శుభవార్త. ఎగుమతుల రంగంలో పోస్టు లేదా కొరియర్ సర్వీసు ద్వారా రూ.5 లక్షల విలువైన వస్తువులను పంపే సదుపాయాన్ని కల్పించినట్లు వాణిజ్య శాఖ పేర్కొంది. ఇంతకాలం ఈ రెండు సర్వీసుల ద్వారా పంపే వస్తువుల గరిష్ట విలువ రూ.25వేలకు మించి ఉండరాదు. దేశంలో ఎగుమతిదారులు, ప్రజలు చాలా కాలం నుంచి ఈ విధానాన్ని సమీక్షించాలని కోరుతున్నారు.

07/28/2018 - 00:04

న్యూఢిల్లీ, జూలై 27: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మన దేశంలో 75 బిలియన్ డాలర్లతో వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హామీ ఇచ్చిందని, ఈ మేరకు వివిధ ఒప్పందాలు ఖరారయ్యాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ ఆసక్తిని కనపరుస్తోందని చెప్పేందుకు ఇది నిదర్శనమని పేర్కొంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతమయ్యాయని తెలిపింది.

07/28/2018 - 00:04

న్యూఢిల్లీ, జూలై 27: ఓరేగాన్ కమర్షియల్‌లో షేర్ హోల్డింగ్‌ల మార్పులను వెల్లడించనందుకు ఏడు కంపెనీలకు రూ. 37 లక్షల జరిమానాను విధిస్తూ సెబి సంస్థ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి విచారించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబి తెలిపింది. ఇటీవల ఓరేగాన్ కంపెనీ సాయి ఆనంద్ కమర్షియల్‌గా పేరు మారిందని సెబి తెలిపింది.

07/27/2018 - 05:01

న్యూఢిల్లీ: దేశంలో ప్రాంతీయ విమానయాన అభివృద్ధిలో భాగంగా విమానాలు, హెలికాప్టర్‌లు అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి జయంత్ సిన్హా లోక్‌సభలో వెల్లడించారు. పౌరుల ప్రయాణానికి అనువైన విమానాల తయారీని దేశంలోనే తయారు చేసే ప్రతిపాదన ఏమన్నా ప్రభుత్వం వద్ద ఉందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

07/26/2018 - 23:46

హైదరాబాద్, జూలై 26: ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేసే గడువును పెంచారు. తాజా నిర్ణయం ప్రకారం ఆగస్టు 31వ తేదీ వరకూ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చని ఆదాయ పన్ను శాఖ కమిషనర్ డాక్టర్ దీపక్ పీ. రిపొటే తెలిపారు. అందరి మేలు కోసమే వినియోగించడం జరుగుతుందని, దేశ అభివృద్ధికి, పురోభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని దీపక్ చెప్పారు.

Pages