S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/31/2018 - 00:41

ముంబయి, జూలై 30: వరుసగా ఆరో రోజు కూడా సస్సెక్స్ రికార్డు బ్రేకింగ్ పరుగు కొనసాగింది. బీఎస్సీ సనె్సక్స్ 157 పాయింట్లు పెరిగి, గతంలో ఎన్నడూ లేని విధంగా 37,494.40 పాయింట్ల వద్ద ముగిసింది. గత ఐదు రోజుల మాదిరిగానే సోమవారం కూడా సస్సెక్స్ వృద్ధిని నమోదు చేసింది. లాభపడిన కంపెనీల్లో రిలయన్స్, భారతి ఎయిర్‌టెల్ ముందు వరుసలో నిలిచాయి. జాతీయ సనె్సక్స్ 41.20 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగింది.

07/31/2018 - 00:13

న్యూఢిల్లీ, జూలై 30: తమ కంపెనీకి చెందిన ప్యాసింజర్ వాహనాల ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని మహీంద్ర అండ్ మహీంద్ర (ఎం అండ్ ఎం) నిర్ణయించింది. ధరలను రెండు శాతం లేదా 30,000 వరకు పెంచుతామని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఎక్స్‌యూవీ 500, స్కార్పియో, టీయూవీ 300, కేయూవీ 100 మోడల్స్‌లో మహీంద్ర సంస్థ ప్యాసింజర్ వాహనాలను మార్కెట్‌లో ఉంచింది.

07/31/2018 - 00:12

బెంగళూరు, జూలై 30: శ్రీకృష్ణ ప్యానెల్ తన నివేదికలో చేసిన ప్రతిపాదనలు ఐటీ రంగానికి ఊతమిచ్చేవిగా ఉన్నాయని, వీటిని అమలు చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని సీనియర్ ఐటీ నిపుణుడు మోహన్‌దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ, శ్రీకృష్ణ ప్రతిపాదనల అమలుతో, విదేశాల్లో సేవలు అందిస్తున్న భారత ఐటీ కంపెనీలకు ఊతం లభిస్తుందని అన్నారు.

07/31/2018 - 00:42

న్యూఢిల్లీ, జూలై 30: దేశ లాజిస్టిక్స్ రంగంలో 2050 నాటికి పెట్టుబడులు 500 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ అభిప్రాయపడ్డారు. దీని వల్ల లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.

07/30/2018 - 13:40

ముంబయ: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 82 పాయింట్లు లాభపడి 37,418వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 11,294 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.

07/30/2018 - 02:03

న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తీసుకునే నిర్ణయం, కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాలు, దేశ స్థూలార్థిక గణాంకాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేశారు.

07/30/2018 - 02:00

ముంబయి, జూలై 29: కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ‘డిజి యాత్ర’ సౌకర్యం మరో రెండు నెలల్లో అమలులోకి రానుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ విషయం వెల్లడించారు. ‘డిజి యాత్ర’ సౌకర్యం వల్ల ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం వేగవంతం అవుతుంది. దీనివల్ల విమానయానంలో కాగితం వినియోగం తగ్గిపోతుంది.

07/30/2018 - 01:58

న్యూఢిల్లీ, జూలై 29: దేశంలోని అత్యంత విలువయిన పది కంపెనీలలోని ఏడు కంపెనీల మార్కెట్ విలువ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో రూ. 79,929 కోట్లు పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్లిష్ ధోరణి నెలకొనడంతో ఈ కంపెనీల మార్కెట్ విలువ (ఎంక్యాప్) భారీగా పెరిగింది. వీటిలో ఐటీసీ అత్యధికంగా లాభపడింది.

07/29/2018 - 02:15

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి, తెలంగాణ పోలీసు గృహా నిర్మాణ సంస్థకూ స్టీల్ సరఫరా చేసిన సుగ్న మెటల్స్ సంస్థ తాజాగా ఎఫ్‌ఈ-550 పేరిట నూతన ప్రాడక్టును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. స్టీల్ మార్కెట్‌లో దశాబ్ద కాలం నుంచి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన సుగ్న మెటల్స్ ఇప్పుడు మరింత వేగంగా విస్తరించే ప్రణాళికలు రూపొందించుకున్నది.

07/29/2018 - 02:13

ముంబయి, జూలై 28: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బలపడ్డాయి. ముఖ్యంగా బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారంలోని అన్ని సెషన్లూ సరికొత్త గరిష్ఠ స్థాయిల వద్ద ముగిసింది. వారాంతమయిన శుక్రవారం కీలక మైలురాయి అయిన 37వేల మార్కును అధిగమించి 37,336.85 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ ఈ వారంలో భారీగా 840.48 పాయింట్లు పుంజుకుంది.

Pages