S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/20/2018 - 01:27

హైదరాబాద్, మే 19: పాఠశాల విద్యలో విఫల ప్రయోగంగా తేలిపోయిన నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానాన్ని విరమించాలని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సీసీఈ అమలులో జరుగుతున్న లోపాలను పేర్కొంటూ ఎస్సీఇఆర్టీ సరికొత్త మార్గదర్శకాలు ప్రతిపాదిస్తూ, వాటిపైనే అందరి సూచనలు కోరింది.

05/20/2018 - 01:27

న్యూఢిల్లీ, మే 19: వ్యాపారాల్లోని అక్రమాలను అరికట్టే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) చైర్‌పర్సన్ పోస్టుకు ఎవరిని నియమించాలా అని ప్రభుత్వం అభ్యర్థిని అనే్వషిస్తోంది. సిసిఐ చైర్మన్‌కు నెలకు 4.5 లక్షల రూపాయల కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తారు. సిసిఐకు మూడో చైర్మన్‌గా 2016 జనవరి వరకు అశోక్ చావ్లా వ్యవహరించగా, తర్వాత ఈ పదవి చేపట్టిన సిక్రీ (65) పదవీ కాలం ఈ జూలైతో ముగుస్తుంది.

05/19/2018 - 03:19

ముంబయి: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తోడు ప్రపంచ పరిణామాలు ప్రతికూలంగా ఉండటంతో మదుపరులు అమ్మకాలకు పూనుకోవడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 300 పాయింట్లు పడిపోయి, కీలకమయిన 35వేల పాయింట్ల స్థాయికి దిగువన 34,848.30 పాయింట్ల వద్ద ముగిసింది.

05/19/2018 - 03:17

న్యూఢిల్లీ, మే 18: మదుపర్ల ధనాన్ని వసూలు చేసేందుకు వీలుగా, ఎంపీఎస్ గ్రీనరీ డెవలపర్స్ కు చెందిన 18 ఆస్తులను వేలం వేయాలని సెబీ నిర్ణయించింది. మొత్తం రూ.67 కోట్ల విలువైన వీ టికి వచ్చేనెల ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తుంది. గతేడాది జూన్‌లోవేలం వేసిన 14 ఆస్తులకు, గత ఫిబ్రవరిలో వేలం వేసిన 18 ఆస్తులకు ఇవి అద నం. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సెబీ ఈ ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభించింది.

05/19/2018 - 03:16

ముంబయి, మే 18: టెలికాం రం గంలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు కేంద్రం సహాయం చేయడానికి ఉపక్రమించింది. వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ప్రభుత్వం సంకల్పించినట్టు టెలికాం కార్యదర్శి అరుణా సుం దర రాజన్ తెలిపారు. టెలికాం రంగంలో నెలకొన్న విపరీతమై పోటీ, రిలయన్స్ జీయో రం గంలోకి దిగిన తర్వాత ఇచ్చిన విపరీతమైన ఆఫర్ల నేపథ్యంలో, వివిధ టెలికాం సంస్థలు ఇ బ్బందుల్లో పడ్డాయి.

05/19/2018 - 03:14

న్యూఢిల్లీ, మే 18: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలను పెంచడంలో నిగ్రహం పాటిస్తూ స్థిరంగా ఉండేలా చూడాలని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఒపెక్ దేశాలకు నేతృత్వం వహిస్తున్న సౌదీ అరేబియాను కోరారు. ముడిచమురు ధరను పెంచడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ, వినియోగదార్లపై భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. బ్యారల్ ధర 80 అమెరికన్ డాలర్లకు చేరుకున్న నేపథ్యంలో ఆయన పైవిధంగా కోరడం గమనార్హం.

05/19/2018 - 03:11

రాజమహేంద్రవరం, మే 18:వచ్చే మూడేళ్లలో రూ.2000 కోట్లతో 24 హైప్రెషర్ (హెచ్‌పీ) , హైటెన్షన్ (హెచ్‌టీ) బావులను తవ్వనున్నామని ఓఎన్జీసీ ఆన్‌షోర్ డైరక్టర్ సంజయ్‌కుమార్ మెహిత్రా చెప్పారు. 2022 నాటికి దేశం 10 శాతం చమురు దిగుమతులు తగ్గించుకోవాలనే ప్రధానమంత్రి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓఎన్‌జీసీ నిరంతరం కృషిచేస్తోందన్నారు.

05/19/2018 - 02:59

న్యూఢిల్లీ, మే 18: ఆంధ్రప్రదేశ్‌లో వాల్‌మార్ట్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దీని ద్వారా ఏపీలోని 15వేల మంది రైతులకు ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడలు పెట్టాలని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులకు లోకేష్ విజ్ఞప్తి చేశారు.

05/19/2018 - 02:39

న్యూఢిల్లీ, మే 18: పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల భారతదేశ కరెంట్ ఖాతా లోటు మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మాన్ సాచ్స్ పేర్కొంది.

05/19/2018 - 02:38

హైదరాబాద్, మే 18: తెలంగాణాలో మిగులు విద్యుత్ సాధించడానికి చేపడుతున్న చర్యలతో సత్ఫలితాలు ఇచ్చాయని, దీంతో నిర్మాణాలు పూర్తి చేసుకున్న విద్యుత్ ప్లాంట్ల నుంచి జూన్ నెలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తున్నట్లు జెన్కో, ట్రాన్సికో సిఎండి ప్రభాకరరావు స్పష్టం చేశారు.

Pages