S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/19/2018 - 02:37

న్యూఢిల్లీ, మే 18: తెలంగాణ నుంచి కేసీఆర్ కిట్, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ టీ యాప్, టీ-వాలెట్‌లకు బిజినెస్ వరల్డ్ సంస్థ అవార్డులు లభించాయి. బిజినెస్ వరల్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నాలుగో డిజిటల్ ఇండియా సదస్సులో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.

05/18/2018 - 16:45

ముంబయి: మార్కెట్లో దేశీయ సూచీలు శుక్రవారం కుప్పకూలాయి. వరుసగా నాలుగో రోజు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనమవగా.. నిఫ్టీ 10,600 దిగువకు పడిపోయింది. ఈ ఉదయం నుంచే సూచీలు నష్టాలతో సాగాయి. మార్కెట్‌ ఆరంభంలో 150 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌ చివరకు 301 పాయింట్లు కోల్పోయి 34,848 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 86 పాయింట్ల నష్టంతో 10,596 వద్ద స్థిరపడింది.

05/18/2018 - 04:29

ముంబయి: కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమయిన మెజారిటీ రాని నేపథ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగిన కారణంగా మదుపరులు ముందు జాగ్రత్త చర్యగా లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల వరుసగా మూడో రోజు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి.

05/18/2018 - 01:47

ముంబయి, మే 17: రానున్న ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంకు పాలసీ రేట్లలో ఏవిధమైన మార్పులు చేయకపోవచ్చు. కాకపోతే మొత్తంమీద ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల పెంపు విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించే అవకాశముందని ఒక నివేదిక వెల్లడించిం ది. గత మార్చిలో 4.28 శాతంగా ఉ న్న ద్రవ్యోల్బణం, ఏప్రిల్ నాటికి 4.58 శాతానికి పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం కేవలం 2.99 శా తం మాత్రమే ఉండేది.

05/18/2018 - 01:46

న్యూఢిల్లీ, మే 17: కుంభకోణాలు, పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించారు.

05/18/2018 - 01:44

ముంబయి, మే 17: నీరవ్ మోదీ, గీతాంజలి గ్రూపు కంపెనీలతో జరిపిన 2 బిలియన్ యుఎస్ డాలర్ల అక్రమ లావాదేవీల వివరాలను స్టాక్ ఎక్చేంజ్‌లకు తెలియపరచడంలో జరుగుతున్న ఆలస్యంపై సెబీ తమను తీవ్రంగా హెచ్చరించిందని పంజా బ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. ఆర్‌బీఐ, సీబీఐలకు చేసిన నివేదికల వివరాలను స్టాక్ ఏక్చేంజ్‌లకు పీఎన్‌బీ పంపడంలో 1-6 రోజుల ఆలస్యం చేసినట్టు సెబీ గుర్తించిం ది.

05/18/2018 - 01:42

న్యూఢిల్లీ, మే 17: జనాభా నియంత్రణ విధానాలను బాగా పా టించిన రాష్ట్రాలకు ప్రోత్సహించే విధంగా ఆర్థిక సంఘం చర్యలు ఉండాలని , దీని కోసం తాజాగా జనాభా డాటాను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థికశాస్తవ్రేత్తలు కోరారు. 15వ ఆర్థిక సంఘం శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆర్థికవేత్తలు పై అభిప్రాయాన్ని తెలియచేశారు.

05/18/2018 - 01:42

హైదరాబాద్, మే 17: సింగరేణి సంస్థలోడైరెక్టర్ హోదాలో పని చేస్తున్న ఎస్ చంద్రశేఖర్ ‘డైరెక్టర్ ఆపరేషన్స్ ఎక్స్‌లెన్స్’ జాతీయ అవార్డు అం దుకున్నారు. ప్రతియేటా జాతీయ స్థాయిలో బ హుకరించే డైరెక్టర్ ఆపరేషన్స్ ఎక్స్‌లెన్స్ అవార్డును ప్రముఖ మైనింగ్ అధ్యయన సంస్థ అయిన జియోమైన్‌టెక్ ఈ యేడాది సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స చంద్రశేఖరుకు అందచేసింది.

05/18/2018 - 00:39

న్యూ ఢిల్లీ, మే 17: పెట్రోధరలను పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలో పరిశీలిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ లీటర్‌కు రూ.4 చొప్పున పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు పెట్రో సంస్థల వర్గాలు తెలిపాయి. దీని వల్ల వినియోగదారులపై పెను భారం పడనుంది. కర్నాటకలో పోలింగ్ ముగిసిన మర్నాటి నుంచి కేంద్ర చమురు సంస్థలు రోజూవారీ పెట్రో ధరలను సమీక్షిస్తున్నాయి.

05/17/2018 - 00:49

న్యూఢిల్లీ, మే 16: సెబి సహారా రిఫండ్ అకౌంట్‌లో తాము ఆదేశించినట్లుగా రూ. 750 కోట్లను డిపాజిట్ చేయడంలో విఫలమైనందున సహారా గ్రూప్స్‌కు చెందిన ప్రైమ్ ఆంబీ వ్యాలీ ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ రంజన్ గోగాయ్ , ఎకె సిక్రీతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.

Pages