S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/12/2017 - 00:02

శుక్రవారం బెంగళూరులో ఆసియా జ్యుయెల్లరీ ఫెయర్ 2017 ప్రారంభమైంది. ఈ షోలో నగలను ధరిస్తూ మురిసిపోతున్న
కన్నడ నటి శే్వత శ్రీవాత్సవ

08/12/2017 - 00:01

శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ)లో కొచ్చిన్ షిప్‌యార్డ్ సంస్థ లిస్టింగ్ సందర్భంగా ముంబయలోగల బిఎస్‌ఇ కార్యాల యంలోని బుల్ వద్ద కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి గడ్కరీ

08/11/2017 - 23:59

40 శాతం క్షీణించిన
హెరిటేజ్ ఫుడ్స్ నికర లాభం

08/11/2017 - 23:58

భీమవరం, ఆగస్టు 11: తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఎదురయ్యే ఉల్లిపాయల కొరత సమస్యను తీర్చడానికి త్వరలోనే ఉల్లిపౌడర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామని జాతీయ ఉద్యానవన బోర్డు డైరెక్టర్ సిహెచ్ సత్యకృష్ణంరాజు తెలిపారు. త్వరగా పాడయ్యే లక్షణం కారణంగా నిత్యం ఉల్లి సరఫరా, డిమాండ్ల మధ్య వ్యత్యాసం ఏర్పడుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఉల్లి పౌడర్‌ను అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.

08/11/2017 - 00:45

న్యూఢిల్లీ, ఆగస్టు 10: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఐదు అసోసియేట్ బ్యాంకుల విలీనాన్ని ధృవీకరిస్తూ లోక్‌సభ గురువారం ఓ బిల్లును ఆమోదించింది. ఈ విలీనం వల్ల ఎస్‌బిఐ మూల ధనం మరింత పెరుగుతుందని, రుణాల లభ్యతకు అవకాశం ఉంటుందని ఆర్థికశాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. ఈ విలీనంతో ప్రపంచంలోనే అతిపెద్ద 50 బ్యాంకుల జాబితాలోకి ఎస్‌బిఐ చేరుకుందని 45వ స్థానంలో కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు.

08/11/2017 - 00:44

న్యూఢిల్లీ, ఆగస్టు 10: తమ మధ్య కుదిరిన భాగస్వామ్య ప్రణాళిక నుంచి తప్పుకుంటున్న టాటా మోటార్స్, వోక్స్ వ్యాగన్ గ్రూపు సంస్థ స్కోడాలు గురువారం ప్రకటించాయి. ఈ రెండు సంస్థల మధ్యా నాలుగు నెలల క్రితమే ఈ ఒప్పందం కుదిరినప్పటికీ సాధ్యాసాధ్యాల అంచనా కారణంగా దీన్ని రద్దుచేసుకుంటున్నట్టు రెండు సంస్థలు తెలిపాయి.

08/11/2017 - 00:43

అమెరికా,ఉత్తర కొరియా మధ్య చెలరేగుతున్న ఉద్రిక్త వాతావరణం ప్రపంచ స్టాక్ మార్కెట్లపైనా పడింది. దీని ప్రభావం ఫలితంగా సెనె్సక్స్ గత నెల రోజుల్లో ఎన్నడూలేని విధంగా 267 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టికూడా 9900 పాయింట్ల దిగువకు చేరుకుంది. ఇటు బిఎస్‌ఇ అటు నిఫ్టిలు గత నాలుగురోజులుగా వరస నష్టాలను చవిచూస్తునే ఉన్నాయి. గురువారం నాటి లావాదేవీల్లో సెనె్సక్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయింది.

08/11/2017 - 00:42

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఇప్పటి వరకూ ప్రతిదానికీ ఆధార్‌ను ముడిపెడుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా షేర్ మార్కెట్ లావాదేవీలకు ఆధార్‌ను ముడిపెట్టబోతోంది. షేర్లు కొనాలన్నా, మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా ఆధార్‌ను తప్పసిసరి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.

08/11/2017 - 00:41

న్యూఢిల్లీ, ఆగస్టు 10: హెలికాప్టర్ సర్వీసును నిర్వహిస్తున్న పవన్ హన్స్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం న్యాయసలహాదారుల నియామకాన్ని ఖరారు చేసింది. వీరితోపాటు మొత్తం విలువను అంచనా వేసే నిపుణులను కూడా నియమించినట్టు గురువారం లోక్‌సభలో వెల్లడించింది.

08/11/2017 - 00:39

న్యూఢిల్లీ, ఆగస్టు 10: పెద్దనోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నల్లధన అవినీతి నిరోధక చర్యల వల్ల పన్నులు-స్థూల జాతీయ ఉత్పత్తి నిష్పత్తి పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా జిఎస్‌టి అమల్లోకి రావడంతోపాటు దేశ వ్యాప్తంగా నిఘా కూడా పెరగడంతో ఈ నిష్పత్తి 2019-20 నాటికి 11.9 శాతానికి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Pages