S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/13/2017 - 00:17

శనివారం చెన్నైలో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌పిటిఎఐ) 56వ వార్షిక సాధారణ సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మొబైల్ అప్లికేషన్‌ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

08/13/2017 - 00:15

అదాని పోర్ట్స్
నికర లాభం రూ. 710 కోట్లు

08/12/2017 - 00:11

న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే దాదాపు మూడింతలు ఎగిసింది. ఈసారి 3,032 కోట్ల రూపాయలుగా ఉంది. స్టాండలోన్ ఆధారంగా చూస్తే మాత్రం సుమారు ఐదింతలు ఎగిసింది. 2,006 కోట్ల రూపాయలుగా నమోదైంది.

08/12/2017 - 00:09

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రభుత్వ రంగ సంస్థ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్ప్ (ఆర్‌ఇసి) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 8.42 శాతం పెరిగి 1,301.14 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 1,420.86 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సంస్థ శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది.

08/12/2017 - 00:08

ముంబయి, ఆగస్టు 11: అనుమానిత షెల్ కంపెనీలపై నిషేధం వ్యవహారంలో ఆరు సంస్థలకు సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్) ఊరటనిచ్చింది. అనుమానిత 331 డొల్ల సంస్థల షేర్ల ట్రేడింగ్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిషేధం విధించగా, పార్శ్వనాథ్ డెవలపర్స్, మరో ఐదు సంస్థలు శాట్‌ను ఆశ్రయించాయి. దీంతో శుక్రవారం ఈ సంస్థల షేర్లపై ఉన్న సెబీ నిషేధాజ్ఞలను శాట్ ఎత్తివేసింది.

08/12/2017 - 00:07

న్యూఢిల్లీ, ఆగస్టు 11: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమాని విజయ్ మాల్యా.. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆదేశానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్) శుక్రవారం కొట్టివేసింది. దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలను రుణాలుగా పొంది, వాటిని తిరిగి చెల్లించలేక మాల్యా విదేశాలకు పారిపోయినది తెలిసిందే.

08/12/2017 - 00:07

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయల్) స్టాండలోన్ నికర నష్టం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే మరింత పెరిగింది. 801.38 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 535.52 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సంస్థ శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది.

08/12/2017 - 00:05

ముంబయి, ఆగస్టు 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా భారీ నష్టాల్లోనే ముగిశాయి. గత నాలుగు రోజుల నష్టాలను కొనసాగిస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 317.74 పాయింట్లు పతనమై 31,213.59 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 109.45 పాయింట్లు క్షీణించి 9,710.80 వద్ద నిలిచింది. ఇక ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 1,111.82 పాయింట్లు, నిఫ్టీ 355.60 పాయింట్లు నష్టపోయాయి.

08/12/2017 - 00:03

హైదరాబాద్, ఆగస్టు 11: ఇన్ఫోసిస్‌లోకి చైర్మన్ ఎమిరెట్స్‌గా ఎన్ ఆర్ నారాయణ మూర్తి మళ్లీ రావాలని ఆ సంస్థ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఒ) టి వి మోహన్‌దాస్ పాయ్ అన్నారు. దేశీయ రెండో అతిపెద్ద ఐటి రంగ సంస్థ ఇన్ఫోసిస్‌లో గత కొంతకాలం నుంచి ప్రమోటర్లకు, వ్యవస్థాపకులకు మధ్య అభిప్రాయ బేధాలు నెలకొన్నది తెలిసిందే.

08/12/2017 - 02:24

న్యూఢిల్లీ, ఆగస్టు 11: కార్పొరేట్ రుణాలను నయాపైస కూడా ప్రభుత్వం రద్దు చేయలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. శుక్రవారం లోక్‌సభలో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకుని ప్రతిపక్షాలు మాట్లాడాలని సూచించారు. రుణాల రద్దు అనేది బ్యాంకులు తీసుకునే వాణిజ్యపరమైన నిర్ణయమని, అందులో ప్రభుత్వ జోక్యం ఉండబోదన్నారు.

Pages