S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/11/2017 - 00:37

న్యూఢిల్లీ, ఆగస్టు 10: మహారాష్టల్రోని పూణె జిల్లాలోగల యాంబీవ్యాలీ ప్రాజెక్టు వేలం ప్రక్రియను నిలిపివేయాలంటూ సహారా అధినేత సుబ్రతారాయ్ చేసిన అభ్యర్థను సుప్రీం కోర్టు గురువారం తిరస్కరించింది. ఈ అభ్యర్థనను విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, రంజన్ గగొయ్, ఎకె సిక్రీలతో కూడిన ధర్మాసనం దీన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది.

08/11/2017 - 00:36

రాజమహేంద్రవరం,ఆగస్టు 10: ఎట్టకేలకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తోంది. గోదావరి జిల్లాల్లో సహజసిద్ధ అందాలతో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్న ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి పలు భారీ సంస్థలు పోటీపడుతున్నాయి. అఖండ గోదావరి నదీ పరీవాహక ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడంతో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుగా చేపట్టారు.

08/11/2017 - 00:31

ముంబయి, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బిఐ చెల్లించాల్సిన డివిడెండ్ సగానికి సగం తగ్గిపోయింది. గత ఏడాది 65,876కోట్ల మిగులు నిధులను డివిడెండ్‌గా ప్రభుత్వానికి అందించిన ఆర్‌బిఐ ఈ ఏడాది జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను కేవలం 30,659 కోట్ల రూపాయల డివిడెండ్‌ను మాత్రమే అందించింది.

08/11/2017 - 00:30

న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశ వ్యాప్తంగా కాఫీడే చెయిన్ రెస్టారెంట్లు నడుపుతున్న కాఫీడే ఎంటర్‌ప్రైజెస్ నికర లాభం తొలి త్రైమాసికంలో 51 శాతం పెరిగి 21 కోట్ల రూపాయలకు చేరుకుంది. జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో నికరలాభంలో 51.15 శాతం వృద్ధిని సాధించామని ఆ విధంగా నిరకలాభం 26.83 కోట్లకు చేరుకుందని సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో తమకు 17.75 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది.

08/11/2017 - 00:30

విజయవాడ, ఆగస్టు 10: వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో వస్త్ర వ్యాపారులకు ఎలాంటి భారం, ఇబ్బందులు ఉండబోవని సెంట్రల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి.రామనాథరెడ్డి అన్నారు. జీఎస్టీ అత్యంత ఉన్నతమైన పన్ను విధానమని ఆయన అన్నారు.

08/10/2017 - 01:41

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం 87.71 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఏకంగా 741.36 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఈ ఒక్క త్రైమాసికంలోనేకాదు..

08/10/2017 - 02:39

ముంబయి, ఆగస్టు 9: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 216.35 పాయింట్లు పతనమై 31,797.84 వద్ద ముగియగా, ఇది మూడు వారాల కనిష్ట స్థాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 70.50 పాయింట్లు పడిపోయి 9,908.05 వద్ద నిలిచింది.

08/10/2017 - 01:39

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 41.54 శాతం ఎగిసింది. ఈసారి 3,199.93 కోట్ల రూపాయలుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో 2,260.4 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టాటా మోటార్స్ తెలియజేసింది.

08/10/2017 - 01:39

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రభుత్వ రంగ సంస్థ, మినీరత్న హోదా కలిగిన ఎన్‌హెచ్‌పిసి స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో స్వల్పంగా పెరిగి 862.66 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 857.82 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సంస్థ బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది.

08/10/2017 - 01:39

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) ఏప్రిల్-జూలై వ్యవధిలో గతంతో పోల్చితే 19.1 శాతం పెరిగి 1.90 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9.80 లక్షల కోట్ల రూపాయల వసూళ్లను కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తొలి నాలుగు నెలల్లో 19.5 శాతం లక్ష్యం నెరవేరింది.

Pages