S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/07/2016 - 00:31

ముంబయి, డిసెంబర్ 6: టాటా-మిస్ర్తిల మాటల యుద్ధం ఆగడం లేదు. టాటా సన్స్ చైర్మన్‌గా మిస్ర్తి ఉద్వాసనకు గురైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను మిస్ర్తి మంగళవారం సమర్థించుకున్నారు. ముఖ్యంగా ఐరోపాలోని టాటా స్టీల్ మూసివేత నిర్ణయం సరైనదేనన్నారు. నష్టాల్లో నడుస్తున్న యూరోపియన్ టాటా స్టీల్ వల్ల మొత్తం టాటా గ్రూప్ ఉనికికే ప్రమాదం ఏర్పడేదని చెప్పారు.

12/07/2016 - 00:29

విశాఖపట్నం, డిసెంబర్ 6: అటవీ ఉత్పత్తుల్లో ముఖ్యమైనది, సహజ సిద్ధమైన, ఆరోగ్యప్రదమైన కుంకుళ్ళ నుంచి హెయిర్ షాంపును తయారు చేయాలని గిరిజన సహకార సంస్థ (జిసిసి) నిర్ణయించింది. నూతన సంవత్సర కానుకగా దీనిని దేశీయ మార్కెట్‌లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. గడచిన రెండేళ్ళ కాలంలో అనేక రకాలైన ఆకర్షణీయమైన పథకాలు, ప్రయోగాలతో చక్కటి ఫలితాలు సాధించిన జిసిసి..

12/07/2016 - 00:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఎయిర్‌సెల్.. ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. పరిమితస్థాయి ఉచిత డేటా వినియోగంతో నెట్‌పై 3 నెలల అపరిమిత కాల్స్‌ను ముందుకుతెచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకూ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. 148 రూపాయలకే ఈ ఆఫర్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపింది.

12/07/2016 - 00:26

న్యూఢిల్లీ, డిసెంబరు 6: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థికంగా చిక్కుల్లోపడిన కోళ్ళ పరిశ్రమను ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి తెలంగాణ పౌల్ట్రీ సంఘం విజ్ఞప్తి చేసింది. ఎంపి జితేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పౌల్ట్రీ సంఘం నాయకులు రంజిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రమేష్, సినీ నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఆర్థిక మంత్రితో సమావేశమై వినతి పత్రాన్ని అందజేశారు.

12/06/2016 - 00:28

రోమ్, డిసెంబర్ 5: ఇటలీ ప్రజలు అనూహ్యరీతిలో ప్రధాని ఆకాంక్షకు విరుద్ధంగా తీర్పునిచ్చారు. రాజ్యాంగంలో చట్ట సంస్కరణలు సరికాదన్న అభిప్రాయాన్ని ఆదివారం జరిగిన రెఫరెండమ్‌లో స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న ఈ రెఫరెండమ్‌లో మెజారిటీ ప్రజలు రాజ్యాంగ సంస్కరణొద్దు అంటూ ఓటేయడంతో సోమవారం ఇటలీ ప్రధాన మంత్రి మట్టెయో రేంజి రాజీనామా చేశారు.

12/06/2016 - 00:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: బహుళజాతి సంస్థలుగా ఎదగాలని భారతీయ ఇంధన సంస్థలకు పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశ ఆర్థికాభివృద్ధికి సుస్థిర, నిలకడైన ఇంధన ధరలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా, భారతీయ ఇంధన అవసరాల్లో మెజారిటీ శాతం విదేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

12/06/2016 - 00:22

ముంబయి, డిసెంబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 118.44 పాయింట్లు పెరిగి 26,349.10 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 41.95 పాయింట్లు ఎగిసి 8,128.75 వద్ద నిలిచింది.

12/06/2016 - 00:22

ముంబయి, డిసెంబర్ 5: టాటా సన్స్ నేతృత్వంలో నడుస్తున్న ట్రస్టులను సంస్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్ర్తి కోరారు. టాటా సన్స్ నిర్ణయాలు విశ్వసనీయంగా లేవని, సరైన నాయకత్వం లేదని అన్నారు. ఈ నెల 13న టాటా గ్రూప్ సంస్థల్లో అతిపెద్దదైన టిసిఎస్‌కు సంబంధించి ఇజిఎమ్ జరుగుతున్న క్రమంలో సోమవారం మిస్ర్తి పైవిధంగా స్పందించారు.

12/06/2016 - 00:20

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సోమవారం హైదరాబాద్‌లో 50 లక్షల రూపాయల చెక్కును అందజేస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, తదితరులు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఈ చెక్కును అందించారు.
చిత్రంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా ఉన్నారు

12/06/2016 - 00:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్, ఈ-పేమెంట్లను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సప్లయర్స్, కాంట్రాక్టర్లు లేదా సంస్థలకు జరిపే చెల్లింపులు 5,000 రూపాయలను మించితే నగదు రూపంలో ఇవ్వరాదని, ఎలక్ట్రానిక్ విధానంలోనే పేమెంట్లు జరపాలంటూ అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది.

Pages