S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/10/2016 - 00:24

ముంబయి, డిసెంబర్ 9: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో తమ 3.9 శాతం వాటాను అమ్మేయనుంది. గ్లోబల్ ఇనె్వస్ట్‌మెంట్ సంస్థలైన కెకెఆర్, టెమసెక్‌లకు 1,794 కోట్ల రూపాయలకు ఈ వాటాను ఎస్‌బిఐ విక్రయిస్తోంది. ఈ విక్రయానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆమోదం లభించినట్లు ఎస్‌బిఐ తెలిపింది. ఒక్కో షేర్‌ను 460 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పింది.

12/09/2016 - 00:42

ముంబయి, డిసెంబర్ 8: గురువారం జరిగే ఐరోపా సెట్రల్ బ్యాంక్ ద్రవ్య సమీక్షలో ఉద్దీపక చర్యలను కొనసాగించవచ్చన్న అంచనాలకు తోడు, పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటామని ఆర్‌బిఐ హామీలు ఇచ్చిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాలు ఆర్జించాయి.

12/09/2016 - 00:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఏడాదికి కోటిన్నరకన్నా తక్కువ టర్నోవర్ ఉంటే పన్ను చెల్లింపుదారులపై అధికారం పూర్తిగా తమకే ఉండాలని రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్ వల్ల కేంద్రం అధికారాలు తగ్గిపోతాయని కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల బోర్డు (సిబిఇసి) చైర్మన్ నజీబ్ షా గురువారం అన్నారు.

12/09/2016 - 00:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: టాటా గ్రూపులో అన్‌లిస్టెడ్ సంస్థ అయిన టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (టిటిఎల్) ఈ నెల 14వ తేదీన తమ వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనుంది. టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పదవి నుంచి సైరస్ మిస్ర్తిని తొలగించాలంటూ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిశీలించేందుకు టిటిఎల్ ఈ సమావేశాన్ని నిర్వహించనుంది.

12/09/2016 - 00:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో అమ్ముకుని ఆదాయాన్ని పెంపొందించుకునేలా రైతులకు వీలుకల్పిస్తున్న ప్రభుత్వం తొలి విడతగా దేశంలోని పది రాష్ట్రాల్లో గల 250 మండీలను ఇ-నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించిందని, దీని ద్వారా 421 కోట్ల రూపాయల సరుకుల క్రయవిక్రయాలు జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ వెల్లడించారు.

12/09/2016 - 00:32

చెన్నై, డిసెంబర్ 8: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంకు తమ ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంకింగ్) (ఎఫ్‌సిఎన్‌ఆర్-బి) టర్మ్ డిపాజిట్లకు సంబంధించిన వడ్డీ రేట్లను సవరించింది.

12/09/2016 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశీయ టెలికామ్ మార్కెట్లో వాణిజ్య పరంగా సేవలను ప్రారంభించకముందే పెను సంచలనాలు సృష్టిస్టున్న రిలయన్స్ జియో ధాటికి మిగిలిన ఆపరేటర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం తమ ఖాతాదారులకు ఉచితంగా అందజేస్తున్న సేవలను మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు రిలయన్స్ జియో కొద్ది రోజుల క్రితం మరో సంచలన ప్రకటన చేసిన విషయం విదితమే.

12/09/2016 - 00:28

చెన్నై, డిసెంబర్ 8: ప్రయాణికులకు చౌకధరలో విమానయాన సేవలను అందిస్తున్న ‘స్పైస్‌జెట్’ విమానయాన సంస్థ తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి చెన్నై-రాజమండ్రి మార్గంలో ప్రతి రోజూ నేరుగా విమానాలను నడపనుంది. దీంతో తాము ప్రతి రోజూ రాజమండ్రికి నేరుగా విమానాలను నడుపుతున్న మెట్రో నగరాల్లో హైరరాబాద్ తర్వాత చెన్నై రెండవ నగరం అవుతుందని స్పైస్‌జెట్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.

12/09/2016 - 00:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: రిజర్వ్ బ్యాంక్ బుధవారం జరిపిన ద్రవ్యపరపతి విధానం సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించకపోయినప్పటికీ కొత్త సంవత్సరంలో 25-50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే అవకాశాలు లేకపోలేదని ఓ తాజా నివేదిక అభిప్రాయ పడింది.

12/09/2016 - 00:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఈ ఏడాదితో పోలిస్తే 2017లో ఉద్యోగుల జీతాలు తక్కువగా పెరగవచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలు 10.3 శాతం పెరగ్గా, వచ్చే ఏడాది సగటున పది శాతం మేర మాత్రమే పెరగవచ్చని, ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే ఈ పెరుగుదల 4.8 శాతమే ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది.

Pages