S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/05/2016 - 00:18

పనాజి, డిసెంబర్ 4: బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణాలను తీసుకుని వాటి ఎగవేతకు పాల్పడిన విజయ్ మాల్యా, అలాంటి వాళ్లందరిపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) డిమాండ్ చేసింది. ‘తీసుకున్న రుణాలను చెల్లించని మాల్యాతోసహా 8వేల మంది డిఫాల్టర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.’ అని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సివి వెంకటాచలం ఆదివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు.

12/05/2016 - 00:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ కొనసాగుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెలలో దాదాపు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామాల ప్రభావం కూడా భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది. యూరోజోన్ సభ్యత్వంపై ఇటలీ రెఫరెండమ్ కూడా మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది.

12/04/2016 - 00:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో క్రెడిట్, డెబిట్ కార్డులనే కాదు.. ఇక ఈ-వాలెట్లు, మొబైల్ వాలెట్లనూ నగదుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే.

12/04/2016 - 00:14

వడోదర, డిసెంబర్ 3: ప్రభుత్వరంగ ట్రేడింగ్ సంస్థ ఎమ్‌ఎమ్‌టిసిలో ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) 15 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) వేద్ ప్రకాశ్ శనివారం ఇక్కడ తెలిపారు. ‘సంస్థలో 15 శాతం ప్రభుత్వ వాటా అమ్మకానికి మేము సిద్ధంగా ఉన్నాం.

12/04/2016 - 00:13

జపాన్ ఆటోరంగ సంస్థ నిస్సాన్ మోటార్.. భారతీయ మార్కెట్‌కు తమ ప్రతిష్ఠాత్మక కారు జిటి-ఆర్‌ను పరిచయం చేసింది. ముంబయలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం
ఈ సూపర్ కార్‌తో ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.
ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 1.99 కోట్ల రూపాయలు. జపాన్‌లోని తొచిగిలోగల నిస్సాన్ ప్లాంట్‌లో
జిటి-ఆర్ తయారవుతోంది

12/04/2016 - 00:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే అక్రమ సంపద.. సక్రమ సంపదైపోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న నల్లధనానికి పన్ను చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘కేవలం బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా పన్ను చెల్లించకుండా తప్పించుకోవచ్చని అనుకోవద్దు.’ అన్నారు.

12/04/2016 - 00:09

భీమవరం, డిసెంబర్ 3: అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్నప్పటికీ నాణ్యత లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశీయ ఆక్వా ఉత్పత్తులను సంస్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతు న్నాయ. ఇప్పటికే యాంటీ బయోటిక్స్ వినియోగంపై కేంద్రం ఆంక్షలు విధించగా, తాజాగా పౌల్ట్రీ, కబేళా వ్యర్థాలను ఆక్వాసాగులో వినియోగించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

12/04/2016 - 00:04

హైదరాబాద్, డిసెంబర్ 3: ఫార్మాసిటీ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) కసరత్తు చేస్తోంది. దీనికి మొత్తం 12,500 ఎకరాలు అవసరమని, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్వీకరించి అమలు చేస్తోందని టిఎస్‌ఐఐసి చైర్మన్ జి బాలమల్లు తెలిపారు. శనివారం ఆయన టిఎస్‌ఐఐసి అధికారులతో కలిసి ఫార్మాసిటీ ప్రాంతాన్ని సందర్శించారు.

12/04/2016 - 00:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్ప్ (జిఎస్‌పిసి) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమార్ధం (ఏప్రిల్- సెప్టెంబర్)లో 374.03 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ప్రథమార్ధంలో ఇది 369.55 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. చమురు అనే్వషణ వ్యయం తదితరాల రద్దు నేపథ్యంలో నష్టాలపాలైంది.

12/03/2016 - 01:39

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తమ అక్రమ సంపదను సక్రమంగా మార్చుకోవడానికి అడ్డదారులను తొక్కుతున్నవారిని విడిచిపెట్టేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

Pages