S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/06/2016 - 00:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఎయిర్‌సెల్.. సోమవారం ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. పరిమితస్థాయి ఉచిత డేటా వినియోగంతో నెట్‌పై 3 నెలల అపరిమిత కాల్స్‌ను ముందుకుతెచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకూ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. 148 రూపాయలకే ఈ ఆఫర్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపింది.

12/06/2016 - 00:15

న్యూఢిల్లీ, డిసెంబరు 5: పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థికంగా చిక్కుల్లోపడిన కోళ్ళ పరిశ్రమను అదుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లిని తెలంగాణ పౌల్ట్రీ సంఘం విజ్ఞప్తి చేసింది. ఎంపి జితేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పౌల్ట్రీ సంఘం నాయకులు రంజిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, రమేష్, సినినిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఆర్థిక మంత్రితో సమావేశమై వినతి పత్రాన్ని అందజేశారు.

12/06/2016 - 00:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: నిస్సాన్ మోటార్ దేశీయ అమ్మకాలు గత నెల నవంబర్‌లో 52 శాతం పెరిగాయి. ఈసారి 3,975 యూనిట్లు అమ్మితే, నిరుడు నవంబర్‌లో 2,617 యూనిట్లను విక్రయించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో నిస్సాన్ మోటార్ తెలిపింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కరెన్సీ కొరత ఉన్నప్పటికీ సంస్థ కార్ల అమ్మకాలు పెరగడంపట్ల నిస్సాన్ ఆనందం వ్యక్తం చేసింది.

12/06/2016 - 00:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: కార్ల ధరలను పెంచనున్నట్లు టొయోటా కిర్లోస్కర్ మోటార్ సోమవారం ప్రకటించింది. జనవరి 1 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పెరిగిన ఉత్పాదక వ్యయం, ఫారిన్ ఎక్స్‌చేంజ్ ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పుల మధ్య ధరల పెంపు అనివార్యమైందని తెలిపింది. స్టీల్, అల్యూమినియం, కాపర్, రబ్బర్ ధరలు పెరిగాయని, కాబట్టి తమ వాహనాల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు వివరించింది.

12/05/2016 - 00:27

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష, స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా యూరోజోన్ సభ్యత్వంపై ఇటలీ రెఫరెండమ్‌పట్ల విదేశీ మదుపరుల చూపు నెలకొందని చెబుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఓటింగ్ జరగగా, సోమవారం ఉదయం ఫలితాలు వెల్లడి కానున్నాయ.

12/05/2016 - 00:26

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: పాత పెద్ద నోట్ల రద్దు.. ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని, 10 శాతం జిడిపి నమోదుకు కృషి చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వృద్ధిరేటు పడిపోతుందన్న అంచనాలు దేశ, విదేశీ రేటింగ్ ఏజెన్సీల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి వాటిని ఖండించారు.

12/05/2016 - 00:25

హైదరాబాద్, డిసెంబర్ 4: ఆర్‌పి గోయెంకా నేతృత్వంలోని అతిపెద్ద రిటైలర్ స్పెన్సర్స్ సంస్థ హైదరాబాద్‌లో హైపర్‌స్టోర్స్ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. ఇందులోభాగంగానే ఐదో స్టోర్‌ను ప్రారంభించగా, సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి వద్ద దాదాపు 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని అందుబాటులోకి తెచ్చింది.

12/05/2016 - 00:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ నెలసరి వేతనం 2 లక్షల రూపాయలని, ఆయన నివాసంలో సహాయకులు ఎవరూ లేరని ఆర్‌బిఐ తెలిపింది. ముంబయిలో ఆర్‌బిఐ డిప్యూటి గవర్నర్ల ఫ్లాట్లలోనే ఆయన ఉంటున్నారని ఓ ఆర్‌టిఐ ప్రశ్నకు సమాధానంగా సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే రెండు కార్లు, ఇద్దరు డ్రైవర్ల సదుపాయాన్ని మాత్రం కల్పించినట్లు తెలిపింది.

12/05/2016 - 00:21

గాజువాక (విశాఖ), డిసెంబర్ 4: ఔషధ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న లారస్ ల్యాబ్స్.. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. సుమారు 1,332 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపిఒ)కు వస్తోంది. కాగా, షేర్ కనిష్ట ధర 426 రూపాయలు, గరిష్ఠ ధర 428 రూపాయలు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు షేర్ ధరలో 10 శాతం తగ్గించి విక్రయించేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

12/05/2016 - 00:19

ముంబయి, డిసెంబర్ 4: నల్లధనం నిరోధానికి పన్ను చట్టాల మార్పు అవసరం ఎంతైనా ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం పన్ను చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్న ఆయన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం.. నల్లధనం కట్టడికి అవలంభించాల్సిన చర్యల్లో ఒకటి మాత్రమేనని, ఇలాంటి నిర్ణయాలు మరెన్నో తీసుకోవాల్సి ఉందని అన్నారు.

Pages