S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/06/2016 - 07:27

బీజింగ్: ఈ ఏడాదికిగాను జిడిపి వృద్ధిరేటు లక్ష్యాన్ని 6.5-7 శాతానికి తగ్గించింది చైనా. ఆ దేశ ప్రధాని లీ కెక్వియాంగ్ శనివారం ఇక్కడ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వార్షిక సమావేశం సందర్భంగా తమ ప్రభుత్వ పనితీరుపై ఓ నివేదిక విడుదల చేశారు. ఎన్‌పిసిలోని 3,000 మంది సభ్యులకు ఈ నివేదికను సమర్పించారు.

03/06/2016 - 07:26

ముంబయి: మదుపరుల కొనుగోళ్ల ఉత్సాహం మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం భారీ లాభాలను అందుకున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత సూచీలు పెద్ద ఎత్తున పుంజుకున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌తో మదుపరులు పెట్టుబడులవైపు ఆసక్తి కనబరిచారు. బడ్జెట్ రోజున పన్ను భయాల మధ్య నష్టాలకు లోనైనప్పటికీ..

03/05/2016 - 06:38

గుర్గావ్: అవసరమైతే ప్రభుత్వరంగ బ్యాంకులకు మరిన్ని నిధులను కేంద్రం అందిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని మొండి బకాయిల సమస్య ప్రభుత్వానికి బాగా తెలుసన్న ఆయన ప్రభుత్వరంగ బ్యాంకులకు మరిన్ని నిధులను అందించడానికి తాము సిద్ధమని చెప్పారు. శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో జ్ఞాన్ సంగం సందర్భంగా విలేఖరులతో సిన్హా మాట్లాడారు.

03/05/2016 - 06:35

న్యూఢిల్లీ: ‘ఫ్రీడమ్ 251’ వ్యవహారం మరో ఆసక్తికర మలుపు తిరిగింది. ఇప్పటికే ఎన్నో అనుమానాలు, మరెన్నో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఈ ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్ అంశంలో ఇప్పుడు సరికొత్త వార్తా బయటికొచ్చింది. అదేమిటంటే?.. రింగింగ్ బెల్స్‌కు ఒక్కో మొబైల్‌ను 3,600 రూపాయల చొప్పున అమ్మినట్లు యాడ్‌కామ్ సంస్థ తెలిపింది.

03/05/2016 - 06:34

న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎమ్‌ఐఎల్).. శుక్రవారం కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల మోడళ్లపై కనిష్టంగా 2,889 రూపాయలు, గరిష్ఠంగా 82,906 రూపాయల చొప్పున ధరలను పెంచుతున్నామని స్పష్టం చేసింది. పెరిగిన ధరలు ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది.

03/05/2016 - 06:33

హైదరాబాద్: భారతీయ మహిళలు పారిశ్రామిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని సిఐఐ తెలంగాణ విభాగం చైర్‌పర్సన్ దాట్ల వనిత అన్నారు. రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిఐఐ ఆధ్వర్యంలోని మహిళా పారిశ్రామికవేత్తల సమావేశం శుక్రవారం ఇక్కడ జరిగింది. ఇందులో పలు సంస్థల మహిళాధిపతులు పాల్గొన్నారు.

03/05/2016 - 06:32

న్యూఢిల్లీ: పసిడి బాండ్ల పథకం మూడో దశను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇంతకుముందు రెండు దశల్లో ఈ పథకం ద్వారా దాదాపు 1,050 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. ఈ క్రమంలో ఈ నెల 8 నుంచి 14 వరకు బాండ్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని, 29న బాండ్లను జారీ చేస్తామని ఓ ప్రకటనలో శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

03/04/2016 - 08:23

దేవరపల్లి: ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు వేలం ప్రారంభానికి ఈ నెల 11న ముహుర్తం ఖరారు కావడంతో రైతులు గిట్టుబాటు ధరపై ఆశలు పెట్టుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా వరుసగా నష్టాలు చవిచూస్తున్న రైతులు ఈ సంవత్సరమైనా గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు మార్కెటును శాసించే ఐటిసి సంస్థపైనే గట్టి నమ్మకంతో ఉన్నారు.

03/04/2016 - 08:20

వాషింగ్టన్: అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పతనమవడం భారత్‌కు ‘ఎంతో సానుకూల’ అంశంగా పరిణమించిందని, దీని వలన భారత్ ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించుకోగలగడంతో పాటు సరుకులు, సేవలపై అధిక మొత్తాన్ని వెచ్చించేందుకు వీలు కలిగిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ‘అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గడం భారత్‌కు ఎంతో ప్రయోజనం చేకూర్చింది.

03/04/2016 - 08:19

న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం 32 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొత్తగా నాలుగు మేజర్ పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నౌకాయాన శాఖ సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

Pages