S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

09/18/2017 - 01:00

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఒడిస్సాలోని స్థానిక రాజకీయ గూండాల అక్రమాల్ని రిపోర్టు చేసినందుకు ఓ స్థానిక దినపత్రిక రిపోర్టర్ భార్య అయిన చాచిరాణిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపారు. నాడు ఇదో సంచలన వార్త! ఎంత నిజాయితీపరులైన జర్నలిస్టులుగాని ఇలాంటి ఘటనలతో తిరిగి ఇదే వృత్తిని కొనసాగించే సాహసం చేయలేరు. పైగా జీవచ్చవంలా మారిపోతారు. లేదా ఆత్మహత్య చేసుకుంటారు.

09/17/2017 - 02:27

ప్రశ్నించేందుకే పార్టీ పెడుతున్నానని మూడేళ్ల క్రితం తెరపైకి వచ్చిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మూడేళ్ల సంబరం సందర్భంగా చేసిన ట్వీట్ ముచ్చటేసింది. ‘మూడేళ్ల క్రితం జనసేన ప్రయాణం మొదలు పెట్టిన నాకు దారంతా గోతులు. చేతిలో దీపం లేదు. ధైర్యమే కవచంగా ఒకే గొంతుకతో మొదలుపెట్టా.

09/16/2017 - 02:14

బ్రిటిష్‌వారు దేశం వదలి వెళ్లిపోవటంతో, అప్పటివరకు వారి సామంత రాజుగా కొనసాగిన తాను ఇక స్వతంత్ర రాజ్యాధిపతినని విర్రవీగిన నిజాం మెడవంచి, భారత్‌లో విలీనం కావడం తప్ప గత్యంతరం లేని పరిస్థితులను సృష్టించడంతో 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగింది. మతోన్మాదం సృష్టించిన తీవ్ర అరాచక పాలన నుండి ప్రజలు విముక్తులయ్యారు.

09/14/2017 - 23:38

ఓనిజాము పిశాచమా!
కానరాడు! నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ!

09/14/2017 - 00:25

‘గంగా సంగమమిచ్చగించెనె?
మదిన్ కావేరి దేవేరిగాన్
అంగీకార మొనర్చునే యమునతో
ఆనందమున్ పొందునే?
రంగత్తుంగ తరంగ శోభలతో, ఆ
రత్నాకరేంద్రుడు నీ
అంగంబంటి సుఖించునేని
గుణ భద్రా తుంగభద్రా నదీ!’’

09/13/2017 - 00:47

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో అమితుమి తేల్చుకోవడానికి భద్రతా బలగాలు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఇటీవల సిఆర్‌పిఎఫ్, కోబ్రా, ఎస్‌టిఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా బీజాపూర్, సుకుమా జిల్లాల్లో ‘ప్రహార్’ పేర రెండు రోజుల ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు మరణించినట్టు, ఐదుగురు గాయపడినట్టు ప్రత్యేక డిజిపీ అవస్థీ చెప్పారు.

09/11/2017 - 23:47

భాష భావాభివ్యంజన సాధనం, జ్ఞానార్జనకు మూలం. అది పారంపరికమై, జన వ్యవహారములో రూఢమై, అనుకరణ, శిక్షణల ద్వారా వ్యాప్తి చెంది భాషా నైపుణ్యాల రూపంలో ఆర్జింపబడుతుంది. భాష - భావం పరస్పరాశ్రయాలు. అందుభావం ప్రధానం, భాష ఆనుషంగికం. భాష సామూహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. భాషా సాధనంలో మానవుడు జ్ఞాన విజ్ఞానాలను పెంపొందించుకొని కొత్త అనుభూతులను, కొత్త వైఖరులను, కొత్త అభిరుచులను ఏర్పరచుకుంటాడు.

09/10/2017 - 22:34

మానవ నిర్మితాలైన గుళ్లు, గోపురాలు, కోటలు, భవంతులు.. చివరికి సమాధులను సైతం రక్షితప్రాంతాలుగా ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్‌ఐ) ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో అడవులను అభయారణ్యాలంటూ- వాటిని రక్షించాలని సూచిక బోర్డుల్ని పెడుతున్నది. ఈ విధంగా గుర్తించబడిన కట్టడాలకు నిఘా, రక్షణ కల్పిస్తూ, వాటిని పరిరక్షించేందుకు నిధుల్ని కూడా కేటాయిస్తున్నది.

09/10/2017 - 00:52

ఏపిలో రెండు కీలక ఎన్నికల ఫలితాలు కొత్త పరిణామాలకు దారులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ పైకి కలసి ఉన్నట్లున్నా, అంతర్గతంగా అం త సఖ్యతగా లేని తెదేపా-్భజపా సంబంధాలు నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త మలుపు తిరిగే అవకాశాల్ని కొట్టివేయలేం.

09/09/2017 - 03:29

దివంగత కాళోజీ నారాయణరావు ఆత్మకథ ‘ఇదీ నా గొడవ’ను నేను గత పదిహేను సంవత్సరాలలో అనేకసార్లు చదివాను. అందులో ఆయన చెప్పిన ప్రతి అంశమూ పదిమందీ తెలుసుకోవాల్సిందే! అసలా పుస్తకం ఇప్పుడు దొరుకుతుందో లేదో? తెలియదు.

Pages