S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

06/09/2016 - 22:07

*ముదిరిపోయిన ఆనపగింజల్ని బియ్యంతో కలిపి నానేసి రుబ్బి, దోసెల్లా పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.
*బియ్యంలో కొంచెం మెంతులు కలిపి రుబ్బితే దోసెలు గట్టిగా ఉంటాయి.
*మిగిలిపోయిన అన్నంలో ఎర్రకారం, జీలకర్ర, కొంచెం ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి వడియాలుగానో, చిప్స్‌గానో పెట్టుకొని ఎండాక వేయించుకుని తింటే రుచిగా ఉంటాయి.

06/09/2016 - 00:49

మనకు లభించే పండ్లు చాలామటుకు తినటానికి రుచికరంగా వుంటాయి. అలాగే ఆరోగ్యానికి మంచి ఔషధాలుగా ఉపయోగపడతాయి. వాటిలో పనస కూడా ఒకటి. జుట్టు రాలిపోవడం, తల దురద వంటి వాటి నివారణకు పనస గింజలు చక్కగా పనిచేస్తాయి. ఈ గింజలను ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని, ఆ తరువాత ఒకటిన్నర చెంచా పనస గింజల పొడి, ఒక చెంచా పెసరపొడి, నువ్వుల నూనె కలిపి తలకు రాసుకుని పది నిముషాల తరువాత శీకాయతోగానీ, షాంపూతోగాని కడుక్కోవాలి.

06/05/2016 - 05:14

నిమ్మరసంలో కొంచెం ఆవనూనె, కొంచెం కర్పూరం కలిపి ఒంటికి రాసుకుని, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తే శరీరఛాయ పెరుగుతుంది.
-అజీర్తితో బాధపడుతుంటే రెండు మూడు చిన్న అల్లం ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకోండి.
లెమన్‌గ్రాస్‌కు బదులుగా లెమన్ జెస్ట్ (నిమ్మ చెక్కను పొట్టుగా తురిమితే వస్తుంది)ను వాడుకోవచ్చు.
బొట్టు బిళ్ళలు వాడటం వల్ల ముఖంపై మచ్చపడితే తులసి రసం రాయండి.

06/01/2016 - 22:14

మనం అరుదుగా ధరించే బట్టలు పెట్టెల్లో పెట్టి ఉంచుతాం. పెట్టెలలో చాలా రోజులు వుంచడంవల్ల కొన్ని రకాలైన చీడపురుగులు, క్రిమి కీటకాలు చేరి బట్టలను కొరికి పాడు చేస్తూంటాయి. వీటి బారిన పడకుండా బట్టలు సురక్షితంగా వుంచాలంటే కొద్దిగా కర్పూరం, లవంగాల పొడి మిశ్రమాన్ని పెట్టె మూలల్లో వేసి వుంచినట్లయితే ఎలాంటి పురుగులైనా సరే నాశనమవుతాయి. బట్టలు సురక్షితంగా ఎంతకాలమైనా వుంటాయి.

05/31/2016 - 23:21

నేటి ఆహారపు అలవాట్లు అధిక రక్తపోటుకు దారితీస్తుంది. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తరచూ, కనీసం నెలకొకసారి తమ రక్తపోటు ఎంత వున్నదీ పరీక్ష చేయించుకోవడం ఎంతైనా మంచిది.
రక్తపోటుని అదుపులో వుంచడానికి అధిక రక్తపోటుగలవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం.
ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. సోడియం వున్న పదార్థాలు, కొవ్వు ఎక్కువగా వున్న ఆహారం ఎంత తక్కువ తింటే అంత మంచిది.

05/26/2016 - 22:05

వండటానికి ముందు గింజ ధాన్యాలను మళ్లీ మళ్లీ కడగకండి.
ముక్కలు చేసిన తర్వాత కూరగాయలను కడగకండి.
ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువసేపు నానబెట్టకండి.
వండిన తరువాత మిగిలిన నీటిని పారబోయకండి.
ఆహారం వండుతున్నపుడు గినె్నపై మూత ఉంచండి.
ఎక్కువ నూనెలో వేపుడు, కొద్దిగా వేయించే పద్ధతుల కంటే ఆహారాన్ని ప్రెజర్ కుక్కర్‌లో, ఆవిరిలో వండటాన్ని ఎంచుకోండి.

05/25/2016 - 21:53

ఎండు ద్రాక్షల్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ఫైబర్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్, నీరు, విటమిన్ సి లాంటి పోషక పదార్థాలు లభిస్తాయి. ఇవి శరీరారోగ్యానికి మేలు చేయడమే కాక, ఔషధపరంగా కూడా ఉపయోగిస్తుంది.

05/24/2016 - 22:07

ఈ కాలంలో నేరేడుపండ్లు సమృద్ధిగా దొరుకుతాయి. వృద్ధాప్యం త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశమున్నది. అలాంటి అనారోగ్యాల నుంచి కాపాడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. డయాబెటీస్‌తో పోరాడతాయి. సుగర్ లెవల్స్ సమతుల్యంగా ఉండేటట్లు చేస్తాయి. తప్పనిసరిగా ఈ పండ్లను సీజన్‌లో తీసుకోవటం మంచిదని పెద్దలు సైతం చెబుతుంటారు.

05/20/2016 - 21:44

ఎండలో తిరిగొచ్చేసరికి ముఖం పై మురికి పట్టేస్తుంది. దీనివల్ల ముఖం కాంతి విహీనంగా కనిపిస్తుంది. ముఖంపై పట్టిన ఈ మురికిని వదిలించుకుంటే మంచిది. దీనికి వంటింట్లో దొరికే పదార్థాలనే ఉపయోగించుకోవచ్చు. టొమాటో గుజ్జు చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది. దీనిని ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే మురికి పోవటంతో పాటు మంచి మెరుపు కనిపిస్తోంది.

05/19/2016 - 04:01

మెనోపాజ్ స్థితికి చేరుకున్న మహిళలలో ఈస్ట్రోజన్ హార్మోను ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆ కారణంగా, అటువంటి స్ర్తిలలో మానసికంగా, శారీరకంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. శరీరంలో వెచ్చని ఆవిర్లు రావడం, చెమట పట్టడం, ఎముకల పటిష్టత తగ్గిపోయి ఆస్టియో పోరోసిస్ అనే ఎముకల వ్యాధికి గురవటం లాంటి ఇబ్బందులు శారీరకమయితే, అశాంతి, కోపం, చికాకు, డిప్రెషన్, మూడ్స్ మారిపోతూండటం లాంటి లక్షణాలు మానసికమయినవి.

Pages