S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/02/2018 - 01:06

పలు (ఇండోనేషియా), అక్టోబర్ 1: తీవ్ర భూకంపం, సునామీ ధాటికి అల్లకల్లోలమైన ఇండోనేషియాలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 800 మందికి పైగా అని అధికారులు వెల్లడించినా, ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మృతదేహాల ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా సామూహిక దహనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

10/02/2018 - 00:42

ఇస్లామాబాద్, అక్టోబర్ 1: నిర్ధారణ కాని కొత్తవ్యాధితో బాధపడుతున్న పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్( 75) రోజురోజుకు క్షీణించిపోతున్నారని, ఈ పరిస్థితుల్లో ఆయన ఎదుర్కొంటున్న రాజద్రోహం కేసుకు సంబంధించిన విచారణకు రాలేరని ఆయన పార్టీకి చెందిన సీనియర్ లీడర్ ఒకరు తెలిపారు. 2016 నుంచి దుబాయ్‌లో ఉంటున్న ముషారఫ్ రాజ్యాంగాన్ని రద్దు చేశారన్న అభియోగంపై తీవ్ర రాజద్రోహం కేసును ఎదుర్కొంటున్నారు.

10/02/2018 - 00:14

స్టాక్‌హోం, అక్టోబర్ 1: శరీరంలో ఉండే సహజసిద్ధమైన నిరోధక వ్యవస్థ ద్వారానే కేన్సర్ మహమ్మారిని అంతం చేసే సరికొత్త చికిత్సా విధానానికి అంకురార్పణ చేసిన అమెరికా, జపాన్ వైద్యులకు వైద్యశాస్త్రంలో సమున్నత నోబెల్ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన జేమ్స్ అలిసన్, జపాన్‌కు చెందిన అసుకుహోంజో ఈ అవార్డును సంయుక్తంగా పంచుకున్నారు.

10/01/2018 - 06:02

బీజింగ్, సెప్టెంబర్ 30: చైనా యుద్ధ సన్నాహాలు చేస్తున్నది. ఏ దేశంపైకి కాలుదువ్వుతుందో లేక ఏ దేశం నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టిందోగానీ ఆయుధ బలాన్ని పరీక్షించుకుంటున్నది. ఇటీవలే మూడు హైపర్‌సోనిక్ ఎయిర్‌క్రాఫ్ట్ మోడల్స్‌ను పరీక్షించించిందని చైనా మీడియా ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.

10/01/2018 - 02:26

పలూ (ఇండోనేషియా), సెప్టెంబర్ 30: ఇండోనేషియాలోని పలూ ప్రాంతాన్ని కుదిపేసిన సునామీలో మృతుల సంఖ్య 800లకుపైగానే ఉందని అధికారులు ప్రకటించారు. చనిపోయిన వారి భౌతిక కాయాలను ఆదివారం సామూహికంగా ఖననం చేశారు. మృతుల సంఖ్య పెరుగుతునే ఉందని, ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 832 మంది మరణించారని ఇండోనేషియా ఉపాధ్యక్షుడు జూసుఫ్ కల్లా ప్రకటించారు.

10/01/2018 - 05:02

ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 30: ప్రపంచంలో ఉగ్రవాదం పీచమణించేందుకు జరుగుతున్న యుద్ధంలో భారత్ కీలక భాగస్వామి అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ అన్నారు. ఉగ్రవాదమనే పెనుభూతాన్ని నిర్మూలించకపోతే అభివృద్ధి సాధించలేమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై రాజీలేకుండా పోరాడే దేశాల మధ్య సమన్వయం, సహకారం ఉండాలన్నారు. దీని వల్ల ఉగ్రవాదాన్ని తరిమిగొట్టడం సాధ్యమవుతుందన్నారు.

10/01/2018 - 05:03

* ఎన్నికలకు దూరం కావడం మంచిది కాదంటున్న కాంగ్రెస్ సీనియర్లు

10/01/2018 - 01:39

ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 30: ప్రపంచంలో ఉగ్రవాదం పీచమణించేందుకు జరుగుతున్న యుద్ధంలో భారత్ కీలక భాగస్వామి అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రెస్ అన్నారు. ఉగ్రవాదమనే పెనుభూతాన్ని నిర్మూలించకపోతే అభివృద్ధి సాధించలేమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదంపై రాజీలేకుండా పోరాడే దేశాల మధ్య సమన్వయం, సహకారం ఉండాలన్నారు. దీని వల్ల ఉగ్రవాదాన్ని తరిమిగొట్టడం సాధ్యమవుతుందన్నారు.

09/30/2018 - 02:28

ఐక్యరాజ్యసమితి, సెప్టెంబర్ 29: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంతో చర్చలు ఎలా సాధ్యమవుతాయని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ హంతకులను ప్రశంసిస్తూ వారిని వెనకేసుకొస్తున్నందుకే పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక చర్చలను నిలిపివేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘చర్చలకు వెన్నుపోటు పొడుస్తున్నామని మమ్మల్ని నిందిస్తున్నారు.

09/30/2018 - 05:26

పలూ, సెప్టెంబర్ 29: భారీ భూకంపం సృష్టించిన విధ్వంసం నుంచి బయటపడక ముందే, సునామీ పలూను ముంచెత్తింది. భూకంపానికి అతలాకుతలమైన ఇండోనేషియా నగరం పలూ 24 గంటల కూడా గడవక ముందే సునామీలో చిక్కుకొని విలవిల్లాడింది. ఇప్పటివరకూ 384 మంది మృతి చెందారని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే, ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు.

Pages