S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

03/12/2016 - 06:00

సీమాంతర ఉగ్రవాద కేసుల సమర్థ విచారణకు అవసరం
సుప్రీంకోర్టు న్యాయమూర్తి శరద్ బోబ్‌డే సూచన

03/12/2016 - 05:11

ఆ వీసా విధానాన్ని రద్దు చేసి తీరాలి: ట్రంప్

03/11/2016 - 12:49

లండన్‌: ఆస్కార్‌ విజేత సినీ ప్రొడక్షన్‌ డిజైనర్‌ కెన్‌ ఆడమ్‌(95) కన్నుమూశారు. ద మ్యాడ్‌నెస్‌ ఆఫ్‌ కింగ్‌ జార్జ్‌, బారీ లిండన్‌ చిత్రాలకు ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పనిచేసినందుకుగాను ఆడమ్‌ ఆస్కార్‌ అవార్డులను అందుకున్నారు.

03/11/2016 - 11:43

దిల్లీ: అంతర్జాతీయంగా పేరున్న వ్యాపారస్తుడిని గనుక తాను ప్రపంచంలో ఎక్కడికైనా వెళుతుంటానని, బిజినెస్ పనిపై తాను లండన్ వచ్చానని బ్యాంకులను మోసగించిన కేసులో నిందితుడైన లిక్కర్ కింగ్, రాజ్యసభ ఎంపీ విజయ్ మాల్యా పేర్కొన్నారు. తాను దేశం విడిచి పారిపోయినట్లు మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని ఆయన తాజాగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చట్టాలు, కోర్టులంటే గౌరవం ఉన్న తాను దేశం విడిచి ఎందుకు వెళతానన్నారు.

03/11/2016 - 06:31

భారత నాయకత్వానికి అమెరికా కమిషనర్ హితవు

03/11/2016 - 06:00

* అభ్యర్థిని ప్రకటించిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ
అనుకున్నట్టే జరిగింది. మైన్మార్ ప్రజాస్వామ్య ప్రదాత సూకీకి దేశాధ్యక్ష పదవి దక్కలేదు. సైనిక రాజ్యాంగం పుణ్యమా అని అధ్యక్ష పదవికి అధికార ఎన్‌ఎల్‌డి అభ్యర్థిగా సూకీ మాజీ డ్రైవర్, అపర విధేయుడు హిన్ క్వా నామినేట్ అయ్యారు. ఎవరు అధ్యక్ష పదవిలో ఉన్నా..పరోక్ష పవర్ తనదేనంటూ సూకీ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే..

03/10/2016 - 07:01

నేపీతా (మయన్మార్), మార్చి 9: మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకు రావడానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ జరిపిన దశాబ్దాల పోరాటం పూర్తిస్థాయిలో కాకపోయినప్పటికీ కొంతమేరకైనా గురువారం ఫలించనుంది. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ ఆమె దేశ నాయకురాలు కావడం లేదనేది ఇప్పటికే ఖాయమై పోయింది.

03/10/2016 - 06:57

డెట్రాయిట్: అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోటీలో తన సొంత పార్టీవారినుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటివరకు ప్రత్యర్థులకన్నా ముందంజలో ఉన్న రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ బుధవారం మరో మూడు ప్రైమరీలను దక్కించుకోవడం ద్వారా తన ఆధిక్యతను మరింతగా పెంచుకున్నారు.

03/08/2016 - 19:30

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు కోర్టు సమన్లు పంపింది. 2013లో ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో మార్చి 31న స్వయంగా కోర్టుకు హాజరై కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ముషారఫ్‌ కోర్టులో హాజరువుతారో లేదో ముందుగానే తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.

03/08/2016 - 07:07

పెషావర్: వాయవ్య పాకిస్తాన్‌లోని షాబ్‌ఖదర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆత్మాహుతి బాంబు పేలుళ్లలో 17 మంది మృతి చెందారు. కనీసం 30 మంది గాయపడ్డారు. పంజాబ్ రాష్ట్ర గవర్నర్ సల్మాన్ తసీర్ హంతకుడి ఉరిశిక్షను ప్రతికారంగా నిషేధిత తెహ్రిక్ ఎ తాలిబన్ పాకిస్తాన్(టిటిపి) ఈ ఘాతుకానికి పాల్పడింది. ఖైబర్- ఫఖ్తున్‌ఖ్వాలోవని ఛార్‌సద్దా జిల్లాలోని షాబ్‌ఖదర్‌లో కోర్టు ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Pages