S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/17/2019 - 22:27

ఎముకలు కొరికే చరికి నీ దేహాన్ని
అర్పించి మాకు వేడినందిస్తే

ఊరికే ఊడిగం ఏమీ చేయట్లేదని
ఎగతాలి చేసేస్తాం...

మా రెక్కల కష్టాన్ని చెమట చుక్కల్ని
నీ జీతాలుగా మారాయని ఏడుస్తాం

మా స్వేచ్ఛకోసం నీ ఉనికిని చంపేసుకుంటే
ఎవడు చేయమన్నాడంటూ నిలదీస్తాం

దేశమంటే నీకు ప్రాణం
మాకు మాత్రం పూచిక పుల్లనే

02/15/2019 - 19:45

ముడుచుకుపోయి మురిపెం
కోసం ఎదురుచూస్తున్న
నా హృది పుష్పాన్ని
వికసింపచేసి పరిమళించిన
పాణీగృహితి.

గమ్యం గతిని శృతి చేయని
పయనానికి అడుగులు
వేయించి పరితుష్టి
ప్రమిదలై ప్రకాశితములు
నింపిన నీరజాక్షి

నిస్తేజం నిండిన గుండెల్లో
ప్రేమ మొలకలను మొలిపించి
ఆనందాల హరివిల్లులు
పండించిన పరువాల నిధి

02/11/2019 - 20:19

‘‘యస్మాన్మ న్వంతరాదేతు రథమాపుః దివాకరః మాఘమాసస్య సప్తమ్యా తస్మాత్యా రథ సప్తమీ’’- మాఘ మాస సప్తమి రోజున సూర్యుడు రథాన్ని అధిరోహించి భూమి మీద తొలిసారిగా సాక్షాత్కరించాడని మాఘశుద్ధ సప్తమిని రథ సప్తమి అని సంభావించారు. ఆరోజే సూర్య జయంతి అని పురాణములు కూడా పేర్కొన్నాయి.

02/08/2019 - 18:43

(రేపు వసంత పంచమి సందర్భంగా...)

02/05/2019 - 19:51

మనిషి తాను కొన్ని బాధ్యతలకు గురై సంసార బంధాలకు సంబంధించిన విషయాలపై దృష్టిపెడుతూనే భగవతత్త్వముపై అంకితంగావించుకున్నవాడే బ్రహ్మనిష్ఠుడు కాగలడు. యోగియైనా, భోగియైనా, త్యాగియైనా, సంగవర్జితుడైనా, సంగసహితుడైనా, ఒక్కసారి బ్రహ్మచిత్తాన్ని తాను చవిచూసిన తర్వాత ఎలాంటి స్థితియందు తాను వున్నా కూడా తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు. బ్రహ్మ విరుద్ధమైన బంధ సహితుడుకాలేడు.

02/04/2019 - 19:48

చంద్రుడు ‘మఖ’ నక్షత్రంతో కూడిన మాసం మాఘమాసం. ఈమాసం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే పుణ్యప్రదమైన సమయం.

02/03/2019 - 22:39

‘‘నా దృష్టి పరస్ర్తి సుఖాదులందాసక్తము కాదు. అయిననూ నాకు ఎట్టి దుష్ట్భావన కలుగలేదు’’ అని-
‘‘మనోహి తేతుస్సర్వేషా మింద్రియాణాం ప్రవర్తనే
శుభాశుభా స్వవస్థా సుతచ్యమే సువ్యవస్థితమ్’’

02/01/2019 - 19:26

శ్రీ హనుమ శీలసంపదతో రూపుదిద్దుకున్న వజ్రకాయుడు. ‘ది ఎంబోడిమెంట్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ ఇండివిడ్యుయాలిటీ ఈజ్ ఆఫ్ హనుమ’(యాన్ ఐకాన్)- శీల సంపద అంటే వ్యక్తిత్వము, నిజాయితీతత్వం కలిగి వుండటమే. అన్యులతో పోల్చుటకు అలవికాని వ్యక్తిత్వమే ఆంజనేయతత్త్వం. ఎంత విద్యాధికులైనా శీలం కొరవడితే అనామకులౌతారు. శీలసంపద కలవారి ఆలోచనలు నిర్మలంగా వుండటమేగాక, విచాక్షణా జ్ఞాన సంపన్నులై వుంటారు.

01/31/2019 - 19:41

శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పేరిట భారతదేశమంతా సంచరించి ధర్మదేవతకు ఉపద్రవం కలిగిస్తున్న రాక్షసుల మదమణచి సనాతన ధర్మానుష్టానమునకు కలిగిన విఘ్నములను తొలగించి ప్రజలకు సంతోష ముదం కలిగించాడు. అందుకే నేటికి జనులు శ్రీరామ రాజ్యమును మాటను శ్రేష్టమైనదను అర్థంతో వాడతారు. అంతటి మహనీయుని చరిత్రను తెలిపేదే శ్రీమద్రామాయణం.

01/28/2019 - 20:05

అందరూ వారివారి ఇండ్లలో నిత్యం పూజలు చేస్తూనే వుంటారు. పండుగలు, వేడుకలు వున్న రోజుల్లో హోమాలు, యజ్ఞాలు, వ్రతాలు చేస్తుంటారు. దాని అర్థం పాపదోషాలు తొలగిపోయి కుటుంబమంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని ఆ దేవదేవుళ్లను కొలుస్తారు. శతకోటి మ్రొక్కలు మ్రొక్కుకుంటారు. ఆ మ్రొక్కులు కూడా వారు కోరిన కోర్కెలు తీరిపోగానే దేవాలయాలకు వెళ్లి తీర్చుకుంటారు.

Pages