S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/12/2018 - 18:43

నా గతం చుట్టూ
కొన్ని పావురాలు ఎగురుతుంటాయి
నవ్విన అడుగుల్లోంచి
ఎగసిన పాదముద్రలను ఏరుకుంటూ
వర్తమానంలోంచి
భవిష్యత్తును కలగంటాయి
రేఖామాత్రంగానైనా
ఊహల్లో చిరు కదలిక!
జాలి కెరటం
హృదయతీరం మీదగా ఎగిసిపడి
చూపులపై వౌన సంతకం చేస్తాయి
గురి తప్పినశబ్దం
అంతర్లీనంగా
వౌన సంభాషణ చేస్తుంటే
వేల సంఖ్యలో కలల ప్రతిబింబాలు

12/11/2018 - 21:39

- శరత్కాలం -
తే.గీ. వర్షధారలు కురిపించి బడలిపోయి
కంధమాలిక లెల్లను గగనమందు
విశ్రమంబొందు శరదృతు వేళలోన
సర్మము వినిర్మలంబుగా, జరుగుచుండ
రాజు, రాజత్కళాపూర్ణ తేజమంద
రెండవ దివంబుగా నొప్పె రేయి యంత
ఘనధునీతట విమలసైకతము లెల్ల
వెండిదిబ్బలవోలెను వెలయుచుండె॥

12/11/2018 - 21:35

నీ నా సందొడఁబాటుమాట వినుమా! నీ చేత జీతంబు నే
గానిం బట్టక సతతంబు మది వేడ్కంగొల్తు నంతస్సప
త్నా నీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే
జీ నొల్లన్ గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా!

12/11/2018 - 18:47

భారతీయ సంస్కృతి, హైందవ ఆరాధనా విధానాలు, సంస్కృత భాషా ప్రభావము- ఈ మూడున్నూ కొన్ని వేల యేండ్లనాడే విశ్వవ్యాప్తాలుగా ఉండేవని దాఖలాలు, తిరుగులేని సాక్ష్యాలు ఎప్పటికప్పుడు పరంపరగా కనిపిస్తూనే ఉన్నాయి- ప్రపంచ నాగరికతా స్రవంతిని పరిశీలిస్తూ పోతుంటే.
అదే పునరుజ్జీవం- మన సంస్కృతికి సంబంధించి- మళ్ళీ ఇటీవల ప్రపంచం నలుమూలలా- ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో తన ప్రభాపరంపరలను చూపిస్తోంది.

12/09/2018 - 22:44

అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా
కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడు గదా శ్రీకాళహస్తీశ్వరా!

12/07/2018 - 22:57

వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని
ర్వాణ శ్రీఁ చెరపట్టఁ చూచిన విచారద్రోహమో, నిత్య క
కళ్యాణ క్రీడలఁ బాసి, దుర్దశల పాలై, రాజలోకాధము
శ్రేణీ ద్వారము దూరఁ జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా!

12/06/2018 - 19:29

కార్తీక బహుళ అమావాస్యను భగవద్గీత పుట్టిన దినంగా పరిగణిస్తారు. మార్గశిర శుక్ల పక్ష ఏకాదశిని కూడా భగవద్గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవద్గీత ఒకశాస్త్రం. ఒక ఐతిహ్యం. జీవన్ముక్తికి మార్గదర్శి. ద్వాపరంలో సంప్రాప్తించి, ఆచంద్రార్కం మానవాళిని నడిపే జీవిత నావ. కార్తీక బహుళ అమావాస్యనాడు భారత యుద్ద ప్రారంభ దినంగా భావించ బడుతుంది.

12/03/2018 - 19:10

(నేడు ఘంటసాల జయంతి సందర్భంగా)

11/30/2018 - 18:49

నేడు షణ్ముఖి ఆంజనేయరాజు 90వ జయంతి సందర్భంగా..
----------------------------------------------------------------------------------

11/28/2018 - 19:42

మనిషిగా జన్మించడం సుకృతం; అయితే మనిషిగా జీవించగలిగడం మహా సుకృతం. ఈజన్మ అనేది పాత జన్మల సుకృతఫలం. కర్మలవలననే సుకృతాలయినా, పుణ్యాలయినా లభించేది. జన్మలనేది ఊహకు అందని విషయాలు, మనసుకు అంతగా నచ్చని విషయాలు.

Pages