S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/19/2018 - 18:23

ఆది అనాదిలో సైతం
మురిపె మెరుగని పిరమిడ్‌ని
లోహపు పాద ఘట్టనలో
ముక్కలగుతూ కూడ
ఒక్కటయ్యే పాదరస పాత్రని
ఉరుము మెరుపుల
కనుకాంతికి భీతిల్లే
పరుగు పందాల జింక పిల్లను
పుడమి తల్లి మాత్రం
పూవుకు రంగులు
పులిమిన మాట సత్యం
ప్రకృతి నిండు హృదయంతో
పరిమళాలు చల్లిందనడం నిస్సందేహం
ఎటొచ్చి.. పుణ్యకార్యాలకే కరువు

07/18/2018 - 18:26

సీ॥ అందరేమైన నిన్నడుగవచ్చెదరంచు
క్షీరసాగరమందుఁ జేరినావు,
నీ చుట్టు సేవకుల్ నిలువకుండుటకునై
భయదసర్పముమీఁదఁ బండినావు
భక్తబృందము వెంటఁబడి చరించెదరంచు
నెగిరిపోయెడి పక్షినెక్కినావు
దాసులు నీ ద్వారమాసింపకుంటకై
మంచి యోధుల కాపునుంచి నావు
తే॥ లావుగలవాఁడవైతి వేలాగు నేను
నిన్నుఁ జూతును? నా తండ్రి! నీరజాక్ష!
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!

07/17/2018 - 18:35

సీ॥ నాగేంద్రశయన! నీ నామమాధుర్యంబు
మూడు కన్నుల సాంబమూర్తి కెరుక
పంకజాతాక్ష! నీ బలపరాక్రమ మెల్ల
భారతీపతియైన బ్రహ్మకెరుక
మధుకైటభారి! నీ మాయసమర్థత
వసుధలో బలిచక్రవర్తి కెరుక
పరమాత్మ! నీదగు పక్షపాతిత్వంబు
దశశతాక్షులపురందరున కెరుక

07/17/2018 - 18:31

ఏమిటో.. జీవితం ఆలస్యంగా ప్రారంభమయి
తొందరగా ముగుస్తుంది
పగలు మెల్లగా నడుస్తుంది
రాత్రి పరుగులు తీస్తుంది
ఎందుకో.. చెట్టు ఆకాశమెత్తు ఎదిగింది
ఆకు కదలటం లేదు
కొమ్మ నవ్వటంలేదు
అసలు చల్లగాలి చిగురించటంలేదు
ఏమిటో.. పసిపిల్లవాడు పగలు పూట ఏడుస్తున్నాడు
ఒక అందం ఒక గదిలో
రాత్రిపూట ఆత్మహత్య చేసుకుంది
నిన్నటి వరకు నక్షత్రం ఇవ్వాళ

07/13/2018 - 18:26

మనం అల్లుకున్న జ్ఞాపకాల పందిరి
నీవు నేను కలబోసుకున్న అనుభవాల సందడి
నీవు నన్ను వీడినా ఈ
జ్ఞాపకాల సుందరి
నన్ను వీడదని నీవు నాడు అన్నదే నిజం చేస్తున్నావు ప్రియా
ఈ పందిరి కింద మనం పారేసుకున్న కాలం
కన్నీళ్ల పుష్పాలు, నిట్టూర్పుల నెగళ్లను
ఎన్ని దోసెళ్లను నింపిందో
ఈ పందిరి కింద నీవు నేను ఒక్కటైనపుడు
వెలుగు పూలు నలిగిపోతున్నా

07/12/2018 - 18:08

కుండపోతగా కురుస్తున్న వర్షంలో
తడుస్తున్న నేను, ఆలోచనలు రెండు వేరువేరు కావు
ఒకే వంతెనపై నడుస్తున్న రెండు చరిత్రలం

ఎక్కడో విస్ఫోటనం, నాలో కూడా
లోకపు వెలుగుని చూడలేని కళ్లకు
ముసుగేసి పడకేసిన సంస్కారపు వాసనలు
తెలియటం లేదు.. ఎందులకో...

చీకటిని దాటలేక అవస్థలు పడుతున్న భావమేదో
ఓ మూలగా బుడ్డి దీపం కింద అక్షరాన్ని వెలిగిస్తుంది

07/03/2018 - 21:03

నిజంగా అదీ.. అరచేతిలోని అద్భుతం
భూమినీ.. భువనాంతరాల్ని
బొంగరంలా తిప్పుతున్న గొప్ప చోదకం
కళల ప్రపంచాన్ని
కళ్ల ముందు గిరికీలు కొట్టిస్తూ
స్క్రీన్ టచ్ చేశాక
కితకితల వెల్లువై ప్రవహిస్తుంది

07/02/2018 - 20:55

పంకంలో నిలిచిన పద్మంలా
కాలుష్య సమాజంలో ఒక నిర్మలుడు
వాడికి నింగి లక్ష్యం
దశదిశల నుండి వీచే
స్వేచ్ఛావాయువులతో
ప్రాణం నిలుపుకొంటాడు వాడు
వాణ్ణి కలుషితం చేయాలని
పదేపదే యత్నించేవారెందరో!
ఎవరికీ చిక్కని పాదరసం వాడు
తామరాకు మీద నీటిబొట్టువాడు
హిమశిఖరాలపై నుండి దూకిపడే
గంగానది లాంటిది వాడి గమనం!

07/02/2018 - 20:58

సగటు మనిషి జీవితం
ఆశకు నిరాశలకు మధ్య సాగే ఊగిస లాంటి పయనం
నిరాశల తిమిరాలపై సమరాన్ని సలుపుతూ
ఆశల తీరాలని చేరలేక
ఎడారిలోని ఎండమావుల్లా.. అక్కడక్కడా కనిపించే
ఆశల పల్లకీలో విహరిస్తూ
మనుగడ సాగిస్తుంటే...
సగటు మనిషిని నైరాశ్యంలోకి నెట్టేస్తాయి ఎదురయ్యే ఓటమిలు!
సగటు మనిషికి జీవితమంటే.. నాడు జీవించడం..
నేడు జీవన్మరణాల పోరాటం

06/29/2018 - 21:39

ఆ గ్రహంలో
తానొక్కడే ఉంటాడు
పక్కనే పొంచి ఉన్న ఉమ్మ సాగరం
వాడిని తన కళ్లలోకి
జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది...

ఒక పెద్ద తీగ
మరో ప్రపంచపు ఉదయాన్ని, రాత్రిని
ఊపిరిలో బంధించి
మెల్లగా వాడి గుండె గదుల్లోకి
జారవిడవగానే
అమ్మ చేతి తొలి శ్వాస ముద్దను
రుచి చూశాడు...

Pages