S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/23/2019 - 22:31

శా॥ ‘‘అస్సే! చూస్సివషే! సే! చెవుడషే! అష్లాగషే! ఏమిషే!
విస్సావజల వారి బఱ్ఱినష ఆవిస్సాయ కిస్సారుషే!
విస్సండెంతటివాడె! యేండ్లు పదిషే! వెయ్యేండ్ల కీడే సుమా!
ఒస్సే బుఱ్ఱికి ఈడషే! వయసుకేముంషుందిలే! ఎంత వ
ర్చెస్సే!’ అందురు శ్రోత్రియోత్తమ పద స్ర్తిలాంధ్ర దేశంబునన్‌॥

10/14/2019 - 22:15

వస్తువు కావ్యస్రష్ట చైతన్యాన్ని సూచిస్తుంది. దాని అభివ్యక్తికోసం వస్తు రహస్యాన్ని దొరకపుచ్చుకోవటంలో కవిత్వం ప్రతిఫలిస్తుంది. అంతేకాని కవి తాను ఎంచుకున్న రూపంలోనే కవిత్వం ద్యోతకముతుందనుకోవటం కేవలం అజ్ఞానం. రూపం బాహ్యం మాత్రమే. అంతర్గతమైన అగరు కనిపించదు. ఆ కనిపించకపోవటం కవిత్వమవదు. ఏదైతే కనిపిస్తుందో (రూపం) అది కావ్యకళ అనిపించుకోదు.

10/07/2019 - 00:58

నాలుగు దశాబ్దాలనాటి- 1920నాటి- మాట. బాపట్లలో ప్లీడరు గుమాస్తాల నాటక సంఘం ఉండేది. దానిలో శ్రీ కామరాజు వేంకట నారాయణగారు కూడా సభ్యులు. ఆయన మేనల్లుండ్లలో ఒకరు కళాభిరుచి కలవాడు; పందొమ్మిదేండ్ల ప్రాయంవాడు. ఆతడు మేనమామతోపాటు ఆ నాటక సంఘానికి వెళ్ళి, నటుల తరిఫీదులలో హార్మోనియం శ్రుతి వేసేవాడు.

10/01/2019 - 22:10

సామాజిక స్పృహ’’ ఎఱ్ఱ చొక్కా సోదరుల నోటి చొంగ. ఈ ‘‘ఎత్తుబడి చేత’’ వారి జన్మ హక్కు పత్రము. కనుక దానిని గురించి పాఠమును వారే వల్లెవేయవలెను. ఇతరులనరాదు. ఒకవేళ వేరువారట్లన్నచో వారు అభ్యుదయ నిరోధకులు. ఈ ‘‘అభ్యుదయ నిరోధక’’మన్న మాటయే చిత్రము. ‘‘అఱ చేతిని అడ్డంపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు’’ అనే నినాదాన్ని వీధి గోడలకతికించిన మేధావులే ‘‘అభ్యుదయ నిరోధక’’మన్న మాటను విస్తృతపరచినారు.

09/23/2019 - 22:44

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రెండు చెక్కలుగా ఉన్న తెలుగునాడు ఏకీకరణకు ఉద్యమం ఉధృతంగా సాగుతున్నది. రామాయణంలో పిడకల వేట లాగ కేంద్ర ప్రభుత్వం దృష్టి ఉస్మానియా విశ్వవిద్యాలయంపై పడింది. ఆ విద్యాలయంలో బోధన భాష ఉరుదూ కావడం, అక్కడి పారిభాషిక పద రచనాశాఖ అద్వితీయంగా ఉండటం ఢిల్లీవారి నోట నీరూరేట్టు చేశాయి.

09/16/2019 - 23:03

కృష్ణా - గోదావరుల సారస్వతవేది అద్దేపల్లి. సముద్రమంటే నదుల పవిత్ర సంగమం. అందుకే ఎక్కడో బందరు తీరంలో జన్మించి కడలితీరం కాకినాడలో తన ఉద్యోగ సాహిత్య ప్రస్థానం సాగించడంతో బాటు, ఆయన అంకితభావం, ప్రాకృతిక ఆరాధనత్వం ఎన్నో కవిత్వోద్యమాలకు ఆలంబనలై నిల్చాయి. కవిత్వంలోని స్ఫూర్తి - దీప్తి ఆత్మద్రవ్యంగా ఆవిష్కరింప చేసుకున్నారు.

09/09/2019 - 22:28

(10-09-2019న కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 125వ జయంతి సందర్భంగా...)
*
‘‘నన్ను నెరుగరో రుూ తెల్గునాట మీరు
విశ్వనాథ కులాంబోధినిధుని బహు వి
చిత్ర చిత్ర ధ్వని బహు విచ్ఛిత్తి మన్మ
హాకృతి ప్రాణేత సత్యనారాయణ కవి’’

09/02/2019 - 01:41

ఇప్పటికయితము ఓకర పోకడ కోరగట్టు. ఔననుటకు నెఱవడి యొప్పిదము కాకపోయిననూ కాదనుటకు వీలు కుదరని యాసికమైనది. కారణముకైత కోర్కుల పుంజినెత్తిన గుత్తగంప. కోర్కులు మై చుట్టిన దూలగొండి దురదకంప. మొత్తముమీద ఇది దేహము నాక్రమించుకున్న స్థితిగతుల సంగడి. కవిత్వము మనస్సంబంధి గదా, ఇచట దేహమెట్లు పొసగును? మంచి ప్రశ్నయే. దేహము ధరించిన మనసు దేహమైనపుడు కవిత్వమే మగును? గతి తార్కికముగదా! బొంది గాదిలి యగును.

08/26/2019 - 22:39

ఆధునికాంధ్ర సాహిత్య లోకంలో క్రొత్తపాతల మేలుకలయికతో క్రొమ్మెఱుంగులను చిమ్మిన రచయితలలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారు ఒకరు. కథా-కవితా-విమర్శల ముక్కంటి శ్రీ హనుమదింద్రగంటి. సుమారుగా 1980 ప్రాంతాలలో శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి కోరికమేరకు ఆంధ్రజ్యోతి వారపత్రికకోసం శాస్ర్తీగారు ఈ ‘‘గౌతమీగాథల’’ను వెలువరించారు. సత్యం శంకరమంచిగారి ‘‘అమరావతి కథల’’ ప్రేరణతో ఇది రచింపబడింది.

08/19/2019 - 22:20

స్వరం ఖల్విదం బ్రహ్మ (మనకు కనిపించేదీ, కనిపించనిదీ, కదిలేదీ, కదిలించేది, కదలనిదీ -యావత్తూ-పరబ్రహ్మ స్వరూపమే)’’ అంటుంది ఛాందోగ్యోపనిషత్తు మూడవ అధ్యాయం 14వ ఖండంలోని ఒక ‘మహావాక్యం’. అంతటి విరాట్‌స్వరూపానికి బొమ్మ-బొరుసుల్లాగా సగుణాత్మక సారూప్యమూర్తులు శివకేశవులు. ఆ రెండు రూపాల వౌలిక తత్త్వానికి భేదం లేదు. ఇదే చెప్తుంది -
‘‘శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే!

Pages