S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/16/2018 - 04:10

ఇటీవల తెలుగునాట ఒక గొప్ప పెద్ద నగరంలో పుస్తక ప్రదర్శనోత్సవాన్ని సందర్శించాను. చాలా విస్మయం, విడ్డూరం అనిపించిన విషయమేమంటే ఈ పుస్తక ప్రదర్శనా ఆవరణ ప్రాంగణంలో వివిధ పుస్తక విక్రయ అంగళ్ళలో పూర్తిగా ఒక అంగడి మొత్తానికి మొత్తం ఒకనాటి ఘనత వహించిన రచయిత గుడిపాటి వెంకట చలానికి కేటాయించి ఉంది. అంటే ఆ అంగడిలో ఇతర పుస్తకాలేవీ దొరకవన్నమాట. చలం పుస్తకాలే గంపగుత్తగా ప్రదర్శితమై ఉన్నాయి.

07/08/2018 - 23:33

శ్రీశ్రీ సాహిత్య నిధి పేరుతో శ్రీశ్రీ సమస్త అక్షరాక్షర సృజన ప్రతిభను ఒకమారు చిన్నాపెద్ద, మరన్నీ చిరుచిరుపొత్తాలుగా తేవడానికి విజయవాడలో ఒక శ్రీశ్రీ సాహిత్య చైతన్యకారక సంస్థ పూనుకుంది. విజయవాడలో శ్రీశ్రీ ప్రింటర్స్ అనే ముద్రణాలయం కూడా ఉంది. మంచి అక్షర వ్యాపారమున్నూ చేస్తున్నది. వాళ్ళ ఇష్టం, వాళ్ళ కష్టం, వాళ్ళ మనోభీష్టం మనకెందుకు? ఎవరి కృషి వారిది? కృషి ఉంటే ఋషి కావచ్చని సినిమా పాట కూడా ఉంది కదా?

06/25/2018 - 05:24

కొంతమంది పుట్టుకతోనే గొప్పవారవుతారు. మరికొందరు నిరంతర కృషిచేసి మహానుభావులవుతారు. ఇంకొంతమంది అనుకోని పరిస్థితుల్లో అదృష్టం కలిసివచ్చి గొప్పవారవుతారు. ఇందులో రెండో కోవకు చెందిన మహానుభావుడు విలియం షేక్స్‌పియర్. ఆంగ్ల నాటక, కవితా ప్రక్రియల్లో అతనికి అతనే సాటి. ఆంగ్లంలో రచనలు చేసినప్పటికీ అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి.

06/18/2018 - 00:20

నానృషిః కురుతే కావ్యమ్ అన్నారు ప్రాచీనులు. ఋషి అంటే క్రాంతదర్శి. సత్వగుణ స్వభావుడు. విశ్వమానవ కల్యాణాన్ని కోరేవాడు. విశ్వశ్రే్శయః కావ్యమ్ అన్నారు. ఇదీ ప్రాచీనుల సామాజిక దృక్పథం. కావ్య ప్రయోజనం నిశ్రేయస్సు.

06/10/2018 - 22:04

చలంగారి మహాప్రస్థానం ముందుమాటల్లో ఒక ప్రఖ్యాత వాక్యం కొంత సవరిస్తే, ఈ వ్యాసం శీర్షిక అవుతుంది. జూన్ 15న శ్రీశ్రీగారి 35వ వర్ధంతి.

06/03/2018 - 22:54

సర్వసాధారణ కష్టజీవుల జ్ఞానానికి అతీతమైన వ్యవహారంగా మేధావి వర్గాలు నిర్వహించే దోపిడి జరుగుతుంది. పాలకవర్గ రాజకీయాలు, వారికి అనుయాయులుగా మసలుతున్న మంది మాగాదులు, వ్యాపార వర్గాలు దోపిడీని దొరతనంగా భావిస్తూ అందినకాడికి ప్రజాధనాన్ని మింగిపారేస్తున్నారు. కోటాన కోట్లును నల్లధనంగా మార్చిపారేస్తున్నారు. మనిషిని ఆర్థిక అవతారంగా మార్చిపారేస్తు మానవీయతకు మరణ శాసనం రాసేస్తున్నారు.

05/28/2018 - 01:08

అంతర్జాతీయ స్థాయిలో కవిత్వం చెప్పిన కొద్దిమంది తెలుగు కవులలో గుంటూరు శేషేంద్రశర్మ ఒకరు. అన్నమయ్య, వేమన, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీల తరువాత అంతర్జాతీయ స్థాయి కవిత్వపు మరో పార్శ్వం శేషేంద్ర. ప్రాంతీయత, వర్గం, కులం, మతం, అశ్లీలతలకు అతీతమైన నిర్మలమైన కవిత్వం చెప్పారాయన.

05/21/2018 - 03:55

సహితస్య భావం సాహిత్యం - అని భారతీయులు నమ్మారు. కాని సాహిత్యం ద్వారా అరాజకత్వాన్ని వ్యాపింపచేయాలని మార్క్సిస్టులు విశ్వసించారు. మతానికి వౌలిక లక్షణాలుంటాయి. ఒకే దేవుడు - ఒకే మత గ్రంథం- ఒకే మోక్షమార్గం. ఇస్లాంలో అల్లా ఒక్కడే దేవుడు- మహమ్మద్ ఒక్కడే ప్రవక్త- ఖురాన్ ఒక్కటే మత గ్రంథం- దీనిని కాదనేవారు కాఫిర్లు. అంటే అవిశ్వాసులు. అట్టివారిని జీహాదీ పేరుతో వధించాలి- ఖలీఫా మత రాజ్యం స్థాపించాలి.

05/14/2018 - 00:27

ఎర్రన్నల కబంధహస్తాల్లో సాహిత్య అకాడమీ (30-4-18) వ్యాసం చూడగానే నవ్వొచ్చింది. ఎవరో పాపం అవగాహన లేక రాశారని అనుకున్నా. మళ్లీ అదే వ్యక్తి తెలుగునాట సిద్ధాంత రాజకీయం (7.5.18) అనే వ్యాసం రాశాడు. వ్యాసం చూడగానే ఆలోచించాల్సిన విషయంగా తోచింది. ఇది అజ్ఞానంతో రాస్తున్న వ్యాసాలు కావు. అక్కసుతో రాస్తున్న వ్యాసాలు అన్పించింది. కాలం చెల్లి, అరిగిపోయిన ముసలి భావాలే కన్పించాయ.

05/07/2018 - 00:21

విత్వం ఆల్కెమో.. ఆల్కహాలో రసజ్ఞత ఉన్నవారికే తెలుస్తుంది. కానీ కవులు నడయాడే కేంద్ర సాహిత్య అకాడమీ మాత్రం రాజకీయాలకు అడ్డాగా మారింది. మేడిపండులా పైకి పరమ సాధువుల్లా కన్పించే కవి పుంగవులు, సాహిత్య శేఖరులు ఇంచుమించు రాజకీయ నాయకులంతా ఎత్తు ఎదిగారు. రాజకీయ పార్టీలు తమ అధికారాన్ని అక్షరాలా కాపాడుకొన్నట్లు ఇందులో గద్దెనెక్కినవాళ్లు ‘స్వార్థపరాయణత్వం’ ఆమూలాగ్రం కొనసాగిస్తున్నారు.

Pages