S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/06/2019 - 23:36

ఇరవయ్యో శతాబ్ది తెలుగు సాహిత్యంలో, సామాజిక చైతన్య పరిణామాలలో బోయి భీమన్నగారిది ఒక విలక్షణ, విశిష్ట, మానవతా ప్రపూర్ణ వ్యక్తిత్వం. ఇరవైయ్యో శతాబ్ది నుంచి తెలుగు సంస్కృతి, సమాజ జీవితాలను ప్రభావితం చేసిన 20 మంది పేర్లు తలచుకున్నపుడు భీమన్నగారి పేరు ఆ పట్టికలో అనివార్యంగా చోటుచేసుకుంటుంది.

12/31/2018 - 01:56

ఒక ప్రఖ్యాత కవిత్రయం ఉండగా.. వారి రచనగా మహాభారతం, దక్షిణ భారతదేశంలోనే తొలి సంపూర్ణ భారత అనుసృజనగా వెలువడిన చరిత్ర ఉండగా... ఈ ఉత్తరాంధ్ర కవిత్రయం ఎవరు? అన్న ప్రశ్న వస్తుంది. వీరు కూడా ఆ కాలంలో ఒకరినొకరు ఎరుగరు. కానీ వేర్వేరు రాజుల కొలువులో ఒకే రాజాస్థానంలో పనిచేశారు. ఆ రాజ్యం విజయనగర సంస్థానం. ఆ రాజులు పెద విజయ రామరాజు, చిన విజయరామరాజు, ఆనంద గజపతి మహారాజు.

12/24/2018 - 23:35

నవలలే అయినప్పటికీ ఘోష్ రచనలు అన్ని సంస్కృతులలోనూ, జాతులలోను వ్యాపించి ఉన్న చారిత్రక అనిశ్చితికి, మానవ ఆందోళనలకు మధ్య ఉన్న సంబంధాన్ని, ఒకదానితో ఒకటి విడదీయలేని గట్టి పోలికలను చెప్పడంలో గొప్ప ఘనతను సాధించాయి. ఒక చారిత్రక అధ్యయన కారుడిగా, పరిశోధకుడిగా, సామాజిక ఆంత్రో పాలజిస్టుగా ఘోష్‌కున్న నేపధ్యం లోతులకు వెళ్ళి పరిశోధించడానికి ఉపయోగపడింది.

12/17/2018 - 03:23

ఆంధ్ర సాహితీ చరిత్రలో ఒక అపూర్వమైన సన్నివేశం శ్రీనాథుని కనకాభిషేక సత్కారం. ఇటువంటి గొప్ప సత్యారాన్ని పొందిన తొలి తెలుగు కవి శ్రీనాధుడే. కనకాభిషేక సత్కార క్రమాన్ని గూర్చి రాజ్యలక్ష్మీ పీఠికాతంత్రంలో ఇలా ఉందని శ్రీ వేటూరి ప్రభాకరశాస్ర్తీగారు చెప్పారు.

12/10/2018 - 03:55

వ్యాసం - ఈ ఏడాది తెలుగులో సాహిత్య అకాడెమీ మన్నన పొందిన ప్రక్రియ. విమర్శ ఒక రచన పైన కానీ, ఒక ధోరణి పైన కానీ, ఒక కాలం పైన కానీ ఒక ఉద్యమం విషయమై కానీ ఒక రచయిత సంపూర్ణ కృషి గురించి విరివిగా విశాలంగా, సాకల్యంగా రాయబడ్డప్పుడు, అది వ్యాస రూపంలోనే ఉంటుంది. విమర్శకు కాదు, వ్యాసాలకు వచ్చింది ఈ అవార్డ్ అని కొందరు అంటున్న పరిస్థితి ఉన్నది.

12/03/2018 - 05:50

జాలి వెనె్నల కురిపించు చందమామ
మాట కరుకైన నేమిలే మనసువెన్న
గుండె లోతెరింగిన యట్టి గొప్పవాడు
అమృతము కూడుకట్టిన యయ్యాగాదె’’

11/26/2018 - 02:30

కాలం మారుతుంది. శాస్ర్తియ విజ్ఞానం వికసిస్తూంది. మనిషిని ఊపిరి పీల్చుకోనీయనంతగా నవనాగరికత అనేకానేక రూపాల్లో వెంటాడుతుంది. సామాజిక విలువలు ఆర్థిక రాబడి మీద వస్తు వినియోగంమీద కేంద్రీకృతమై ప్రపంచమంతా ఏకీకృత భావనతో సాగిపోతున్నాయి. శ్రమదోపిడీకి గురవుతూనే వుంది. దోపిడీ విధానాలు సరికొత్త కోణాల్లో తమ రూపాల్ని మార్చుకుంటున్నాయి.

11/19/2018 - 06:53

సృజనకారులంతా కాపీరాయుళ్ళంటే ఉలిక్కిపడతారు. అదే అనుకరణ శిల్పులంటే మురిసిపోతారు. ఇంతకూ అనుకరణకూ కాపీ కొట్టడానికి ఏమైనా తేడా ఉందా? అంటే మక్కికిమక్కి అనుకరిస్తే దాన్ని కాపీ కొట్టడమనీ.. అక్కడింత ఇక్కడింత కాపీకొట్టి తమ సొంత సృజనాత్మకతను కొంత అందులో చేర్చి రచనాశిల్పాన్ని మెరిపిస్తే దానిని అనుకరణ రమణీయతని మురిసిపోతారు. కళలన్నీ అనుకరణ నమూనాలే.. అందులో సృజనకళ చాలా తెలివైన మేధోపరమైన అనుకరణ విద్య.

11/12/2018 - 00:11

ఆదిరాజు వీరభద్రరావు, సురవరం ప్రతాపరెడ్డి, గడియారం రామకృష్ణశర్మ, బిరుదురాజు రామరాజు, బి.యన్. శాస్ర్తి లాంటి పరిశోధక దిగ్గజాల సరసన చెప్పుకోదగిన పేరు డా. కపిలవాయి లింగమూర్తి. ఇక్కడ పేర్కొన్న దిగ్గజాల్లో కొందరిలో ఎక్కువభాగం చారిత్రక దృష్టి, మరికొందరిలో ఎక్కువ భాగం గ్రంథ పరిష్కరణ దృష్టి ఉంటూ ముఖ్యంగా కావ్యరచన, ప్రాంతీయకవిపండిత వంశచరిత్ర నిర్మాణం లాంటి తక్కిన రంగాలు ఆనుషంగికమయ్యాయి.

11/05/2018 - 06:44

===========================================
బ్రౌన్ సంస్కృత భాషలో మంచి దిట్ట. శంకరాచార్యుల సౌందర్య లహరికి, లితోపాఖ్యానానికి వ్యాఖ్యానాలు రాశారు. జ్యోతిషం, శిల్పశాస్త్రం, గణితం తదితర అంశాలపై 106 వ్యాసాలు రాసి ప్రచురించారు. చెన్నై ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ గ్రంథాలయంలో బ్రౌన్ సేకరించిన వివిధ సంపుటాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. లండన్‌లోని భారత్
కార్యాలయాల గ్రంథాలయాల్లో

Pages