S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

12/16/2018 - 22:34

కల్యాణినా? ఇందిరనా?
సాహిత్యాన్ని"aesthatic exploration world' అనుకుంటే Exploration of Forces అని కూడ అనుకుంటే "Transforming a mild society into an active and emotional one' అనీ. అట్లాగే "giving courage to the weat' అని కూఢా చెప్పుకుంటే- ఆ లక్షణాలన్నీ ఉన్న గొప్ప నవల కాలాతీత వ్యక్తులు.

12/14/2018 - 18:41

నిజానికి ప్రకాశం భీరువు! చాలామంది యువకుల్లాగే అవకాశవాది! సుఖవాది! పోరాటం, ప్రతిఘటన అంటే భయపడే వెనె్నముకలేని జీవుల జాతిలోని వాడు! కల్యాణికి షరామామూలుగానే కష్టాలు త్రోసుకువచ్చాయి. తండ్రి పోయాడు! ఊరంతా అప్పులు! ఒంటరితనం! ఓదార్పు కోరే కష్టాలు!

12/13/2018 - 19:29

ఒక కల్యాణి ఒక ఇందిర-
సంక్లిష్టమవుతున్న కాలం, విలువల పతనం, దారిద్య్రం, జీవితం అంతట్నీ ఒక్కలా చుట్టుముట్టుతున్న నైరాశ్యం- పోగొట్టుకోవటం, దుఃఖం, భీతి, మరణం. ఒడ్డు తెలియని ప్రవాహం- ఏ హెచ్చరికలూ లేకుండా ఒక్కసారిగా ప్రవాహంలోకి తోసివెయ్యబడటం-
ఎట్లా రియాక్టు అవుతారు?
ఒక కల్యాణి లాగానా? ఒక ఇందిర లాగానా?

12/12/2018 - 18:42

గవరయ్య బాకీ అడిగి తెమ్మన్నాడని పోతరాజు సుబ్బయ్య దగ్గరకు వచ్చి చెబుతాడు. సుబ్బయ్య తాను ఇవ్వను అని చెప్పడం అసంభవమని భావిస్తాడు. అసంభవమని భావించినదానిని సంభవం చేశాడు. హామ్లెట్ అనుకోకుండా, యాదృచ్ఛికంగా పినతండ్రిని చంపినట్లు సుబ్బయ్యకు అనుమానం ‘‘అలా చెప్పింది తనేనా’’ అని. నేనే, నా నోటితోనే చెప్పాను’’ అనుకొంటాడు. ఇవన్నీ అతని ఆత్మన్యూనతను ప్రదర్శించే సంఘటనలే.

12/11/2018 - 21:37

1950లకు ముందే ఫ్రాయిడ్, ఆడ్లర్, యూంగ్‌ల సిద్ధాంతాలు ప్రపంచమంతటా విపులంగా ప్రచలితం కావడంతో అవి తెలుగు గడ్డను కూడా సోకాయి. తెలుగు నవలకారులనూ ఆకర్షించాయి. 1953లో వచ్చిన అల్పజీవి ఆ సిద్ధాంతాలను ప్రతిబింబించడంలో ఆశ్చర్యం ఏమే లేదు.

12/11/2018 - 18:48

న్యూనత నుంచి ఆధిక్యతకు చేసే పయనాన్ని నష్టపూరణం అంటాడు ఆడ్లర్. ఈ ఆధిక్యతకు ఈ పయనంలో ప్రతి వ్యక్తి తనదైన విధానాన్ని శైలిని అనుసరిస్తాడు. దీనినే ఆడ్లర్ జీవనశైలి అన్నాడు. సమస్యల పరిష్కారానికి వ్యక్తి అనుసరించే పరిష్కార విధానమే జీవనశైలి.
సుబ్బయ్య తన సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడంలో అవలంబించే శైలిని చూస్తే సుబ్బయ్య మనస్తత్వం అర్థమవుతుంది.

12/09/2018 - 22:47

ఒకసారి ‘‘తెలుగులో కలకాలం నిలిచే నవలలు ఏవి?’’ అనే మీమాంస తలెత్తింది. దానికి సమాధానంగా ఆచంట జానకీరామ్ ఉన్నవ వారి మాలపల్లి, విశ్వనాధ ఏకవీర, గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, బుచ్చిబాబు చివరకు మిగిలేది, జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు, రావిశాస్ర్తీ అల్పజీవి అని తేల్చారు. నిజంగా ఇవన్నీ తెలుగులో కలకాలం నిలిచే నవలలే.

12/07/2018 - 23:00

దమ్మిడీలేని ఆదర్శవాది సదానందం కూడా పోటీ చేస్తాడు. వరదరాజులకి తెలియకుండా అతని మనుషులు సదానందం బుర్ర పగలకొడతారు.

12/06/2018 - 19:31

కరుణమూర్తి డబ్బులెగ్గొడతాడు. మృత్యుంజయ శాస్ర్తీ రంగయ్యకి తెలుగే రాదని ఉద్యోగం వూడపీకిస్తాడు. అన్ని కష్టాలలోనూ తాను చేస్తున్న భాగవత రచన పూర్తిచేయాలి. కళ్ళు కనిపించవు. అయినా కూతురికి చెప్పి రాయిస్తూ వుంటాడు.

12/05/2018 - 19:45

పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార ఏడవకండేడవకండీ అంటూ పీడితులను, తాడితులను, వంచితులను ఓదార్చే ప్రయత్నంలో మహాకవి స్వప్నించిన జగన్నాథ రథ చక్రాలు కదలనేలేదు. ఐదు దవాబ్దలు గడచి కొత్త శతాబ్దిలోకి అడుగిడినా ఇప్పటికీ కదలనేలేదు. పెదవులపై నిరంతరం శ్రీశ్రీ గేయాలను పలవరిస్తుండే శారద ఎలాంటి రచనలు చేస్తాడని ఊహిస్తామో అలాంటివాటినే అక్షరబద్ధం చేశాడు కీ.శే.శారద.

Pages