S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

12/26/2018 - 20:12

ఈ చర్యతో ముంగండలోని అగ్రవర్ణాలవారి ఆగ్రహానికి గురి అయ్యాడు. దాంతో వారు అతన్ని బహిష్కరించారు. రామనాధం ఆ బహిష్కరణకు చలించలేదు. ఊరిబయట తన తోటలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ విధంగా చాలా సందర్భాలలో రచయిత రెండు భిన్న భావజాలాల సంఘర్షణను దృశ్యీకరించాడు. తాను రామనాధం పక్షాన నిల్చాడు.

12/25/2018 - 19:40

అయినా వినకుండా కూతురును చదివించాడు. అందుకు కోపంతో తెగతెంపులు చేసుకొని స్వరాజ్యం భర్త వేరే పెళ్లి చేసుకున్నాడు. కూతురును కాపురానికి పంపటానికి ఇష్టపడినా, చదువుకున్న ఆడపిల్ల వొద్దని వాళ్లు తలుపులు మూసేశారు. చేసేదేమీ లేక ఇరవై ఏళ్ల స్వరాజ్యం కాలేజీలో చదువుకుంటోంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రామనాధం అబ్బాయి నాయుడు ఆధునిక దృక్పథానికీ, స్వరాజ్యం తెగువకూ ఆకర్షితుడయ్యాడు.

12/24/2018 - 18:23

కొల్లాయి గట్టితేనేమి? నవలలోని కథా వస్తువు 1920లో ప్రారంభవౌతుంది. ఈ నవలలోని ప్రధాన పాత్ర రామనాథం. రామనాథం వెంటా, రామనాథం చుట్టూ ఈ నవల నడుస్తుంది. అంటే ఒక వ్యక్తి జీవిత కేంద్రంగా సామాజిక జీవితాన్ని ఆవిష్కరించిన నవల ఇది. గాంధీజీ పిలుపు మేరకు, తాను చదువుతున్న చదువుకు స్వస్తి చెప్పి, కళాశాలను బహిష్కరించి జాతీయోద్యమంలో భాగస్వామి కావటానికి రామనాథం ప్రయాణం కావటంతో ఈ నవల మొదలౌతుంది.

12/23/2018 - 23:02

‘చెప్పు, ఏం చేయమంటావు?
నన్ను రమణా!’
(వ్యాస సంకలనం)
రచయిత: ఒక భక్తుడు
సేకరణ: దోనేపూడి అవధాని,
దోనేపూడి రేణుకగారలు;
వెల: 30 రూ.; పుటలు: 42;
ప్రచురణ: రమణభక్త మండలి ట్రస్టు,
ప్రతులకు: డా.దోనేపూడి నరేష్‌బాబు,
శ్రీ షిర్డీసాయిబాబా దేవాలయం,
జూలేపల్లి- 518674,
గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా
*

12/23/2018 - 22:57

మహీధర రామమోహనరావు గారి కొల్లాయి గట్టితేనేమి? నవల చదవటం ఒక గొప్ప అనుభవం!నిర్దిష్ట స్థల, కాలాలను, వాస్తవికతా దృక్పథంతో, ప్రగతిశీల భావజాలంతో చిత్రించే ఏ మంచి రచన అయినా పాఠకుడికి ఒక గొప్ప అనుభవాన్ని ప్రసాదిస్తుంది. కొల్లాయి గట్టితేనేమి? నవల పాఠకుడి చారిత్రక, సామాజిక, సాంస్కృతిక అనుభవాలను విస్తృతం చేస్తుంది కూడా!

12/21/2018 - 20:05

దాంతో సజావైన మార్గానికన్నా డొంక తిరుగుడు దోవకే విలువ ఎక్కువవుతోంది. నాడూ, నేడూ, సినిమా పద్మవ్యూహంలో ప్రవేశించాక, అక్కడ ఇమడలేక, బయటపడలేక, నశించినవారి సంఖ్య పెద్దదే.

12/20/2018 - 19:40

కొన్ని సందర్భాల్లో ఆమెలోనైన అంతర్మథనం మనని కలచివేస్తుంది. అంతరాత్మ పెట్టే ఘోషను పలుమార్లు పెడచెవిన పెట్టిన సహనశీలి మంజరి.

12/19/2018 - 19:19

అదీ విచిత్రం! ఐతే శిఖరాగ్రం చేరుకున్నాక, అధిరోహించేందుకు మరేమీ లేనప్పుడు జరిగే పరిణామమేమిటి? నింగికి దూసుకుపోయిన తోకచుక్క నేలకు రాలక తప్పదుగదా!
మంజరి జీవిత చరమాంకం ఆ దశనే గుర్తుచేస్తుంది.
ఆ క్రమానుగత పరిణామాన్ని, వెండితెర వెనుక భాగోతాలను, కుట్రలు, కుతంత్రాలను, విశ్వసనీయతతో, నిశిత దృష్టితో, మనకళ్లముందుంచేందుకు భరద్వాజ గారు చిత్తశుద్ధితో చేసిన సద్యత్నమే పాకుడురాళ్లు.

12/18/2018 - 19:48

సినిమా రంగం అంటే సిరులు పండే స్వర్ణలోకం అనుకుంటారు అమాయక చక్రవర్తులు. నిజమేనా? ఏమో, కావచ్చు, కాకపోవచ్చు. సినీ మాయలోకం మాత్రం అవునంటారు లోకవృత్తం ఎరిగినవారు.
తెరమీద కదిలే, మాట్లాడే బొమ్మలు వాస్తవాలు కావు. తళుకు బెళుకులు సంతరించుకున్న మానవ ప్రతిరూపాలు. వెలుగునంటి పెట్టుకుని వుండే నీడలు.

12/17/2018 - 18:24

ఆదర్శాలు, విలువలులేని తిను, తాగు, సుఖించు! మార్కు సుఖవాదులు- ఈ కాసిన్ని పాత్రలలో అద్భుతమైన హ్యూమన్ డ్రామా నడుస్తుంది నవలలో. మరో ఇన్‌గ్రిడెంట్- క్యారెక్టరైజేషన్ లేదా ఇవాల్యుషన్ ఆఫ్ క్యారెక్టర్స్- ఇందిర అనే అమ్మాయి నవల రెండో పేజీలో పరిచయమైనప్పుడు ఎట్లా మాట్లాడుతుందో- చిట్టచివరి పేజీలోనూ అదే ధోరణి, అదే నిర్భయత్వం, అదే స్వేచ్ఛాప్రియత్వం- ప్రదర్శిస్తుంది.

Pages