S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర వాణి

03/20/2020 - 07:21

‘‘అత్త పగులగొడితే పాత కుండ.. కోడలు పగులగొడితే కొత్త కుండ’ అన్న సామెతలాగా ఈ దేశంలో ‘సెక్యులరిజం’ ముసుగేసుకొన్నవాళ్లు చేసే ప్రతి పనీ గొప్పదైనట్లు కలర్ ఇస్తుంటారు. కరడుగట్టిన కమ్యూనిజం ఈ దేశ మేధోవర్గాల్లో ఉంది. అందువల్ల వారు ప్రతి విషయాన్ని ముస్లిం సంతుష్టీకరణ దృష్టితో చూస్తారు. ఇటీవల భైంసాలో అల్లర్లు జరిగాయి. అక్కడి మైనార్టీలు ఆరికటిక వారి ఇళ్లను తగులబెట్టిన దృశ్యాలు అందరూ చూశారు.

03/13/2020 - 01:31

నాటి అమెరికా అధ్యక్షులు జిమీకార్టర్, పూర్వాధ్యక్షులు ఫోర్డ్, హేన్రీకిసింజర్, ఓ క్యాథలిక్ ఫ్రీస్ట్, ఓ అమెరికన్ హిప్పీ ఎరోప్లేన్‌లో ప్రయాణం చేస్తున్నారు. హఠాత్తుగా తుఫాను రావడంతో పైలట్ ప్రయాణికులకు సూచన మొదలుపెట్టాడు. ‘‘మన విమానంపై పిడుగుపడి కో-పైలట్ చచ్చిపోయాడు. ప్లేన్ కూలనుంది. ఇవిగో నాలుగు పారాచూట్‌లు ఉన్నాయి. మీరు ఎలా ఎవరు వాడుకొంటారో మీ ఇష్టం’’అంటూ తాను పారాచూట్ వేసుకొని దూకేశాడు.

03/06/2020 - 02:21

తమిళ స్టార్ రజనీకాంత్ ఢిల్లీ అల్లర్లు జరిగిన వెంటనే స్పందిస్తూ ‘‘ఇలా జరగడం సరైంది కాదు. అవసరమైతే ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తాం’’ అన్నాడు. దీన్ని దేశంలోని మీడియా ఆయన మాటలు సీఏఏకు వ్యతిరేకం అన్నట్లుగా కలర్ ఇచ్చాయి. నిజానికి సిఏఏకు రాజనీకాంత్ మద్దతుగా నిల్చినపుడు ఇదే మీడియా పట్టించుకోలేదు. వెంటనే కొన్ని ముస్లిం సంఘాల గుంపులు రజనీకాంత్ ఇంటికి వెళ్లి తమకు మద్దతుగా నిలవమని కోరాయి.

02/28/2020 - 01:22

రెండ్రోజుల క్రితం ‘నిర్బంధ వ్యతిరేక’ సభ ఇందిరాపార్కు వద్ద జరిగింది. అందులో ప్రముఖ విద్యావేత్తగా ప్రకటించుకొన్న డా॥ చుక్కా రామయ్య ‘‘భారత రాజకీయాలు నేడు వ్యక్తి కేంద్రంగా నడుస్తున్నాయని, తమ అధికార సుస్థిరత కోసం కొందరు ‘అర్బన్ నక్సలైట్’ వంటి పదాలను సృష్టిస్తున్నారని.. ఇలాంటివి చూసేందుకే నేను బ్రతికున్నానా?’’ అని అంటూ నిర్వేదం వ్యక్తం చేశారని పత్రికల్లో ప్రముఖ వార్త.

02/21/2020 - 00:50

సంగీత ప్రపంచంలో భారతరత్న పొందిన గొప్ప షెహనాయి విద్వాంసులు ఉస్తాద్ ఖమ్రుద్దీన్ బిస్లిల్లాఖాన్ గురించి ఓ సంఘటన జనబాహుళ్యంలో ఉంది. ఆయన హిందూ పుణ్యక్షేత్రమైన వారణాసిలో ఉండేవారు. ఆయనను కలిసినవాళ్లు ‘‘మీరు ఇంకా గొప్పవారు కావాలంటే ఢిల్లీలో ఉంటే బాగుంటుంది కదా!’’ అంటే ఆయన తడుముకోకుండా ‘‘్ఢల్లీలో విశే్వశ్వరుడు, గంగానది లేవు కదా!’’ అని ఎదురు ప్రశ్నించేవాడట.

12/20/2019 - 05:41

పాకిస్తాన్ తన మిస్సైల్స్‌కు తైమూర్, అబ్దాలీ వంటి నరరూప రాక్షసుల పేర్లు పెట్టుకున్నది. హిందూస్తాన్‌లో విలయ విధ్వంసం సృష్టించిన మహమ్మద్ ఘోరీ పేరును తన క్షిపణులకు నామకరణం చేసింది. అలాగే కాంగ్రెస్‌ను వెనుకనుండి నడిపించే గులాం నబీ ఆజాద్ తన కొడుకుకు ఔరంగజేబు అని పేరు పెట్టుకొన్నాడు. ఈ నబీ కనుసన్నల్లో నడిచే కాంగ్రెస్ నుండి ‘క్యాబ్’ బిల్లుపై రగడ చూసాక ఇంతకన్నా ‘ఇంకేం చూస్తాం’ అనిపిస్తుంది.

12/13/2019 - 03:39

రెండవసారి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్కో పనిని చాలా జాగ్రత్తగా పూర్తిచేయడం మొదలుపెట్టింది. కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, అయోధ్య వివాదంపై తీర్పును త్వరితగతిన ఇప్పించడం.. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు.. ఇలా ఒక్కో అడుగు ముందుకేస్తుంటే ప్రతిపక్షాలు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించింది.

12/10/2019 - 23:30

మారువేషంలో మారీచుడు మాయలేడిగా వచ్చా డు.. ఆ ‘బంగరు జింక’పై సీత మనసు పడింది. దానిని వేటాడుతూ.. వెంటాడుతూ శ్రీరాముడు పరుగెత్తాడు. మరో వేషంలో మైరావణుడు పర్ణశాల ముందు నిలబడి ‘్భక్షాందేహీ..!’ అన్నాడు. సీత శంకించింది.. అయినా సాధు స్వభావంతో ఆమె ‘లక్ష్మణరేఖ’ దాటింది. అతని అసలు రూపం బయటపడింది. సీత లక్ష్మణరేఖ దాటాక గాని రావణబ్రహ్మ నిజస్వరూపం బయటపడలేదు. రావణుడు త్రేతాయుగం నాటి కిడ్నాపర్, రేపిస్ట్.

11/22/2019 - 05:15

‘ఒంగోలులో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నపుడు మొదటిసారి జార్జిరెడ్డి గురించి వి న్నాను. మళ్లీ ఇపుడు వింటున్నా. ఆయన గురించి తెలుసుకొన్నపుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఆయనపై సినిమా రావడం చాలా ఆనందంగా వుంది. ఇలాంటి అగ్రెస్సివ్ వ్యక్తుల జీవితాలు తెరపైకి రావాలి’.. ఈ ఆణిముత్యాలు పలికిన మహనీయుడు మెగాస్టార్ చిరంజీవి.

11/15/2019 - 01:29

ఈనెల 9వ తేదీన అయోధ్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెం టనే కొంత సంతోషం, అసహనం, ఆనందం, వ్యతిరేకత.. అన్నీ ఒక్కసారి వ్యక్తం అయ్యాయి. శ్రీరామ సంస్కృతిని ఆరాధించేవారు ఆనందాన్ని వ్యక్తం చేస్తే, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఓవైసీ సహా ఒకరిద్దరు తప్ప- ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు.

Pages