S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రార్థన

03/01/2019 - 19:40

పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతల చేతను భక్తుల చేతను నిత్యము కొనియాడబడుచున్న తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు దహించు అగ్నియైన దేవుడు సమీపించరాని తేజస్సుతో ఉన్న దేవుడు ఆత్మస్వరూపియైన దేవుడు వాక్యమై యున్న దేవుడు మనలను కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవాలని, తన జనితైక కుమారుడు మన ప్రభువునైన యేసుక్రీస్తును ఈ లోకములోనికి మానవాకారములో పంపెను.

02/22/2019 - 20:34

‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక, మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.’ -మత్తయి 11: 28-30

02/15/2019 - 19:24

‘దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి’ -ఎఫెసి 6:17
అసలు మనము పోరాడునది శరీరులతో కాదు గనుక శరీర ప్రకారము యుద్ధము చేయము. శరీరేచ్ఛలను అదుపు చేయుటయే యుద్ధము. శరీరములో వచ్చే ఆవేశము ఆవేదన ఆలోచనలు కోపము అదుపు చేయటం ముఖ్యం. సాతాను పెట్టే శోధనలను ఎదుర్కొనటానికి, జయించటానికి ప్రభువు వాడిన వాక్య ఖడ్గము మనకు కూడా అవసరం. సాతాను యొక్క అసత్యాన్ని ఎదుర్కొనటానికి మనకు సత్య వాక్యము అవసరం.

02/08/2019 - 18:32

‘అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి’ -ఎఫెసి 6:11

‘విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.’ -ఎఫెసి 6:16

‘వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును.’ -రోమా 10:17

02/01/2019 - 19:12

‘దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.’ - ఎఫెసి 6:11
సర్వాంగ కవచము దేవుడు ఉచితముగా ఇచ్చేది. ఎవరో ఇచ్చేది కాదు. ఎక్కడో దొరికేది కాదు. ఆయనను నమ్మినటువంటి వారికందరికి ఉచితము. దేవుడు లోకాన్ని ప్రేమించి లోకమంతటికి కృపతో రక్షణను అనుగ్రహించాడు. దానిని పొందుకున్న వారి శిరస్సుకు ఇది రక్షణ శిరస్త్రాణము (హెల్మెట్)గా ఉంటుంది.

01/25/2019 - 18:26

‘తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి.’ -ఎఫెసి 6:10

01/18/2019 - 19:17

‘ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.’ - ఎఫెసీ 6:12
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి.

01/11/2019 - 19:18

‘మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వారిని పాడుచేయును. మీరు ఆ ఆలయమై యున్నారు.’ - 1 కొరింథీ 3:16-17

01/04/2019 - 19:53

‘ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.’

12/28/2018 - 20:23

ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడనుగ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

Pages