S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/07/2016 - 22:07

శ్రీ శుభములిచ్చి తెలుగిళ్ళ సిరులవిచ్చి
చైత్రమాసపు పరువాలు ధాత్రికిచ్చి
పచ్చని బతుకుల్ అందర్కి పంచి యిచ్చి
తెలుగు యిండ్లకు రావమ్మ వెలుగులిచ్చి

శిశిర రుతువు రాల్చినవన్ని చెట్లకిచ్చి
మనుషులందరికి మమత మంచి యిచ్చి
రమ్యమై నవరాగ సరాగ బాల
ద్రావిడాడపడుచువమ్మ నీవు రమ్ము

04/07/2016 - 22:05

స్వాగత గీతాల్ని వినిపించకుండానే
తెలుగువారి ముంగిట్లో
వచ్చి వాలిన వసంతం
అవును మరి- అది మన అందరి- సొంతం!
తొందరపడిన కోయిల-
ముందుగా కూసిందో-
సందడి చేసే సుమ సౌరభాలు
వడి వడిగా గుబాళించాయో

04/07/2016 - 22:03

తరు తరుణుల పీతాంబర ప్రభలు
కొమ్మల రెమ్మల కోలాటములు
మందారము, సిరిమల్లె నవ్వులు
వసంత సుందరి వయ్యారములు
తెలుగు తేజమును రంగరించుకుని
ఉగాది వెలుగులు విరజిమ్మింది.

మత్తకోయిలల మధుర స్వరాలు
శాతవాహన యశోగీతములు
భ్రమరాదుల ఝుంకారధ్వనికి
పక్షుల కిల కిల తాళమేయగా
తెలుగు జాతి తేజోవిలాసమున
నూతన సంవత్సరమొచ్చింది

04/07/2016 - 07:02

మరీ అంత భీషణ క్రౌర్యమా?

04/05/2016 - 22:25

స్పర్ష్ షా సంచలన రికార్డుస్పర్ష్ షా సంచలన రికార్డు12ఏళ్ల స్పర్ష్ షా గురించి తెలియనివారు ఉండరు. పాటలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్పర్ష్ షా తాజాగా ‘్భయం లేదు’ అనే పాటకు సైతం 12 మిలియన్ల మంది ఆకర్షితులయ్యారు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ పాట అందరి నాలుకలపై నాట్యం చేస్తోంది.దాదాపు 12 మిలియన్ల మంది ఈ పాట విన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

04/02/2016 - 19:03

పాకిస్తాన్‌లోని బహిరంగ ప్రదేశాలన్నీ పురుషులే ఆక్రమించేశారు. టీ బంకలు, డాబాలు ఒకటేమిటి అన్నీ వారి సొంతం అన్నట్లు స్వేచ్ఛగా వచ్చి తింటారు. తాగుతారు. మహిళలు ఇలాంటి ప్రదేశాలకు రావటం జరగదు. అలా చేస్తే సామాజిక సాంప్రదాయాలకు విరుద్ధం. అసలు రోడ్డు వెంట చాలా దూరం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లటానికే భయపడతారు. ఇలాంటి సామాజిక సంకేళ్లను తెంచుకుని ఇపుడిపుడే మహిళలు అడుగు ముందుకు వేస్తున్నారు.

03/31/2016 - 23:22

కింక్రీదేవి.. ఈ పేరు. పలకడానికి కొంచెం కష్టంగా, క్లిష్టంగా ఉండవచ్చు. ఎందరికో స్ఫూర్తినిచ్చిన పేరు. పేరులాగే ఆమె కూడా కఠినమైన పోరాటాల బాటలో నడిచి విజయం సాధించిన నిరుపేద, నిరక్షరాస్య మహిళ.

03/30/2016 - 22:55

అతని వయసు 15 సంవత్సరాలు. వాళ్ళ వూరు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్. అతని పేరు ప్రయత్న శర్మ. ‘స్కేటింగ్‌లో కింగ్’. అతను ‘రోలర్ స్కేటర్స్’ మీద పరుగు లంకించుకుంటే మోటార్ బైకు కూడా వెంటపడి అందుకోలేదు. బిజీ ట్రాఫిక్‌లో కూడా కిలోమీటరు దూరాన్ని రెండు నిమిషాల ఎనిమిది సెకనులతో వెనక్కి తిరిగి పరిగెడుతూ దాటేస్తాడు! తాజాగా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కిందీ బాలుడు పేరూ ప్రఖ్యాతి. తండ్రి ఘనశ్యామ్ శర్మ యితనికి గురువు.

03/29/2016 - 21:14

మూడు సార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న 29ఏళ్ల కంగనారౌనత్ పుట్టి పెరిగిన తరువాత ఇప్పటి వరకూ పది సినిమాలు మాత్రమే చూశాను అని చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తోంది కదూ! ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో ఒదిగిపోయే కంగన తాజాగా ‘తను వెడ్స్ మను రిటర్న్స్’లో రొమాంటిక్, కామెడీగా కనిపించే రెండు వైవిధ్యమైన పాత్రలు పోషించి మూడోసారి జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.

03/24/2016 - 22:51

మన దేశ జనాభా 131 కోట్లు దాటనుంది. ఇందులో వంద కోట్ల మంది సెల్ వినియోగదారులున్నారని ‘ట్రాయ్’ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రకటించింది. అంటే మన దేశంలో పసిపిల్లలు (12 ఏళ్ల లోపు వారు), వయోవృద్ధులు తప్ప అందరూ సెల్‌ఫోన్ వినియోగదారులేనన్నమాట. ఈ దుర్వ్యసన పరిణామం గురించి ఆలోచిస్తే నేటి యువతరం పెడత్రోవ పడుతోందన్నది వాస్తవం.

Pages