S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

07/09/2019 - 19:42

రక్తనిష్టా అంటే అమ్మవారు తేజో రూపంలో ఓజస్సుగా మన రక్తంలోకి ప్రవేశిస్తుంది. పెసరపప్పు పాయసం ఒక ఔషధం. సత్యనారాయణ స్వామి ప్రసాదం మరో ఔషధం.
‘‘అన్ని మతములూ, ధర్మములు సమానమేనా సిద్ధాంతిగారూ?’’
‘‘కావు. ఎవరి మంచిచెడులు వారివే. మనుషులను జంతువులను చంపాలి అంటే మన తెలివి తెల్లవారినట్లే అవుతుంది.
అజ్ఞానం, అహంకారం అక్కాచెల్లెళ్లు.
ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్

07/08/2019 - 18:43

అప్పుడు దీపక్‌చంద్ ఇలా అన్నాడు -
‘‘మన కంపెనీకి ఇలాంటి ఎసైన్‌మెంట్లు ఎప్పుడైనా వచ్చాయా విశ్వనాథ్?’’
‘‘రాలేదండీ! కాని యిలాంటివి బుక్ చేసేవాళ్లున్నారు. వారి వెనుక రౌడీగాంగులు ఉన్నాయి. ఈ విషయం మన బిజినెస్ ఫీల్డులో అనుకుంటున్న విషయమే’’
దీపక్‌చంద్ తల ఊపాడు.
‘‘సరే! శ్రీ్ధర్ అడిగిన సమాచారం రహస్యంగా వారికి అందించు. నీవు చెబుతున్నది రాణీగంజ్ కంపెనీ గురించి కావచ్చు’’

07/07/2019 - 23:10

ఎవరో హిమాలయ యోగి వచ్చి మాణిక్‌చంద్‌కు ఏదో దీక్ష ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత మాణిక్‌చంద్‌లో ఏదో దివ్యశక్తులు ప్రవేశించాయి.

07/05/2019 - 19:39

‘‘ఈయన పేరు విశ్వనాథ్ గోడ్బోలే! నా దగ్గర అసిస్టెంటుగా ఉన్నాడు’’
మాణిక్‌చంద్ గోడ్బోలే ముఖం చూచి ‘‘అబద్ధం! నీవే ఆయనకు అసిస్టెంటువు. ఎందుకంటే నీ ఆర్థిక లావాదేవీలన్నీ నీ కొడుకుకు బదులు గోడ్బోలే చూసుకుంటున్నాడు’’ అన్నాడు మాణిక్‌చంద్.
‘‘నిజం నిజం’’ అని నవ్వాడు తంగిరాల శ్రీరామశర్మ సిద్ధాంతి.
గోడ్బోలేకు దీపక్‌చంద్ వ్యాపార రహస్యాలన్నీ తెలుసు.

07/04/2019 - 18:45

‘‘పెళ్లికూతురును అలంకరించారా? పెళ్లి తర్వాత ఆమె దుబాయి వెళ్లడానికి వీసా ఏర్పాటు చేశారా?’’’
‘‘ప్రయత్నాలు మొదలైనాయి. అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏమీ ఆందోళన చెందవద్దు (్ఫకర్ మత్ కరో)’’
ఇదీ సందేశం -
దీపక్‌చంద్ దీనిని చూసి సంతోషపడ్డాడు.
‘‘శుభకార్యం! మనం ఆనందించి ఆశీర్వదించాలి’’ అన్నాడు దీపక్.

07/03/2019 - 19:38

కేసులు నమోదు చేయవద్దు. ఏదో నాలుగు రోజులు హడావుడి ఉంటుంది. ఆ తర్వాత నేరం ప్రజలు మరిచిపోతారు’’ అని చెప్పారు.

07/02/2019 - 19:30

‘‘్భక్త తపస్వి. అందువలన ఋషులు, యోగులు మాట అంటే చాలు అది వరమో శాపమో అవుతుందని మన పురాణాలు చెబుతున్నాయి’’ అని తంగిరాలవారు ఉదంకోపాఖ్యానంలో -
‘‘నిండు మనంబు నవ్యనవనీత సమానము’’ అని నన్నయభట్టు వ్రాసిన పద్యం చదివాడు.
పార్థు ఇలా అన్నాడు -

07/01/2019 - 19:50

దానితో ఈమె తన మానసిక సంతులనం కోల్పోయింది. తనకు జీసస్ కన్పడ్డాడనీ, దేవదూతలు పిలుస్తున్నారనీ చెప్పుతున్నది. ఇదంతా ఒక రకమైన భ్రమ, భ్రాంతి, నరాల బలహీనత, మానసికోన్మాదం’’
‘‘సిద్ధాంతిగారూ! సెక్రటరీ ఎందుకు చనిపోయాడని మీరు అనుకుంటున్నారు?’’
‘‘దానిపై పోలీసు ఎంక్వైరీ జరుగుతున్నది. వారేదో సాక్ష్యాధారాలతో నిరూపిస్తారు. ఇందులో మనకు తెలియని అంశాల నిగూఢంగా ఉన్నట్లు మాత్రం చెప్పగలను’’

06/30/2019 - 22:35

అతని గొంతు మృదువుగానూ, మెల్లగానూ ఉండటంతో జనం ఎక్కువగా హర్షించలేదు. వారికి ఉత్తేజపూరితమైన ఉపన్యాసాలు కావాలి. జనాలను రెచ్చగొట్టే ప్రసంగాలు కావాలి. గోడ్బోలే మాటలు ఉప్పులేని పప్పులా చప్పగా ఉన్నాయి.
ఆ తర్వాత విజయవాడ నుండి వచ్చిన ఒక నాయకుడు ఉద్రేకపూరితమైన ప్రసంగంతో సభను బాగా ఆకట్టుకొన్నాడు. అతనికి తెలుగు సాహిత్యంతో బాగా పరిచయం ఉంది. అందుకని కొన్ని పాటలు, పద్యాలు, కవితలు వినిపించాడు.

06/28/2019 - 19:59

‘‘గోడ్బోలే! నీవిక వెళ్లు. మరో విషయం - నాకెందుకో నిరీక్షణానంద స్వామి వారి ఆశ్రమంలో ఏద జరుగకూడనిది జరుగ బోతున్నదని తోస్తున్నదయ్యా!’’
‘‘అంటే ఏమిటి స్వామీ?’’
‘‘ఏమో తెలియడం లేదు. ఏదో అపశకునం కన్పడుతున్నది. సరే నీవు వెళ్లు’’
గోడ్బోలే బేగంబజార్‌కు వచ్చి చేవెళ్ళ స్థలం కొనవద్దని తంగిరాల సిద్ధాంతి గారు చెప్పినట్లు చెప్పాడు. అక్కడ దయ్యాలు ఉన్నమాట వాస్తవమేనని ఆయన నిర్ధారించారు.

Pages