S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

03/23/2018 - 20:33

7
గణపయామాత్యుడు ఆంతరంగిక వ్యవహారాల మంత్రిగా రాజప్రాసాదంలో అత్యంత కీలక స్థానంలో మెలగుతున్నాడు.
గణపతిదేవుడు రాజకుమారుడుగా నవనవోనే్వషంగా రూపుదిద్దుకున్నాడు.
మహారాజు గణపతిదేవుని తరచు కలుస్తూ క్షేమసమాచారాలు తెలుసుకుంటూ అతని చూని ఆనందపరవశుడౌతూ వుంటాడు.
గణపయామాత్యులవారు ప్రభువులు ఏకాంతంగా ఉన్నపుడు కలిశారు, ఒకసారి.
‘‘ప్రభూ! గణపతి దేవులవారి గురించి మీ అభిప్రాయం’’

03/21/2018 - 21:00

జయతుంగుడు రాజకీయ వ్యవహారాలలోను, పాలనా వ్యవహారంలోను, దేశ పర్యటనలోను, అప్పుడప్పుడూ జరిగే యుద్ధాలలోను చెలరేగిన సామంతులను అణచి చక్కదిద్దుటలోను, అతనికి తీరుబడి లేదు.

03/20/2018 - 22:28

గణపతి దేవుడికి యుక్త వయస్సు వస్తున్నది. భుజాల దాకా వ్రేలాడే జులపాలు. చిరుగడ్డం, నూనూగు మీసకట్టు. ఆజానుబాహువైన అంగపుష్టి, చిన్ననాడు కట్టిన మెడలో వ్రేలాడే బంగారు గొలుసుతో, శివలింగం తీర్చిదిద్దినట్లున్న అంగాంగ సౌష్టవం. నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజఠీవి. ప్రసన్నవదనం. నడుముకు అంగవస్త్రం మాత్రమే బిగించి ఉంటుంది. పైబట్ట వేసికోడు. ఎవరు ఎన్ని మారులు తెచ్చి యిచ్చినా అంతే.

03/19/2018 - 21:16

కొత్త సీరియల్ ప్రారంభం
*
ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!
గణపతిదేవుడు నిమీలిత నేత్రుడై పంచాక్షరీ మంత్రం తదేక దీక్షతో జపిస్తున్నాడు.

03/18/2018 - 21:26

చేతిలోని గిఫ్ట్ ప్యాకెట్టు కింద పడింది.
ఆ ప్యాకెట్ మీదే కూలబడ్డాడు శేషగిరి.
ఎర్రబటన్ ప్రెస్ అయ్యింది.
ఒక్కసారిగా పెద్ద పేలుడుతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
శేషగిరికి కాళ్లకు, నడుంకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.
పెళ్లికి వొచ్చిన బంధువులు ఆ పేలుడు శబ్దం విని ఇంటి దగ్గరకు పరుగెత్తుకుంటూ వొచ్చారు. శేషగిరిని హాస్పిటల్లో చేర్చారు.
***

03/16/2018 - 21:26

పెళ్లి మండపాన్ని పూలమాలలతో అందంగా అలంకరించింది.
ఆ ప్రాంతమంతా కమ్మటి పూలవాసనతో ఎదురుగా కూర్చున్నవాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ వుంది.
ఓ ప్రక్కన సన్నాయి మేళం, మరోప్రక్కన బ్యాండ్ మేళం వాళ్ళు పోటీపడి శ్రావ్యంగా సంగీత స్వరాలు విన్పిస్తూ వున్నారు.
కన్యాదానం సమయంలో వేదిక మీదకు వొచ్చి అన్నపూర్ణమ్మ పక్కన కూర్చున్నాడు. అతనికి ఉన్నది వొక్క చెయ్యే! ఆ చేత్తోనే కార్యక్రమం నడిపించాడు.

03/15/2018 - 21:41

‘‘మీరు పొగిడినా ఆ పొగడ్తలు నాకు చెందవు.. పోలీసు డిపార్టుమెంటుకు చెందుతాయి. మాఫియా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పింది మా డిజిపిగారు.. వారి ఆఫీసులోనే ఒక ప్రత్యేకమైన సెల్ క్రియేట్ చేశారు అరిఫ్ ముఠా కార్యకలాపాలపై ఇనె్వస్టిగేషన్ చెయ్యమని చెప్పారు. నాకు ట్రాన్స్‌ఫర్ వచ్చినా అవి క్యాన్సిల్ చేయించారు హోమ్ మినిస్టర్..

03/14/2018 - 21:05

ముఖ్యమైన విషయమైతేనే స్కంద ఫోన్ చేస్తాడు.
లేచి కూర్చుని కాల్ రిసీవ్ చేసుకున్నాడు.

03/13/2018 - 21:11

న్యూస్ ఛానల్స్ వాళ్లు వొచ్చి పోలీస్‌స్టేషన్ దగ్గర వాలిపోయారు. వేటకు వెళ్లితే చేపలు దొరికినట్లు వాళ్లకు మ్యాటర్ దొరికింది. రెండ్రోజుల నుంచి చేపల వేటకు వెళ్లకుండా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్న సింహాద్రి దొరికాడు.
శవాన్ని చూసిన దగ్గర్నుంచి రిక్షావాడికి డబ్బులు తనే ఇవ్వాల్సి వొచ్చిందన్న విషయం వరకు పూసగుచ్చినట్లు చెప్పాడు.

Pages