S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

12/05/2015 - 04:09

ఎద్దులెద్దులు కుమ్ముకుంటే మధ్యన దూడలు నలిగి చచ్చినట్టు అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ చదరంగపు ఆటలో రాష్టమ్రంతటా ఎక్కడి ఇండ్లు అక్కడే ఆగిపొయ్యాయి.

12/03/2015 - 02:44

ఇంటి వెనుక నులకమంచంమీద పడుకున్న భార్య పక్కన కూర్చున్న ఎల్లయ్య మెల్లగా ఆమె నడుం ముడతల మీద చెయ్యి వేసి తనవైపుకు తిప్పకుంటూ ‘‘నువ్వు అనవసరంగా కోపం తెచ్చుకున్నావుగాని ముసలోళ్ళన్నదానిలో తప్పేముంది చెప్పు?
ఈ రోజుల్లో రెండు గదుల డాబా ఇల్లు గడ్డటమంటే మాటలా!? ఆ సర్కారోణ్ణి నమ్మి ఇండ్లు మొదలుపెట్టి మన కండ్లముందే బస్తీల ఎంతమంది బాధపడుతున్నారో నీకు తెలవదా?

12/02/2015 - 02:20

అయినా అటు ఇండ్లూ పూర్తిగాక ఇటు రోజువారి వాయిద్యాలు కట్టలేక నానా అగాచాట్లు పడసాగారు.

12/01/2015 - 04:56

తిండికి బట్టకే కనాకష్టంగా నడుస్తున్న వాళ్ళ కుటుంబ వ్యవహారం ‘దిన దినగండం దీర్ఘాయుష్షు’ అన్నట్టుగా తయారైంది.
అసలే కుంటిగుర్రంలా సాగుతున్న ఎల్లయ్య కుటుంబానికి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు ఓ కొత్త ఆపద ముంచుకొచ్చింది.
పాల్వంచ బ్యాంక్ రోడ్డులో ఎప్పుడో తాతలకాలంనాటి మూడుగదుల పెంకుటింట్లో ఇప్పటిదాకా కాపురం చేస్తున్నారు ఎల్లయ్య వాళ్ళు.

11/29/2015 - 22:13

‘‘ఓకే మీరిక స్టేషన్‌కెళ్లిపోండి. రైటర్ కనకరాజుని మాత్రం నేనొచ్చిందాకా స్టేషన్లోనే వుండమని చెప్పండి’’ అంటూ ఆదేశం ఇచ్చిన ఎస్సై లిఫ్ట్‌కున్న ఇనుప జాలీని మూసివేశాడు.

11/28/2015 - 22:17

గల్లీ లీడర్లు నలుగురు ఎంతకీ వాళ్లు ఎదురుచూస్తున్నదేదీ జరక్కపోవడంతో కొంత నిరాశకు లోనైనా వెంటనే తమాయించుకొని మెల్లగా ఎల్లయ్య వాళ్ళను చేరబోయారు.

11/28/2015 - 05:21

కృష్ణాష్టమి రోజున ఉట్టి స్తంభాన్ని పాకడానికి ప్రయత్నించినకొద్దీ తెగజారిపోయినట్టు వాళ్ళ చేతుల్లోనుండి ఎల్లయ్య కుటుంబమంతా జారిపోసాగింది.
నడిరోడ్డుమీద జరుగుతున్న ఆ గలాటాను అక్కడ చేరిన జనమంతా అలా గుడ్లప్పగించి సినిమా చూసినట్టు చూడసాగారు తప్ప ఒక్కరన్నా కలుగజేసుకుని ‘‘ఏమిటిందా?’’ అంటూ అడిగిన పాపాన పోలేదు.

11/26/2015 - 04:21

గొర్రెపొట్టేలు కొండను ఢీకొట్టినట్టు
చలిచీమలు కొండచిలువను సవాల్ చేసినట్టు
మేకపిల్ల తోడేలు మీదికి తొడ చరిచినట్టు
శుక్రవారంనాడు
సరిగ్గా జుమ్మా సమయాన

11/25/2015 - 04:45

అంతకుమించి నాకెందుకో అమ్మ రూపం మరో రకంగా కనిపించదు.. ఒక్కసారి అమ్మ చెప్పిన మాటలు మాత్రం ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతున్నాయి. ‘‘నీ కంట్లో కన్నీళ్ళు రానంతవరకూ నువ్వు, నీ చుట్టూ సమాజం బాగున్నట్టే. నీ కంట్లో కన్నీళ్లు వచ్చాయంటే నువ్వో, నీ చుట్టూ ఉన్న సమాజమో బాగలేనట్టే. నీకు కన్నీళ్లు రప్పించే సమాజాన్ని నువ్వు బాగు చేయలేకపోవచ్చు. కానీ, నీలో కన్నీళ్లు రాకుండా నిన్ను నీవు బాగు చేసుకోవచ్చు.

11/24/2015 - 04:32

కడుపు న పుట్టిన బిడ్డలంటే
ప్లాస్టిక్ సంచుల్లో పెంచే జామాయలు మొక్కలు కాదు
వేళ్లు సాగంగానే ఆ సంచుల్లోనుండి తీసి ఇంకోచోట పాతడానికి
అంటున్న శాంతమ్మ

అడవి నుంచి వచ్చిన లేడికూన మాదిరిగా
భయం భయంగా వొదిగి వుండే నీగుండెల్లో
ఇంత కసి వుందని కనిపెట్టలేక పోయనానంటున్న కనకమ్మ

Pages