S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నేర్చుకుందాం
క. జనవినుత! యగ్ని హోత్రం
బును సంతానమును వేదములు నెడతెగఁగాఁ
జన దుత్తమ వంశజులకు
ననిరి మహాధర్మనిపుణులైన మునీంద్రుల్
క. వినవయ్య! యేకపుత్రుఁడు
ననపత్యుఁడు నొక్క రూప యని ధర్మువులన్
విని, నీకుఁ దోడు పుత్త్రుల ననఘా
పడయంగ నిష్టమయినది నాకున్
భావం: ఓ పుణ్యాత్ముడా! వినుము. ఒకే ఒక కొడుకును కలవాడు, సంతానం లేనివాడు - వీరిద్దరూ సమానులే. అని ధర్మాశాస్త్రాలలో విని , నీకు తోడుగా మరికొందరినైనా కొడుకులను పొందాలని నాకు కోరిక కలిగింది. అని శంతన మహారాజు తన గురించి అడుగుతున్న గాంగేయునితో అన్నాడు.
చ. భవదభిరక్షిత క్షాతికి బాధ యొనర్పఁగ నోపునట్టి శా
త్రవనివహంబు లేదు: వసుధాప్రజకెల్ల ననంత సంతతో
త్సవముల: రాజులెల్ల ననిశంబు విధేయుల నీకు;నిట్లు మా
నవవృషభేంద్ర! యేలొకొ మనఃపరితాపము ఁ బొందియుండఁగన్
మధ్యాక్కర
‘్భపాల! నీకు నిక్కోమలి వలనఁ బుట్టిన సుతుఁడు
నీ పరోక్షంబున రాజు గావలె :నెమ్మి ని ట్లీఁగ
నోపుదే?’ యనిన శంతనుడు గాంగేయు యువరాజుఁ దలఁచి
‘రుూ పల్కు దక్కఁగ నొండు వేఁడుమ యిచ్చెద’ననిన
తే. పుట్టినప్పుడ కన్యకఁ బోలునట్టి
వరున కిచ్చుట యిది లోకవర్తనంబు
వసుమతీ నాథ! నీ యట్టి వరున కిచ్చి
ధన్యులము గామె యిక్కన్యఁ దద్దపేర్మి
ఉ. ‘ఎందు లదాన? వేకతమ యియ్యమునానది నోడ నడ్పుచున్
సుందరి! నీకు నున్కి యిది చూడగఁదా నుచితంబె? ’ నావుడున్
మందమనోజ్ఞహాసముఖ మండల మెత్తి మృగాక్షి చూచిసం
క్రంతనసన్నిభున్ నృపతిఁ గన్యక యి ట్ని పల్కెఁ బ్రీతితోన్
క. కనకావదాత కోమల
తనులతఁ దనుమధ్యఁ గమల దళనేత్రను యో
జన గంధి నవనినాథుఁడు
గనియెను సురకన్యవోని కన్నియ నంతన్
సీ. సాంగంబు లగు చుండ సకల వేథంబులు సదివె వసిష్ఠుతో సకల ధర్మ
శాస్త్రాది బహువిధ శాఅస్తముల్ శుక్రబృహస్పతుల్ నేర్చిన యట్ల నేర్చెఁ
బరమాస్తవ్రిద్య నప్పురశురాముండెంత దక్షుఁడంతియ కడు దక్షుఁడయ్యె
నాత్మ విజ్ఞానంబునంద సనత్కుమారాదుల యట్టిడఁడ యనఘమూర్తి
ఆ. నొప్పుగొనుము వీని: నుర్వీశ’యని సుతు
నిచ్చి గంగ సనిన నెఱిఁగి తనయు
నెమ్మిఁ దోడుకొనుచు నిధి గన్నపేదయ
తే. దివ్య భూషణాలంకృత దేహుఁడైన
కొడుకు నలపలి చేయూఁది కోమలాంగి
విద్య నది ప్రీతితో జనుదెంచి పతికిఁ
జూపి ‘్భనాథ; వీఁడు సూనుఁ’డినియె
తరలము
కనియె ముందట నమ్మహీపతి గాంగసైకత భూములం
బనుగొనన్ ధను నభ్యసించుచు బాణసంహతి సేతుగా
ఘనముగా సమరాన గౌఘముఁ గట్టియున్న కుమారు న
త్యనఘు నాత్మ సమాను నాత్మజు నాపగేయు మహాయశున్