S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2017 - 22:51

ఆమె ప్రపంచ ప్రజలు మనసు గెలుచుకున్న అందాల యువరాణి. అందుకే అందరి హృదయ సామ్రాజ్ఞి అయింది. ఆమె అందమైన నవ్వు వెనుక దాగివున్న విషాదం ప్రజానీకాన్ని వెన్నాడుతూనే ఉంది. ఆ నవ్వు అనంత విశ్వంలో కలిసిపోయి నేటికి ఇరవై ఏళ్లు. అయినా ఈనాటికీ అందరి మనసుల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఆమే బ్రిటిష్ ప్రినె్సన్ డయాన. రేపటికి ఆమె చనిపోయి రెండు దశాబ్దాలు దాటింది.

08/29/2017 - 22:46

మానవులకు దేవుడిచ్చిన అపురూపమైన గొప్పవరం నవ్వు. ఈ భాగ్యం మానవాళికి మాత్రమే దక్కింది. హాయిగా నవ్వడంవల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. మనసారా నవ్వితే ఆయువు పెరిగి శారీరక ఆరోగ్యం చేకూరి, చలాకీగా ఉండటంతో వత్తిళ్ళు దరిచేరవు. ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు నవ్వగలిగితే మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక ఆందోళనను మటుమాయం చేసి మనస్సును ప్రశాంతంగా వుం చుతుంది.

08/29/2017 - 22:45

యువతరం సరికొత్త ఆశలు, ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఇలాంటి కోవకు చెందినవారే ఈ యువ ఇంజనీరింగ్ విద్యార్థినులు. ఇంకా నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసుకోనూలేదు. అప్పుడే సేవబాట కాదు కాదు..సహాయ బాట పట్టారు. రక్తదానం..ప్రమాదాల్లో గాయపడిన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందివ్వడం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు పంచడం..

08/29/2017 - 22:42

మనింట్లో పనిమనిషి ఉందంటే ఆమె చేత గొడ్డు చాకిరీ చేయించుకుని మిగిలిపోయిన అన్నం ఇచ్చి పంపేస్తాం. కానీ ఈ కృష్ణవేణి వారి బాగోగుల గురించి ఆలోచిస్తుంది. చట్టాలు, హక్కులు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా వారి శ్రేయస్సుకు పాటుపడుతుంది. ‘పనివారు కాదు-మనవారు’ అనే నినాదంతో నిరుపేద పనివారకు సేవలందిస్తున్నారు సామాజిక వేత్త కొత్త కృష్ణవేణి.

08/29/2017 - 22:38

కొత్త ట్రెండ్ సృష్టించాలన్నా.. అభిమాన హీరో స్టైల్‌ని ఫాలో అవ్వాలన్నా కుర్రకారు ఎప్పుడూ స్పీడే. వేసుకునే దుస్తుల నుంచీ, ధరించే యాక్ససరీస్ వరకూ కొత్త ప్యాషన్‌ని ఫాలో అవుతూనే ఉంటుంది నేటి యువతరం. అమ్మారుూ, అబ్బారుూ యాక్ససరీస్‌లో మరింత స్టైల్‌గా ముందుంటాయి లెదర్ కఫ్స్. నిజానికి వీటి వాడకం రెండు మూడు ఏళ్ల క్రిందటే మొదలైనా ప్రస్తుతం హాట్ ఫ్యాషన్, టాపిక్ అవ్వడం చెప్పుకోదగ్గది.

08/29/2017 - 22:24

‘‘అమ్మా ఈసారి నీ పుట్టిన రోజుకు చాలా ప్రత్యేకమైన బహుమానం ఇవ్వదల్చుకున్నాం’’ అన్నాడు.
‘‘ఇప్పటివరకు ఇచ్చినవి చాలదా?’’ అన్నాను.
‘‘లేదు, లేదు నీకిది యిదివరకు ఎప్పుడు ఇవ్వలేదు’’ అన్నాడు.
‘‘ఏమిటిది?’’ అన్నాను, ఏమయివుంటుందా అని ఆలోచిస్తూ-
‘‘కాని ఒక్కటే చిక్కు అన్నాడు, ఏమిటో చెప్పకుండా’’. నువ్వు ఇక్కడకు వచ్చి తీసుకోవాలి అన్నాడు.

08/29/2017 - 23:36

చ. గొనకొని మర్త్యలోకమునకుం జని సమ్మనినాథ! యిందు నా
యునికిని రాజసూయమఖ మున్నతిఁ జేసిన ధన్యు లింద్రునం
దునికియు నా తనూజున కనూనయశోనిధి యైన ధర్మ నం
దనుదకుఁ జెప్పి వాని నుచితస్థితిఁ బన్పుఁడు దానిఁ జేయఁగన్

08/29/2017 - 23:36

‘‘బాబా నా మేకలు మందలోనుంచి తప్పిపోయాయి. నాకు చాలా కంగారుగా ఉంది. నా మేకలను నేను ఎలా పట్టుకోవాలి. కాస్త నా మేకలు ఎటుపోయి ఉంటాయో చెప్పు బాబా. నేను వెళ్లి తెచ్చుకుంటాను’’ ఆయాసపడుతూ శివుడు వచ్చాడు.

08/29/2017 - 22:18

‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనేది ప్రాచీనోక్తి. పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదుఅనేది పెద్దల మాట. అనుభవజ్ఞులు, అనుకొన్నది సాధించిన వారు కూడా పట్టుదలతోనే మేమీపనిని నెరవేర్చామని అంటారు.

08/29/2017 - 22:14

ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం అన్నది అంత తేలిగ్గా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ మెలికలుగా మారుతున్న పరిస్థితి ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి ఎంతమాత్రం అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఈపాటికే చర్చలు మొదలై విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి రావాల్సి వుండగా, అలాంటి ఛాయలేవీ వాస్తవికంగా కనిపించడం లేదు.

Pages