S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2017 - 21:49

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న నాగార్జున ఎప్పుడూ ప్రత్యేక శైలి కనబరుస్తాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతోపాటు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తూ తనకంటూ ఓ బ్రాండ్‌ను ఏర్పర్చుకున్నాడు. మరోవైపు నిర్మాతగా కూడా ఆయన స్టైలే వేరు.

08/29/2017 - 21:46

ఈమధ్య అందాల భామ తమన్నాకు కెరీర్‌కు కాస్త బ్రేక్ పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభినేత్రి భారీ పరాజయం పాలవ్వడంతో తమన్నాకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఒకే ఒక్క తమిళ చిత్రంలో నటిస్తున్న ఈ మిల్కీ భామకు తెలుగులో క్రేజీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే కళ్యాణ్‌రామ్ సరసన ఓ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన తమన్నా, మరోవైపు ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశ సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు రెడీ అయ్యిందట.

08/29/2017 - 21:44

పితృస్వామ్య ఆలోచనలు పరిశ్రమలోనే కాదు, ప్రపంచాన్నీ వెంటాడుతున్నాయి. అందుకే -రీల్ లైఫ్‌లోని కొన్ని పాత్రల్ని రియల్ లైఫ్‌లో కొనసాగించలేని పరిస్థితి ఉంది. నటిగా పరిశ్రమలో సొంత గొంతు వినిపించటం అంత సులువేం కాదు’ అంటోంది హీరోయిన్ తాప్సి. ‘పింక్’, ‘నామ్ షబానా’ చిత్రాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలందుకున్న 30ఏళ్ల తాప్సీ ‘జుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.

08/29/2017 - 03:29

హైదరాబాద్, ఆగస్టు 28: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి గెలుపొందడం ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన రెఫరెండం కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలా అనుకుంటే అంతకన్నా మూర్ఖుడు మరొకరు ఉండరని ఆయన విమర్శించారు.

08/29/2017 - 03:27

అమరావతి, ఆగస్టు 28: వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ ఎంపిలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడితే తాము అక్కడ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వ్యాఖ్యానించారు. సోమవారం చంద్రబాబు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అవి మాటల్లోనే...

08/29/2017 - 03:25

మహబూబ్‌నగర్, ఆగస్టు 28: ‘మిత్రమా కెసిఆర్ నీ దొంగ దీక్షను చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఇక్కడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గమనించడంతో పాటు తెలంగాణ ఆకాంక్ష కోసం విద్యార్దులు, యవకుల బలిదానాలు ప్రజల పోరాటాలను చూసి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు.

08/29/2017 - 03:22

ధర్మపురి, ఆగస్టు 28: రైతుల పక్షపాతియైన కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా కోట్లాది నిధులు వెచ్చించి, తెలంగాణలోని కోటి ఎకరాల సాగు కావడమే లక్ష్యంగా శరవేగంతో పనులు చేస్తున్నదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామాత్యులు తన్నీరు హరీష్‌రావు అన్నారు.

08/29/2017 - 03:20

నల్లగొండ, ఆగస్టు 28: తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణగా పేరొందిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి నీటి విడుదల చేయించేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

08/29/2017 - 03:18

హత్నూర, ఆగస్టు 28: చదువుకోవడం ఇష్టం లేదన్నా నన్ను ఈ కళాశాలలో ఎందుకు చేర్పించారు?

08/29/2017 - 03:17

సంగారెడ్డి, ఆగస్టు 28: పాలిటెక్నిక్ కళాశాలల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కలబ్‌గూర్ గ్రామంలో పశువుల క్రయ విక్రయాల సంతను, ఇస్మాయిల్‌ఖాన్‌పేట పరిధిలోని దాసుగడ్డ తండ లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

Pages