S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2017 - 03:10

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
- మంత్రి భూమా అఖిల ప్రియ

08/29/2017 - 03:08

కాకినాడ, ఆగస్టు 28: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల మధ్య నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో 2 లక్షల 29వేల 373 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకు 196 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ముందుగా నమూనా పోలింగ్ నిర్వహించి, తర్వాత పోలింగ్ ప్రారంభిస్తారు.

08/29/2017 - 03:08

విజయవాడ, ఆగస్టు 28: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్, రోజాలతో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయిస్తే మాదే విజయమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నంద్యాల ఫలితంతో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధం ఉండదని, అక్కడా భారీ మెజారిటీతో గెలవబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. టిడిపి మూడేళ్ల పాలనకు నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నిదర్శనమని మంత్రి చెప్పారు.

08/29/2017 - 03:07

విజయనగరం, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికలో ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం విజయనగరం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చాక జరిగిన మొట్టమొదటి ఉప ఎన్నిక కావడంతో అందరూ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి కనబరిచారన్నారు.

08/29/2017 - 03:07

విజయవాడ, ఆగస్టు 28: నంద్యాలలో తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించడం ద్వారా నంద్యాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన పట్ల ప్రజలు పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేశారని, ఇది ప్రజా విజయమని మంత్రి శిద్దా రాఘవరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ కనుమరుగు కావటం ఖాయమని జోస్యం చెప్పారు.

08/29/2017 - 03:06

కర్నూలు, ఆగస్టు 28: నంద్యాల శాసనసభ ఉప ఎన్నికలో విజయం సాధించిన టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తన ట్విట్టర్ ద్వారా ఎన్‌డిఎ భాగస్వామి అయిన తెలుగుదేశం ఉప ఎన్నికలో విజయం సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. విజయం కోసం కృషి చేసిన చంద్రబాబు, ఆయన పార్టీ సహచరులకు ప్రశంసలు అందించారు.

08/29/2017 - 03:06

నంద్యాల, ఆగస్టు 28: నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక విజయం వెనుక టిడిపి మంత్రుల నిరంతర శ్రమ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ప్రచార బాధ్యతలను మొత్తం తన భుజస్కంధాలపై వేసుకున్న వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రణాళికాబద్దంగా టిడిపిని విజయతీరాలకు చేర్చడంలో కృతకృత్యులయ్యారని చెప్పాలి.

08/29/2017 - 03:05

కర్నూలు, ఆగస్టు 28: కర్నూలు జిల్లా నంద్యాల శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించడానికి ప్రధాన కారణాలు సానుభూతి, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.

08/29/2017 - 03:04

కర్నూలు, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం అధికారదర్పాన్ని ప్రయోగించి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, తల్లిదండ్రులు లేని పిల్లలంటూ చేసిన ప్రచారం కారణంగానే టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారని వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ నంద్యాలలో విజయం ప్రభుత్వానికి సానుకూల సంకేతమేమీ కాదని అభిప్రాయపడ్డారు.

08/29/2017 - 03:00

అమరావతి, ఆగస్టు 28: రాష్ట్ర రాజకీయాలపై వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అంచనాల గురి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీకి తిరుగులేని పట్టున్న రాయలసీమలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఆ పార్టీకి పట్టుకొమ్మలుగా భావించే ముస్లిం మైనారిటీలు, ముద్రగడ ఆందోళన వల్ల కలసివస్తాయనుకుంటున్న బలిజ, కాపు వర్గాలు దూరమవుతున్నాయా?

Pages