S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2017 - 04:02

ఏలూరు, జనవరి 19 : జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు గల వారిని గుర్తించడానికి, వ్యాధి సోకకుండా ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ వైద్య, ఆరోగ్య శాఖ అధికార్లను ఆదేశించారు. ముఖ్యమైన సెంటర్లలో స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలను ఫ్లెక్సీ బోర్డుమె ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

01/20/2017 - 04:00

రాజమహేంద్రవరం, జనవరి 19: సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించిన గంజాయ సాగు, రవాణా, విక్రయాలపై పోలీసు శాఖ యుద్ధం ప్రకటించింది. ఎక్సైజ్, రైల్వే, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగాల సహకారంతో పూర్తిస్థాయలో అరికట్టడానికి రంగం సిద్ధమయ్యంది.

01/20/2017 - 03:58

చిత్తూరు, జనవరి 19 : గత 63ఏళ్లుగా రాయలసీమ రైతులకు తీరని అన్యాయం జరుగుతూ వస్తోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జ దశరథరామిరెడ్డి ఆరోపించారు. గురువారం నగరంలోని ఓ కళ్యాణ మండపంలో రాయలసీమ నీటి హక్కు సాధన సదస్సును నిర్వహించారు.

01/20/2017 - 03:56

జమ్మలమడుగు, జనవరి 19: రాష్ట్ర ఉత్సవాలుగా ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన గండికోట చారిత్రక వారసత్వ వారోత్సవాలు నిర్వహణ మరోసారి వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015లో సెప్టెంబర్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో గండికోట వారసత్వ వారోత్సవాలను ప్రతియేటా సెప్టెంబర్ మాసంలో నిర్వహిస్తామని ప్రకటించింది. 2016 వారోత్సవాలు సెప్టెంబర్ మాసం నుండి పలుకారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

01/20/2017 - 03:54

మచిలీపట్నం, జనవరి 19: రాష్ట్భ్రావృద్ధిలో స్పేస్ టెక్నాలజీ కీలకం కానుందని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయం, ఎపి స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో డిసిమేషన్ ఆఫ్ గాస్పియల్ టెక్నాలజీ ఫర్ డెవలప్‌మెంట్ అనే అంశంపై ఒక రోజు జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు.

01/20/2017 - 03:54

తోట్లవల్లూరు, జనవరి 19: ఇంటర్వ్యూలకు హాజరు కాని వ్యక్తుల పేర్లను రుణాలు పొందేందుకు ఆన్‌లైన్ చేయటంపై గురువారం ఎంపిడివో పద్మసుధను ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి ప్రశ్నించారు.

01/20/2017 - 03:53

పెడన, జనవరి 19: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో లుక లుకలు బయటపడ్డాయి. పురపాలక సంఘంలో ఆ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు గురువారం కాంట్రాక్టు, ప్యానల్ కమిటీల పదవులకు రాజీనామాలు చేశారు. కమిషనర్ మనె్నం గోపాలరావుకు తమ రాజీనామా పత్రాలను అందచేయటంతో ఆ పార్టీలోని భేదాభిప్రాయాలు బయటపడ్డాయి.

01/20/2017 - 03:52

మచిలీపట్నం, జనవరి 19: మద్యం విక్రయాల్లో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్, పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఎక్సైజ్, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్‌పి ధరలకే మద్యం విక్రయాలు జరగాలన్నారు.

01/20/2017 - 03:51

కూచిపూడి, జనవరి 19: మొవ్వ మండలం గూడపాడు గ్రామానికి చెందిన గొర్రెపాటి సురేష్ వ్యవసాయ భూమిలో సాగుచేసిన చెరకు పంటను గురువారం చల్లపల్లి కెసిపి చెక్కెర కర్మాగారం ఆధ్వర్యంలో యంత్రాలతో కటింగ్ ప్రారంభించారు. తొమ్మిది ఎకరాలలో సాగుచేసిన 2003వి/46, 87ఎ/298 రకాలను రైతు సురేష్ సాగు చేసినట్లు ప్రాంతీయ విస్తరణాధికారి వి శ్రీనివాసరావు తెలిపారు.

01/20/2017 - 03:51

విజయవాడ, జనవరి 19: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రమాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు.

Pages