S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2017 - 03:06

హైదరాబాద్, జనవరి 19: చిత్తూరు జిల్లా గుర్రం కొండ గ్రామంలోని మసీదులో ముస్లింలలో ఆస్లేహెడెస్ తెగకు చెందిన మహిళలు ప్రార్థనలు చేసుకుంటారని, వారిని ఎవరూ భంగ పరచకుండా, ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. గుర్రంకొండ గ్రామానికి చెందిన ఎం సహీరా అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించి మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది.

01/20/2017 - 03:01

ఆదిలాబాద్,జనవరి 19: మామూలుగా సెలవు ఊసే ఉండని ఉద్యోగం.. పోలీసు. ఇతర ఉద్యోగులకు ఉన్నట్లు ఆఫ్‌లు వీరికి ఉండవు. కుటుంబంతో కలసి గడిపే సమయమూ తక్కువే. ఇక అంతా కలసి సినిమా చూడటం దాదాపు అసంభవం. కానీ ఆదిలాబాద్ పోలీసులకు అనుకోని వరం లభించింది. అధికారికంగా సెలవు ఇచ్చి మరీ కుటుంబాలతో కలసి సినిమా చూసే ఛాన్స్ దక్కింది. ఎస్‌పి స్వయంగా ఇచ్చిన అవకాశం ఇది. తానూ వారితో కలసి సినిమా చూడటం..ఓ అరుదైన అనుభవం.

01/20/2017 - 02:59

క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి
తన మనువడి వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేస్తున్న
రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి తదితరులు. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ఉన్నారు.

01/20/2017 - 02:57

న్యూఢిల్లీ, జనవరి 19:ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానం అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు పంపిన ఫైల్‌ను వీలైనంత త్వరగా క్లియర్ చేసి రాష్టప్రతి ఆమోదం కోసం పంపాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ పూల రవీందర్ కేంద్రాన్ని కోరారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ ప్రతినిధుల బృందం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.

01/20/2017 - 02:56

మెదక్, జనవరి 19: తెలంగాణ సంస్కృతి చాలా బాగుందని లండన్‌కు చెందిన విద్యార్థులు అన్నారు. లండన్‌కు చెందిన టీచర్ జోన, స్ట్ఫా నర్స్ శారా, విద్యార్థులు శ్రాచ్, లో, డానియల్, లిండసే మెదక్‌లో నడుస్తున్న రిస్క్ పింక్ ఐసియం సెంటర్‌కు వచ్చారు. మెదక్ జిల్లా శమ్నాపురం గ్రామంలో వీరు గురువారం పర్యటించారు. మహిళల కట్టూబొట్టు, వారి పనులు బాగా నచ్చాయని ఆ విద్యార్థులు తెలిపారు.

01/20/2017 - 02:54

హైదరాబాద్, జనవరి 19: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని హజ్రత్ నిజాముద్దీన్-కొచువెలి మధ్య 42 ఏసి సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ట్రైన్ నెం.

01/20/2017 - 02:53

హైదరాబాద్, జనవరి 19: అసెంబ్లీ సమావేశాల నిర్వాహణలో ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త ఒరవడి సృష్టించారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు వేరువేరుగా జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఉభయ సభలు జరిగిన తీరు మేలు కలిగించే విధంగా ఉన్నాయని ప్రజలు భావిస్తుంటే , ప్రతిపక్షాలకు మాత్రం తీవ్ర నిరాశ కలిగించాయని శాసన మండలిలో విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

01/20/2017 - 02:52

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మతో సమానంగా తనకు పెన్షన్ బెనిఫిట్లను ఖరారు చేసి చెల్లించాలని కోరుతూ ఏసిబి పూర్వ డిజి ఎకె ఖాన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన క్యాట్ కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి, డిజిపి అనురాగ్ శర్మకు నోటీసులు జారీ చేసింది.

01/20/2017 - 02:51

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 18 రోజుల పాటు ప్రశాంతంగా జరిగాయి. అధికార విపక్షాలు చర్చలకే ప్రాధాన్యత ఇచ్చారు. పెద్దగా రాజకీయ విమర్శలు లేకుండా చర్చించే అంశాలకే పరిమితం అయ్యారు. విపక్షం సైతం నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకే ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇదే మాట చెప్పారు.

01/20/2017 - 02:51

న్యూఢిల్లీ, జనవరి 19: రానున్న ఆర్థిక సంవత్సరానికి (2017-18) సంబంధించి త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆ శాఖకు చెందిన ఇతర ఉద్యోగులు గురువారం ‘హల్వా ఉత్సవం’లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

Pages