S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2017 - 04:28

శ్రీకాకుళం(రూరల్), జనవరి 19: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వలన అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, సమగ్ర కార్మిక చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అన్నారు.

01/20/2017 - 04:27

శ్రీకాకుళం: వీరంతా వయస్సు పైబడి చనిపోయిన వారు కాదు..రోడ్డు ప్రమాదంలోనో, కుటుంబ కారణాలతో చనిపోలేదు. కేవలం కిడ్నీరోగం బారినపడి చనిపోతున్నారు. ఇప్పటికీ 894 మంది మృతి చెందితే, 3458 మంది జీవచ్ఛవాల్లా బతుకీడిస్తున్నారు..ఉద్దానంలో నివాసం ఉండడమే వారు చేసిన పాపం. ఉన్నఊరు, కన్నతల్లిని వదిలేసి సుదూరంగా బ్రతుకుజీవుడా..అన్నట్టు వలసబాట పడితే - అప్పటికీ కిడ్నీరోగం ఆ శరీరానికి పట్టకపోతే..సరే!!

01/20/2017 - 04:26

శ్రీకాకుళం, జనవరి 19: జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ ఆదాలత్‌లో పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్‌లో జాతీ య లోక్ ఆదాలత్ పోస్టర్ ఇతర న్యా యమూర్తులతో కలిసి ఆమె లాంఛనం గా ప్రారంభించారు.

01/20/2017 - 04:25

శ్రీకాకుళం, జనవరి 19: రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం కిడ్నీరోగుల పరీక్షలకై ఇంటింటికీ సర్వే నిర్వహించే కార్యక్రమానికి నాంది పలికింది. సుమారు 800 మంది కిడ్నీవ్యాధిగ్రస్తులను పరీక్షలు నిర్వహించేందుకు వైద్య,ఆరోగ్యశాఖ రంగంలోకి దిగింది.

01/20/2017 - 04:24

నెల్లూరు, జనవరి 19: నెల్లూరులో 37వ జాతీయ క్రీడలను నిర్వహించేందుకు ముందస్తు చర్చలు, ఏర్పాట్లు జరుగుతున్నట్లు కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. గురువారం ‘ఖేలో ఇండియా’ అండర్-14 జాతీయస్థాయి క్రీడా పోటీలను నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

01/20/2017 - 04:22

కర్నూలు, జనవరి 19:జిల్లాలోని మార్కెట్ యార్డులకు కొత్త కార్యవర్గాలను ఎంపిక చేయనున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత కార్యవర్గాలకు బుధవారమే పదవీ కాలం ముగిసినా గురువారం కొనసాగింపు ఉత్తర్వులు వస్తాయని ఆశతో ఎదురు చూశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డులకు కొత్త పాలక మండళ్ల నియామకానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలియడంతో ప్రస్తుత కార్యవర్గాలు నిరాశకు గురయ్యాయి.

01/20/2017 - 04:19

ఖమ్మం, జనవరి 19:ప్రజా ప్రయోజనాలకోసమే పెద్దనోట్ల రద్దని, దీనిద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. కొత్తగూడెంలో కృషి విజ్ఞానకేంద్రం శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తూ గురువారం ఖమ్మంలో కొద్దిసేపు ఆగారు.

01/20/2017 - 04:17

గుంటూరు, జనవరి 19: ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం స్థానిక పోలీసుపెరెడ్ గ్రౌండ్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను మంత్రి ప్రత్తిపాటి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబులు ప్రారంభించారు.

01/20/2017 - 04:16

మంగళగిరి, జనవరి 19: రాష్ట్రంలోను, రాజధాని ప్రాంతంలోను ప్రజలకు, రైతులకు చంద్రబాబు చేస్తున్న అన్యాయాలను, అవినీతిని ప్రతిఘటిస్తామని, అన్నదాతలకు వైఎస్‌ఆర్‌సీపీ అన్ని రకాలుగా, తోడుగా అండగా ఉంటుందని , రైతులకు అన్యాయం జరగనివ్వబోమని వైఎస్‌ఆర్ సీపీ అధినేత , ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. గురువారం ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించారు.

01/20/2017 - 04:06

విజయనగరం, జనవరి 19: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5172.62 కోట్లతో క్రెడిట్ ప్లాన్ తయారు చేశారు. గురువారం కలెక్టరెట్‌లో నిర్వహించిన డిసిసి సమావేశ మందిరంలో దీనిని విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపి కె.హరిబాబు మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు, రెండో విడత వ్యవసాయ రుణమాఫీ, ఒబిఎంఎంఎస్ పద్దతిలో పథకాల మంజూరు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.

Pages