S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2017 - 03:21

లక్నో, జనవరి 19: వచ్చే నెల 15న జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ఎన్నికల కోసం నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంనుంచి ప్రారంభం కానుంది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే పశ్చిమ యుపిలోని 11 జిల్లాల్లో విస్తరించి ఉన్న 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం జారీ కానుంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 27 దాకా కొనసాగుతుంది.

01/20/2017 - 03:21

న్యూఢిల్లీ, జనవరి 19: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్తెపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడమే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, గోవా రాష్ట్రాల్లో విజయం సాధించబోతోందనడానికి సంకేతాలని ఆ పార్టీ గురువారం వ్యాఖ్యానించింది.

01/20/2017 - 03:20

న్యూఢిల్లీ, జనవరి 19: 2012లో కేంద్ర బడ్జెట్‌ను ఆలస్యంగా సమర్పించినప్పుడు ప్రభుత్వం పాటించిన విధి విధానాలతో పాటుగా దీనికి సంబంధించి తాజా వివరాలను తెలియజేయాలని ఎన్నికల కమిషన్ క్యాబినెట్ సెక్రటేరియట్‌ను కోరింది. శుక్రవారం ఉదయానికల్లా ఈ వివరాలను తెలియజేయాలని క్యాబినెట్ సెక్రటేరియట్‌కు బుధవారం రాసిన తాజా లేఖలో ఇసి కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

01/20/2017 - 03:19

న్యూఢిల్లీ, జనవరి 19: కాశ్మీర్ వేర్పాటువాది, హురియత్ నేత సయ్యద్ అలి షా గిలానీకి సంబంధించిన ఐదు బ్యాంకు అకౌంట్ ఖాతాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పరిశీలిస్తోంది. వీటిలో రెండు గిలానీ వ్యక్తిగత ఖాతాలు కాగా, మిగిలిన మూడు ఖాతాలు ఇతరులతో సంబంధాలు కలిగివున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. 2014-15లో ఈ ఖాతాల్లో జరిగిన లావాదేవీలపై కూపీ లాగుతున్నారు.

01/20/2017 - 03:12

గుంటూరు, జనవరి 19: రైతు భరోసా యాత్ర పేరుతో రాజధాని గ్రామాల్లో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగింది. ముందుగా సచివాలయం మీదుగా కాన్వాయ్, ర్యాలీలను అనుమతించేదిలేదని పోలీసులు తేల్చిచెప్పారు. షెడ్యూల్ ప్రకారం జగన్ తాడేపల్లి, నిడమర్రు, కురగల్లు, వెలగపూడి, ఉద్ధండరాయనిపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో రైతులతో ముఖాముఖి నిర్వహించాల్సి ఉంది.

01/20/2017 - 03:10

న్యూఢిల్లీ, జనవరి 19: రేషన్ దుకాణాల్లో నగదు రహిత లాలాదేవీలు నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కృష్ణా జిల్లా కలెకర్ట్ బాబు అన్నారు. చౌక దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలను అవలంబిస్తున్న విధానాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోందని ఆయన పేర్కొన్నారు.

01/20/2017 - 03:10

భీమవరం, జనవరి 19: రాష్ట్రంలోని టర్నోవర్ ట్యాక్స్ (టిఒటి), విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వ్యాపారులు కొత్తగా అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)లో చేరేందుకు పరుగులు తీస్తున్నారు. ఎవరికి వారు ఆన్‌లైన్‌లోకి వెళ్ళి తమ పేర్లు, ఫొటోలతో వివరాలను అప్‌లోడ్ చేసుకుంటున్నారు.

01/20/2017 - 03:09

చింతూరు, జనవరి 19: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు పేలడంతో ఒక బాలిక సహా ముగ్గురు మహిళలు మృతిచెందారు.

01/20/2017 - 03:07

న్యూఢిల్లీ, జనవరి 19:విజయవాడ - వేలాంకణి (తమిళనాడు) మధ్య ప్రతి రోజు రైలును నడపాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభుకి ఏంపీ కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నాని కేంద్రమంత్రికి గురువారం లేఖ రాశారు. క్రైస్తవులు నిత్యం వేలాదిమంది ఆంధ్రప్రదేశ్‌నుంచి తమిళనాడులోని వేలాంకణి చర్చికి వెడతారని, విజయవాడ నుంచి నేరుగా రైలు లేనందున ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

01/20/2017 - 03:07

హైదరాబాద్, జనవరి 19: ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి అధిపతుల ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో శాసన సభ పద్దుల కమిటీల సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు ఏపి శాసనసభ కార్యదర్శి కె సత్యనారాయణరావు తెలిపారు. ప్రభుత్వ శాఖలు, డైరెక్టరేట్లు అమరావతికి మారినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనికి అనుగుణంగా తదుపరి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు.

Pages