S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2017 - 02:45

బెంగళూరు, జనవరి 19: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసుకు సంబంధించి ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాతో పాటు ఆయనకు చెందిన కొన్ని సంస్థల నుంచి దాదాపు 9 వేల కోట్ల రూపాయల బకాయిల రికవరీకి చర్యలు చేపట్టేందుకు డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్‌టి) బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

01/20/2017 - 02:44

విశాఖపట్నం, జనవరి 19: విశాఖ నగరంలో ఈ నెల 27, 28 తేదీల్లో సిఐఐ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంయుక్తంగా జరిగే 23వ భాగస్వామ్య సదస్సులో 12 దేశాల వాణిజ్య మంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు పాల్లొంటున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయమిశ్రా వెల్లడించారు.

01/20/2017 - 02:42

హైదరాబాద్, జనవరి 19: డిజిటల్ ఎకానమీ పుంజుకోవాలంటే దేశంలో అద్భుతమైన వౌలిక సదుపాయాలు కల్పించాలని, వచ్చే కేంద్ర బడ్జెట్ కీలకమైనదని సియాంట్ ఫౌండర్ చైర్మన్, నాస్కామ్ పూర్వ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి అన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల డిజిటల్ ఎకానమీ వృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు, చెల్లింపుల సంస్ధలు, కంపెనీలు సమిష్టి భాగస్వామ్యంతో పనిచేయాల్సి ఉందన్నారు.

01/20/2017 - 02:39

ముంబయి, జనవరి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు, త్వరలో రానున్న కేంద్ర బడ్జెట్‌ల నేపథ్యంలో మదుపరులు స్థిరంగా పెట్టుబడులు పెట్టడం మార్కెట్లకు కలిసి వచ్చింది. చమురు, గ్యాస్, పిఎస్‌యు స్టాక్స్ పట్ల మదుపరులు ఉత్సాహం చూపించారు.

01/20/2017 - 02:39

విశాఖపట్నం, జనవరి 19: విశాఖలో ఐటి పరిశ్రమను అభివృద్ధి పరిచేందుకు అవసరమైన విమాన సర్వీసులను విస్తృతపర్చేందుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు. ఎయిర్ కనెక్టివిటీ పెంపొందించాల్సిన రూట్లపై ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో సంప్రదించి వెంటనే వారి నుండి ప్రతిపాదనలు పొంది తమకు పంపిస్తే తదుపరి చర్యలు చేపడతామన్నారు.

01/20/2017 - 02:36

పాట్నా, జనవరి 19: నాణ్యమైన ఎలక్రానిక్ వస్తువులను ఉత్పత్తి చేయడంలో అంతర్జాతీయంగా పేరెన్నికగన్న శ్యాంసంగ్ తన తాజా హ్యాండ్‌సెట్ ‘గెలాక్సీ సి-9ప్రో’ను గురువారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

01/20/2017 - 02:35

హైదరాబాద్, జనవరి 19: అంతర్జాతీయ ఆహార కంపెనీ డనోన్ సంస్ధ పౌష్టికాహార వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. తమ బ్రాండ్ అప్టామిల్ 45 దేశాల్లో ప్రాచుర్యం పొందిందని, ప్రస్తుతం దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు ఆ సంస్ధ ఎండి రొడ్రిగో లిమా తెలిపారు. తమ సంస్ధ దశాబ్ధాలుగా శిశువులకు అవసరమైన పౌష్టికాహారాన్ని సమకూర్చుతున్నట్లు తెలిపారు.

01/20/2017 - 02:34

తడ, జనవరి 19: నెల్లూరు- చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో నెలకొల్పిన శ్రీసిటీ సెజ్‌ను గురువారం కేంద్ర ప్రభుత్వం కామర్స్,పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ విభాగం జాయింట్ సెక్రటరీ వందనకుమార్ సందర్శించారు. ఈమెకు ఎండి రవీంధ్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికి శ్రీసిటీ పారిశ్రామికంగా సాధించిన అభివృద్ధి, ప్రగతి గురించి వివరించారు.

01/20/2017 - 02:33

హైదరాబాద్, జనవరి 19: ఐటి నిపుణులు ఫణీశ్ మూర్తి సిగ్నిటీ టెక్నాలజీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినట్లు ఆ సంస్ధ తెలిపింది. ఫణీశ్‌కు ఐటి రంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉందని, ఫార్చూన్ 500 కంపెనీల్లో పనిచేసిన అపారమైన అనుభవం ఉందన్నారు. ఈ విషయాన్ని సిగ్నిటీ ఎండి సివి సుబ్రహ్మణియమ్ చెప్పారు.

01/20/2017 - 02:33

న్యూఢిల్లీ, జనవరి 19: దేశంలోని ప్రముఖ తనఖా రుణ సంస్థల్లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ తమ రుణాలపై వడ్డీ రేటును 0.15 శాతం తగ్గించింది. ప్రస్తుతమున్న ఖాతాదారులకు వర్తించే ఈ వడ్డీ రేటు తగ్గింపు గురువారం నుంచే అమల్లోకి వస్తుందని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తగ్గించిన రుణ వడ్డీ రేటు ప్రవాస భారతీయులతో పాటు పిఐఓ కార్డులు కలిగి ఉన్నవారికి కూడా వర్తిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.

Pages