S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2017 - 03:50

విజయవాడ, జనవరి 19: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గురువారం ఉదయం నిర్వహించిన జాతీయ సదస్సులో కృష్ణాజిల్లాలో అమలు జరుగుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు రహిత చెల్లింపుల అమలుపై జిల్లా కలెక్టర్ బాబు.ఎ వివరించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ జాతీయ సదస్సులో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానంపై జిల్లా కలెక్టర్ బాబు.ఎ ప్రసంగించారు.

01/20/2017 - 03:49

విజయవాడ (క్రైం), జనవరి 19: అవును.. ఇప్పుడు పోలీసులు తమ పని చేసుకోగలుగుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జనాన్ని చైతన్యవంతులను చేసే దిశగా భాగస్వామ్యమైన నగర పోలీసుశాఖ గత కొద్దిరోజులుగా ‘ఈవెంట్స్’ నిర్వహణలో బిజీగా గడిపేసింది. దీంతో నగర పోలీసుశాఖ దైనందిన విధులు మాత్రం మందకొడిగానే సాగుతూ వచ్చాయి. స్టేషన్ల వారీగా సైతం రొటీన్ పనులు అటకెక్కాయి.

01/20/2017 - 03:49

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 19: నగరంలో త్వరలో ప్రారంభం కానున్న మెట్రో రైల్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ కు అవరోధం కలుగకుండా ప్రత్యమ్నాయ రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ అదేశించారు.

01/20/2017 - 03:39

లక్నో, జనవరి 19: తమదే అసలైన సమాజ్‌వాది పార్టీ అని ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిన యుపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి హోదాలో ఇంతకుముందు తన చిన్నాన్న, యుపి పార్టీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ క్రమశిక్షణా చర్య కింద సస్పెండ్ చేసిన 9 మందిపై సస్పెన్షన్ ఎత్తివేశారు.

01/20/2017 - 03:35

వాషింగ్టన్, జనవరి 19: ‘అంతా బాగుంటుంది.. మనం అందరం బాగుంటాం’ అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చివరి మాటలివి. మరికొద్ది గంటల్లో డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో అమెరికన్లను ఉద్దేశించి ఒబామా మాట్లాడారు. రానున్న రోజుల్లో దేశం మరింత బాగుంటుందనే తాను విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు.

01/20/2017 - 03:33

టెహరాన్, జనవరి 19: ఇరాన్ రాజధాని టెహరాన్‌లోని అత్యంత పురాతన భవనాల్లో ఒకటైన పదిహేను అంతస్తుల ప్లాస్కో బిల్డింగ్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయినట్లు అధికారులు ద్రువీకరించనప్పటికీ భవనం కుప్పకూలిపోయిన సమయంలో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది అగ్నిమాపక సిబ్బంది భవనం లోపల ఉన్నట్లు టెహరాన్ మేయర్ మహమ్మద్ బఘేర్ గలీబాఫ్ చెప్పారు.

01/20/2017 - 03:30

న్యూఢిల్లీ, జనవరి 19: తమిళనాడులో అగ్గి రాజేస్తున్న జల్లికట్టు నిషేధంపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువస్తే న్యాయపరంగా పోరాడాలని జంతుపరిరక్షణ సంస్థ పెటా నిర్ణయించింది. ‘మా పోరాటం జంతువులను హింసించటంపైనే. ఒకవేళ ఆర్డినెన్స్ కనుక వస్తే మా న్యాయవాదులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం’ అని పెటా ప్రతినిధి మనీలాల్ వల్లియత్ తెలిపారు.

01/20/2017 - 03:28

న్యూఢిల్లీ, జనవరి 19: సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పిఏ) తొలగించాలనే డిమాండ్‌తో దాదాపు పదహారేళ్లపాటు నిరాహారదీక్ష చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఇరోమ్ చాను షర్మిల ఎన్నికల బరిలోకి దిగటంతో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

01/20/2017 - 03:25

అమృత్‌సర్, జనవరి 19: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర మంత్రి బిక్రమ్ సింగ్ మఝితియాకు సిట్ క్లీన్‌చిట్ ఇచ్చిన డ్రగ్ రాకెట్ కేసు పునర్విచారణకు ఆదేశిస్తామని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ప్రకటించారు. సిద్దూ ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరారని, పార్టీకోసం ప్రచారం చేస్తారని చెప్పారు.

01/20/2017 - 03:22

కన్నూర్, జనవరి 19: కేరళలోని కన్నూర్ జిల్లాలో గుర్తు తెలియని దుండగుల దాడిలో బిజెపి కార్యకర్త మృతి చెందడంతో జిల్లా అట్టుడికి పోతోంది. కాగా, గురువారం ఉదయం తాలిపరంబ సమీపంలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై నాటుబాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు కానీ, ఆఫీసు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి.

Pages