S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2017 - 01:58

‘నాటో’కు కాలదోషం పట్టింది. బ్రిటన్ ‘ఐరోపా ఏకీకృత విపణి’ వ్యవస్థ- సింగిల్ మార్కెట్- నుంచి వైదొలగడం మిక్కిలి మేలైన పరిణామం.. ఇలాంటి ప్రకటనలతో సంచలనం సృష్టిస్తున్న రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి ఇరవయ్యవ తేదీన అమెరికా నలబయి ఐదవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.

01/20/2017 - 01:56

ఖమ్మం జిల్లా రెండుగా విడిపోయిన తరుణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాద్రి ఆలయంతో పాటు పర్ణశాల, పెద్దమ్మగుడితోపాటు పర్యాటక కేంద్రాలైన కినె్నరసాని, మణుగూరు చేరిపోయాయి.

01/20/2017 - 01:55

చలికాలం వచ్చిందంటే చాలు స్వైన్ ఫ్లూ వ్యాధి విజృంభించడం షరామామూలైంది. ఇది విజృంభిస్తున్నదని వార్తలు వస్తున్నప్పుడే నివారణ కోసం ప్రయత్నాలు జరగడం పరిపాటైంది. స్వైన్‌ఫ్లూ అనేది హెచ్1ఎన్1 అనే వైరస్. దీని బారిన పడ్డ వారికి జ్వరం, గొంతునొప్పి, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ళనొప్పులు, వాంతి వచ్చినట్లు అనిపించడం సహజం.

01/20/2017 - 01:54

‘‘మొన్న సిటీలో మా బంధువుల ఇంటికి వెళ్లాను.. కాలనీలో రాత్రి దొంగతనం జరిగింది.’’
‘‘మీరో రాజరాజ నరేంద్రులు, మీ బోషాణంలో దొంగతనం జరిగితే దొంగలను పట్టుకునే బాధ్యత సైన్యాధ్యక్షుడైన నాకు అప్పగించినట్టు ఆ పోజులేంటి? ఈ రోజుల్లో దొంగతనాలు జరగని కాలనీలు ఉంటాయా? ఇది కామన్’’

01/20/2017 - 01:48

గత ఏడాది మే 17న కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ మహిళా విధానం’ ముసాయిదాను విడుదల చేసింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత వచ్చిన విధానపత్రం అది. ‘జాతీయ, అంతర్జాతీయ నేపథ్యాలలో అనూహ్య మార్పులు వస్తున్న సమయంలో మహిళలు నిర్వహించగల పాత్రను దృష్టిలో వుంచుకుని ఈ విధాన పత్రం రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరిగిన మాట వాస్తవం.

01/20/2017 - 01:42

హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్ పోలీస్ శిక్షణ కేంద్రంలో ఓ ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్యానాకు చెందిన సచిన్ (25) హకీంపేటలోని సిఐఎస్‌ఎఫ్ కేంద్రంలో గత అక్టోబర్ నుంచి ఎస్‌ఐగా శిక్షణ పొందుతున్నాడు. అతను తన గదిలో ఉరేసుకున్నట్టు సహచరులు గమనించి, అధికారులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే ఎస్‌ఐ బలవన్మరణానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు.

01/20/2017 - 01:41

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా గడచిన రెండున్నరేళ్లలో ఆరు వేల పోస్టులను భర్తీ చేశామని, త్వరలో మరో 9వేల పోస్టులను భర్తీ చేస్తామని కమిషన్ చైర్మన్ డాక్టర్ ఘంటా చక్రపాణి చెప్పారు. 2011 గ్రూప్-1 ఫలితాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన కమిషన్ సభ్యులతోపాటు గవర్నర్ నరసింహన్‌ను కలిసి కమిషన్ పనితీరుపై నివేదికను సమర్పించారు.

01/20/2017 - 01:38

హైదరాబాద్, జనవరి 19:తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు నిర్వహించేందుకు ముందుకొచ్చే కొరియన్ సంస్థలకోసం హైదరాబాద్‌లో ఓ ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్ సియోల్‌లోని భారత ఛాంబర్ ఆఫ్ కామర్స్ దక్షిణ కొరియాకు హామీ ఇచ్చారు.

01/20/2017 - 02:09

హైదరాబాద్, జనవరి 19:అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కార్యాలయాల సముదాయాలను ఏడాదిలోగా నిర్మించేందుకు డిజైన్లు ఖరారు చేసి టెండర్లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. వీటి నిర్మాణానికి ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామన్నారు.

01/20/2017 - 01:27

గుంటూరు, జనవరి 19: రాజధాని పేరుతో ప్రతిదీ ఓ కుంభకోణంగా మారుతోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశాలు తిరుగుతూ మాస్టర్ ప్లాన్‌లు రూపొందిస్తున్నామంటూ జనాల్ని వంచిస్తున్నారు.. తన వారికి భూములు కట్టబెట్టి కమిషన్లు దండుకుంటున్నారు. అభివృద్ధికి, రాజధానికి మేం వ్యతిరేకంకాదు..దానివల్ల జరిగే మోసాలనే ప్రశ్నిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

Pages