S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/26/2016 - 07:10

న్యూఢిల్లీ, నవంబర్ 25: చిల్లర లేక సతమతమైన పౌరులకు కొత్తగా వచ్చిన 500 నోటు మరింత ఇరకాటంలో పడేసింది. కొత్త ఐదొందల నోటులో అనేక తేడాలు కనిపించడంవల్ల ప్రజలు బెంబేలెత్తారు. అయితే ఈ తేడా హడావుడిగా ముద్రించడం వల్ల జరిగిందేనని ఆర్‌బిఐ వివరణ ఇచ్చింది. నోటులో ఓ చోట మహాత్మాగాంధీ ముఖం నీడ ఎక్కువగా ఉందని అలాగే జాతీయ చిహ్నంపైనా, సీరియల్ నెంబర్‌పైనా అలైన్‌మెంట్ సరిగ్గాలేదన్న లోపాలు వెలుగులోకి వచ్చాయి.

11/26/2016 - 06:57

నల్లధన కుబేరులకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. నిర్దేశిత పరిమాణానికి మించిన రీతిలో ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమయ్యే మొత్తానికి లెక్కలు చూపించలేని పక్షంలో కనీస పక్షంగా 50 శాతం పన్ను చెల్లిస్తే చాలన్న ప్రకటన చేసింది. అయతే, బ్లాక్‌మనీని సంబంధిత ఖాతాదారు వినియోగానికి అందకుండా నాలుగేళ్ల పాటు తమ వద్దే ఉంచేసుకోవాలని సంకల్పించింది.

11/26/2016 - 06:55

విజయవాడ, నవంబర్ 25:‘కాపులకు బిసి రిజర్వేషన్ల వర్తింపుపై కాంగ్రెస్ పార్టీ ఎన్నోమార్లు తమ ఎన్నికల ప్రణాళికలలో హామీ ఇవ్వడమేగాని అమలుకు నోచుకోలేదు. అయితే టిడిపి దీనికి కట్టుబడి ఉంద’ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విద్యా, ఉపాధి రంగాల్లో కాపులు వెనుకబడి ఉన్నందునే రిజర్వేషన్లు కల్పించదలిచామనీ, దీనివల్ల బిసిల రాజకీయ రిజర్వేషన్లకు ఎలాంటి ముప్పు వాటిల్లబోదంటూ హర్షధ్వానాల మధ్య భరోసా ఇచ్చారు.

11/26/2016 - 06:53

న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశ వ్యాప్తంగా రద్దయిన 500, 1000 నోట్లను తమ కౌంటర్ల వద్ద మార్పిడి చేసుకోవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అన్ని బ్యాంకుల్లోనూ ఈ నోట్ల మార్పిడి ఇక ఉండదని, వాటిని ఆయా ఖాతాదారులు తమతమ ఖాతాల్లోనే జమజేసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఒక్కో వ్యక్తి రెండు వేల చొప్పున ఈ నోట్లను కొత్త నోట్లతో మార్చుకోవచ్చునని..

11/26/2016 - 06:23

ఏలూరు, నవంబర్ 25: కేంద్రంలో అధికారం చేపట్టిన తమది రైతు అనుకూల ప్రభుత్వమని చాటిచెప్పడంలో భాగంగా బిజెపి శనివారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రైతు మహాసభను నిర్వహిస్తోంది. సుమారు లక్షమంది రైతులు తరలివస్తారని అంచనావేస్తున్న ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరువుతున్నారు.

11/26/2016 - 06:14

విజయవాడ (క్రైం), నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ నూతన సచివాలయంలో అవినీతి బోణి చేసింది. ఓ పేరు మోసిన సెక్యూరిటీ కంపెనీకి అనుమతి జారీ చేసేందుకు రూ.50వేలు లంచం తీసుకుంటూ సెక్షన్ ఆఫీసర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయాడు. ఈ సంఘటన సచివాలయంలో కలకలం రేకెత్తించింది.

11/26/2016 - 06:11

న్యూఢిల్లీ, నవంబర్ 25: ‘అవినీతి, నల్లధనానికి కొందరు బాహాటంగా మద్దతిస్తున్నారు. దీనివల్ల భావితరాలకు తీరని అన్యాయం జరుగుతుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షంపై పరోక్ష ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని బాలయోగి గ్రంథాలయంలో బిజెపి సీనియర్ నాయకుడు కేదార్‌నాథ్ సహానిపై రచించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించారు.

11/26/2016 - 06:09

నల్లధనం నిర్మూలనకే పెద్ద నోట్ల రద్దు ఉగ్రవాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరు
పోలీసు వ్యవస్థలో పారదర్శకత ఉండాలి టెక్నాలజీతో జాతివిద్రోహులపై ఉక్కుపాదం
డిజిపిల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్‌సింగ్ పిలుపు

11/26/2016 - 05:09

న్యూఢిల్లీ, నవంబర్ 25: టాటా సన్స్ సంస్థ మాజీ అధినేత సైరస్ మిస్ర్తిని టాటా స్టీల్స్ సంస్థ శుక్రవారం తమ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించింది. టాటా స్టీల్స్ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం ముంబయిలో సమావేశమై చైర్మన్ పదవి నుంచి మిస్ర్తికి ఉద్వాసన పలికింది.

11/26/2016 - 05:06

కర్నూలు, నవంబర్ 25: రానున్న ఏడాది కాలంలో ప్రస్తుతం ఉన్న ఎటిఎంల స్థానంలో సిడిఎం (క్యాష్ డిపాజిట్ మిషన్)ల ఏర్పాటుకు ప్రాధాన్యనివ్వనున్నట్లు బ్యాంకర్ల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎటిఎంలలో చాలా వరకూ సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని వాటిని మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు స్వస్తిపలికి మరమ్మతులతో కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Pages