S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/26/2016 - 05:06

హైదరాబాద్, నవంబర్ 25: దేశంలోని దాదాపు 84 లక్షల మంది ఖాతాదారులకు నగదు ఉపసంహరణ కోసం వొడాఫోన్ ఇండియా వినూత్నమైన సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు తమ డిజిటల్ వాలెట్‌ను ఉపయోగించి దేశ వ్యాప్తంగా 1.20 లక్షల వొడాఫోన్ ఎం-పెసా ఔట్‌లెట్లలో లభ్యతను అనుసరించి నగదును విత్ డ్రా చేసుకోవచ్చని ఆ సంస్థ బిజినెస్ హెడ్ సురేష్ సేథీ తెలిపారు.

11/26/2016 - 05:05

న్యూఢిల్లీ, నవంబర్ 25: పెద్ద నోట్ల రద్దు వలన భారత దేశ వృద్ధి రేటుపై స్వల్పకాలికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) క్షీణత ఒక మోస్తరుగా ఉంటుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ ‘్ఫచ్’ శుక్రవారం పేర్కొంది.

11/26/2016 - 05:05

ముంబయి, నవంబర్ 25: గత రెండు రోజులుగా వరస పతనంతో సతమతమైన స్టాక్ మార్కెట్ శుక్రవారం కొంతమేర నిలబడింది. ఐటి, ఫార్మా రంగాలు బలంగా నిలదొక్కుకున్న నేపథ్యంలో ఏకంగా 456 పాయింట్లు పెరిగి 26 వేల మార్కుకు చేరుకుంది. అదేవిధంగా అమెరికా డాలర్ విలువతో విలవిల్లాడుతూ వచ్చిన రూపాయి కూడా కొంతమేర పుంజుకోగలిగింది. అక్టోబర్ 18 తర్వాత సెనె్సక్స్ ఒకే రోజు 456 పాయింట్లు పెరగడం ఇదే మొదటిసారి.

11/26/2016 - 04:24

కౌలూన్, నవంబర్ 25: భారత బాడ్మింటన్ స్టార్లు, హైదరాబాదీలు పివి సింధు, సైనా నెహ్వాల్ మధ్య పోరు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు టైటిల్ వేటను కొనసాగిస్తుండగా, సైనా పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. అంతేగాక, కెరీర్‌లో మొట్టమొదటిసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు కంటే వెనుకబడింది.

11/26/2016 - 04:21

మొహాలీ, నవంబర్ 25: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు డ్రాగా ముగియగా, రెండో టెస్టులో విజయభేరి మోగించి 1-0 ఆధిక్యానికి దూసుకెళ్లిన భారత్ ఆత్మవిశ్వాసంతో శనివారం నుంచి మొదలయ్యే మూడో టెస్టుకు సిద్ధంకాగా, ఒక మ్యాచ్‌ని కోల్పోయిన ఇంగ్లాండ్ ఆత్మరక్షణలో పడింది. ఈ మ్యాచ్‌ని చేజార్చుకుంటే, చివరి రెండు టెస్టుల్లో గెలిస్తేగానీ సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశం ఉండదు.

11/26/2016 - 04:20

అడెలైడ్, నవంబర్ 25: ఓపెనర్ ఉస్మాన్ ఖాజా సూపర్ సెంచరీతో నాటౌట్‌గా నిలవడంతో, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ, చివరి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఆరు వికెట్లకు 307 పరుగులు చేయగలిగింది.

11/26/2016 - 04:20

మొహాలీ: వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ సుమారు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. రెగ్యులర్ కీపర్ వృద్ధిమాన్ సాహా కాలి కండరాలు బెణకడంతో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతని స్థానంలో వృషభ్ పంత్ టెస్టు ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ, ఎవరి అంచనాలకు అందని రీతిలో పార్థీవ్ ఈ అవకాశాన్ని దక్కించుకున్నాడు.

11/26/2016 - 04:19

బాల్ ట్యాంపరింగ్‌పై స్పష్టతనివ్వాలని ఐసిసిని కుక్ కోరాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు బ్రిటిష్ మీడియాలో వచ్చిన వార్తలపై అతను స్పందిస్తూ, ఈ విషయంలో మరింత స్పష్టమైన దిశానిర్దేశనం చేయాల్సిన అవసరం ఉందని ఐసిసికి సూచించాడు.

11/26/2016 - 04:13

దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాలను మేటి నగరాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ నగరాల (స్మార్ట్ సిటీస్) పథకం ఇపుడిపుడే ఊపందుకుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ తీరు చూసి ఈ పథకం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవచ్చని, ఇదో సుదూర స్వప్నంగా మిగిలిపోతుందా? అంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.

11/26/2016 - 04:10

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఏటా నవంబర్ 14 నుండి గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తుంటారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రంథాలయంలో వారం రోజులపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. విద్యార్థులకు, మహిళలకు వ్యాస రచన, చిత్రలేఖనం, రంగోళి, ఉపన్యాసం, క్విజ్, పాటలు, నృత్యాలు తదితర పోటీలు నిర్వహించి చివరిరోజున బహుమతులు ప్రదానం చేయాల్సి ఉంటుంది.

Pages